breaking news
Stan lee
-
కలుసుకోని ఆత్మీయులం
స్టాన్ లీ... కామిక్స్ ప్రపంచంలో ‘స్పైడర్ మేన్, ఐరన్ మేన్, హల్క్, డాక్టర్ స్ట్రేంజ్, కేప్టెన్ మార్వెల్’.. వంటి సూపర్ హీరోలు ఆయన ఊహల్లో పురుడు పోసుకున్నవాళ్లే. ఇటీవలే స్టాన్ లీ మర ణించిన సంగతి తెలిసిందే. కామిక్స్‌తో తమ బాల్యాన్ని ఊహల్లో విహరించేలా చేసిన వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని తట్టుకోలేకపోయారు ఆయన అభిమానులు. స్టాన్ లీని అభిమానులు ఎంతగా ప్రేమించారో, అభిమానులను స్టాన్ లీ అంతే ప్రేమించారు. స్టాన్ లీ చనిపోయే కొన్ని రోజుల ముందు తన అభిమానుల కోసం ఒక వీడియోను రికార్డ్ చేశారు. అందులో ఆయన ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ – ‘‘నా అభిమానులు నన్ను ఎంతగా ప్రేమిస్తారో, నేనూ వాళ్లను అంతే ప్రేమిస్తాను. మేం ఎప్పుడూ కలుసుకోని ఆత్మీయులం. మనల్ని పట్టించుకునే వాళ్లు ఉండటాన్ని మించిన అదృష్టం ఉండదు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఫ్యాన్స్ వల్లే నాకీ స్టేటస్, నన్ను గొప్పవాడిని చేసింది వాళ్లే. నా ఫ్యాన్స్‌కి నేనెప్పటికీ రుణపడి ఉంటాను’’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి స్టాన్ లీ అభిమానులు ఉద్వేగానికి గురవుతున్నారు. -
స్పైడర్ మ్యాన్ సృష్టికర్త మృతి
ప్రముఖ అమెరికన్ కామిక్ రచయిత, స్పైడర్ మ్యాన్ సృష్టికర్త స్టాన్లీ (95) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూయార్క్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ‘స్పైడర్ మ్యాన్, ఎక్స్–మెన్, థోర్, ఐరన్‌మ్యాన్, బ్లాక్‌పాంథర్, ద ఫెంటాస్టిక్ ఫోర్, అవెంజర్స్’, డాక్టర్ స్ట్రేంజ్’, డేర్ డెవిల్’, ‘హల్క్’.. లాంటి సూపర్ హీరో పాత్రలు ఆయన సృష్టించినవే. 1922 డిసెంబర్ 28న జన్మించిన స్టాన్లీ 1961లో మార్వెల్ కామిక్స్‌లో చేరారు. 1961లో తొలిసారి ‘ద ఫెంటాస్టిక్ ఫోర్’ పేరుతో క్యారెక్టర్లను సృష్టించిన ఆయన ఆ తర్వాత ఎన్నో సూపర్ హీరో పాత్రలకు ప్రాణం పోశారు. హాలీవుడ్లో ‘ఫాదర్ ఆఫ్ పాప్ కల్చర్’గా గుర్తింపు తెచ్చుకున్న స్టాన్లీ రచయిత, ఎడిటర్, పబ్లిషర్‌గా కూడా కొనసాగారు. ఆయన ఇక లేరనే వార్త కామిక్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘మార్వెల్ కామిక్ పుస్తకాన్ని తెరిచినప్పుడల్లా స్టాన్లీనే గుర్తొస్తారు’ అని మార్వెల్ సంస్థ వెల్లడించింది. ఆయన మృతికి హాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు భారతీయ సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. -
సూపర్ హీరోల సృష్టికర్త మృతి
ప్రపంచ వినోద రంగానికి స్పైడర్ మేన్, బ్లాక్ పాంతర్, ఐరన్ మేన్, ఎక్స్‌మేన్ లాంటి సూపర్‌హీరోలను అందించిన ప్రముఖ రచయిత స్టాన్లీ సోమవారం కన్నుమూశారు. మార్వెల్ కామిక్స్‌కు గాడ్‌ఫాదర్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టాన్లీ 1922 డిసెంబర్ 22న జన్మించారు. లీ తండ్రి ఎక్కువగా అడ్వంచర్ నవలలను చదివారు. ఆ ప్రభావమే లీని రచయితగా మార్చింది. డిగ్రీపూర్తి చేసిన తరువాత పలు నాటకాలను స్వయంగా రాసి, నటించారు కూడా. 1939లో మార్వెల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన లీ, రెండేళ్ల తరువాత అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న కెప్టెన్ అమెరికా పాత్ర కోసం ఓ కథను రెడీ చేశారు. తరువాత అదే కంపెనీలో అంచలంచెలుగా ఎదుగుతూ ఎడిటర్ స్థాయిలో దశాబ్దాల పాటు సేవలందించారు. 1961లో తొలిసారిగా ఫెంటాస్టిక్ ఫోర్ పేరుతో సూపర్‌హీరో టీంను సృష్టించిన లీ.. 2002లో తన ఆత్మకథను ‘ఎక్సెల్షియర్! ద అమేజింగ్ లైఫ్ ఆఫ్ స్టాన్ లీ’ పేరుతో విడుదల చేశారు. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ నటులు, నిర్మాతలు సంతాపం తెలిపారు. -
వాళ్ల రాతల్లో నేనూ చనిపోయే ఉంటా!
