breaking news
star wrestlers
-
డబ్ల్యూఎఫ్ఐ తీరును తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను దేశీయ టోర్నమెంట్లలో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటించిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన స్టార్ రెజ్లర్‌తో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని సూచించింది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ పోటీపడొచ్చా లేదా అనే అంశంపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ధర్మాసనం తెలిపింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించి 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్... ఆ తర్వాత రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో తల్లి అయిన వినేశ్... ఇప్పుడు తాజాగా తిరిగి మ్యాట్‌పై అడుగు పెట్టేందుకు ప్రయత్నించగా... డబ్ల్యూఎఫ్ఐ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై వినేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రసూతి విరామం నుంచి తిరిగి బరిలోకి దిగాలనుకుంటున్న రెజ్లర్‌ను... తల్లి అయినందుకు నిందించకూడదని ధర్మాసనం వెల్లడించింది. దేశంలో మాతృత్వానికి ఎంతో గొప్పదనం ఉందని... వినేశ్ పట్ల రెజ్లింగ్ సమాఖ్య ప్రతీకార ధోరణితో వ్యవహరించకూడదని ధర్మాసనం నొక్కిచెప్పింది. అంతర్జాతీయ సమాఖ్యలు అనుమతిచ్చాక కూడా దేశం నుంచి మద్దతు లేకపోవడాన్ని తప్పుపట్టింది. 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి వినేశ్ అనర్హతకు గురైన అంశాన్ని దేశం క్రీడాస్ఫూర్తితో స్వాగతించిన విషయాన్ని మరవకూడదని న్యాయస్థానం సూచించింది. అంతకుముందు 2023లో డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై పలువురు యువ రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేయగా... వారికి మద్దతుగా బజరంగ్, సాక్షి మలిక్‌తో కలిసి వినేశ్ ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేపట్టిన విషయం తెలిసిందే. -
భళా... బజరంగ్
ఆస్టిన్ (అమెరికా): భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఈ ఏడాదిని స్వర్ణ పతకంతో ముగించాడు. అమెరికాలోని ఆస్టిన్ నగరంలో జరిగిన ఫ్లో రెజ్లింగ్ ఇన్విటేషనల్ అంతర్జాతీయ క్లబ్ టోర్నీలో బజరంగ్ విజేతగా నిలిచాడు. 68 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ హరియాణా రెజ్లర్ అజేయంగా నిలిచాడు. ఎనిమిది మంది రెజ్లర్ల మధ్య నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ ఈవెంట్లో బజరంగ్ బరిలోకి దిగిన మూడు బౌట్లలో గెలుపొందాడు. ముందుగా క్వార్టర్ ఫైనల్లో 6–1తో ప్యాట్ లుగో (అమెరికా)పై నెగ్గిన బజరంగ్... సెమీఫైనల్లో 9–0తో ఆంథోనీ యాష్నాల్ట్ (అమెరికా)ను ఓడించాడు. ఫైనల్లో బజరంగ్ 8–4తో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత జేమ్స్ గ్రీన్ (అమెరికా)పై విజయం సాధించాడు. తొలి రౌండ్ ముగిసేసరికి ఇద్దరూ 4–4తో సమఉజ్జీగా ఉండగా... రెండో రౌండ్లో బజరంగ్ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా నాలుగు పాయింట్లు గెలిచాడు. విజేతగా నిలిచిన బజరంగ్‌కు 25 వేల డాలర్లు (రూ. 18 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది. బజరంగ్ రెగ్యులర్‌గా 65 కేజీల విభాగంలో... జేమ్స్ గ్రీన్ 70 కేజీల విభాగాల్లో పోటీపడతారు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన బజరంగ్ వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. -
‘పట్టు’ పట్టండి...
నేటి నుంచి ప్రొ రెజ్లింగ్ లీగ్ బరిలో స్టార్ రెజ్లర్లు న్యూఢిల్లీ: క్రీడాభిమానులను అలరించేందుకు మరో లీగ్ సిద్ధమైంది. క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ లీగ్‌ల సరసన తాజాగా రెజ్లింగ్ లీగ్ చేరింది. భారత్‌తోపాటు పలువురు విదేశీ స్టార్ రెజ్లర్లు బరిలో దిగుతుండగా... ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)కు గురువారం తెర లేవనుంది. ఈనెల 27న ముగిసే ఈ లీగ్‌లో విజేత జట్టుకు రూ. 3 కోట్లు అందజేస్తారు. తొలి రోజున ఢిల్లీ వీర్‌తో పంజాబ్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఈ రెండు జట్లతోపాటు హరియాణా హ్యామర్స్, ఉత్తరప్రదేశ్ వారియర్స్, బెంగళూరు యోధాస్, ముంబై గరుడ జట్లు టైటిల్ రేసులో ఉన్నాయి. భారత స్టార్ రెజ్లర్లు యోగేశ్వర్ దత్, అమిత్ దహియా హరియాణా జట్టులో, సుశీల్ కుమార్ ఉత్తరప్రదేశ్ జట్టులో, నర్సింగ్ యాదవ్, బజరంగ్ బెంగళూరు జట్టులో ఉన్నారు. లీగ్ దశ ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ప్రతి జట్టులో ఐదుగురు పురుష రెజ్లర్లు, నలుగురు మహిళా రెజ్లర్లు ఉన్నారు. ప్రతి మ్యాచ్‌లో తొమ్మిది బౌట్లు ఉంటాయి. భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఉత్తరప్రదేశ్ వారియర్స్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ వీర్ ్ఠ పంజాబ్ రాయల్స్ నేటి రాత్రి గం. 7.00 నుంచి సోనీ మ్యాక్స్, సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం.