‘‘నాకిప్పుడు 95 ఏళ్లు. నాకేమనిపిస్తోందంటే, రేపు పొద్దున నేను చనిపోతే, వెంటనే పేపర్లలో న్యూస్ వేసుకోవాలి కాబట్టి ఇప్పటికే చాలామంది నేను చనిపోయినట్టు రాసి పెట్టుకొని ఉండొచ్చు. అయితే ఆ రోజు తొందరగా రావొద్దని కోరుకుంటా’’ అని గట్టిగా నవ్వారు స్టాన్లీ. చావు మీద స్టాన్లీ వేసిన జోక్ ఇది. డార్క్ జోక్. స్పైడర్‌మేన్, ఐరన్‌మేన్, ఎక్స్‌మేన్.. ఇలా సూపర్‌హిట్ మార్వెల్ కామిక్స్ క్యారెక్టర్స్‌ను సృష్టించిన వారిలో ఒకరైన స్టాన్లీ.. మార్వెల్ కామిక్స్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. మొన్న డిసెంబర్ 28న తన 95వ పుట్టినరోజు జరుపుకున్న స్టాన్లీ, ఆ సందర్భంగానే పై జోక్ పేల్చారు. ఈ జోక్ వెనక ఒక విచిత్రమైన కథ ఉంది. కెరీర్ మొదట్లో స్టాన్లీ ఓ ప్రముఖ పత్రికలో పనిచేసేవారట. ఎవరైనా పేరున్న వ్యక్తి చనిపోతే, గంటలోపే మూడు పేజీల మ్యాటర్ రెడీ అయి బయటకొచ్చేదట. ఎలా? అని అడిగితే, పోతారనుకున్న వాళ్ల లిస్ట్ రెడీ చేస్కోవడం వల్లే అంటారు స్టాన్లీ. ‘‘ఇది ఇప్పటికీ జరుగుతుందని అనుకుంటున్నా. నా గురించి కూడా రాసి పెట్టుకొనే ఉంటారు. సంతోషించదగ్గ విషయం ఏంటంటే, నేను ఈ స్థాయికి రావడం’’ అన్నారు స్టాన్లీ.. తత్వాన్ని, చమత్కారాన్ని ఒకే మాటలో కలిపేస్తూ! -
మనం మెచ్చిన హాలీవుడ్!
హాలీవుడ్‌కు ప్రపంచమంతా మార్కెట్ ఉన్న రోజుల్లో, ఆ సినిమాలు ఆడని ఒకే ఒక్క మార్కెట్ ఇండియా అంటారు. అలాంటి ఇండియన్ సినిమా మార్కెట్లోకీ హాలీవుడ్ చొచ్చుకొచ్చి రెండు దశాబ్దాలు దాటింది. ఈ రెండు దశాబ్దాల్లో ఇండియన్ సినిమా అభిమానికి హాలీవుడ్ పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ‘జురాసిక్ పార్క్’ చూసి సంబరపడిపోయాం. ‘టైటానిక్’ చూసి అద్భుతం అనేసుకున్నాం. ‘స్పైడర్‌మేన్’ అన్నాం. ‘టెర్మినేటర్’ వెంటపడ్డాం. ‘అవతార్’ ప్రపంచంలో కొట్టుకుపోయాం. ‘ఇంటర్స్టెల్లార్’ను వింతగా చూశాం. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అద్భుతాలు సృష్టించగల పేరున్న హాలీవుడ్ సినిమాలు ఇండియాలోనూ ఆ పేరుతోనే పాపులర్ అయ్యాయి. ఆ జానర్ సినిమాలే ఇక్కడ ఫేమస్. ఇక గతేడాది హాలీవుడ్‌కు ఇండియన్ సినిమా మంచి మార్కెట్‌గా అవతరించింది. 2017లో వండర్‌వుమన్, స్పైడర్‌మేన్ లాంటి సూపర్‌హీరో సినిమాలు ఇండియాలో దుమ్మురేపాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. యాక్షన్, అడ్వెంచరస్ సినిమాలకే ఇండియాలో ఇప్పటికీ క్రేజ్ కనిపిస్తుందన్నది ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఇక 2017కి ఏమాత్రం తగ్గకుండా ఇండియన్ సినిమా అభిమాని టేస్ట్‌కి తగ్గ భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలు 2018లోనూ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు వచ్చేస్తున్నాయి. ఇండియాలో ఈ ఏడాది చాలా సినిమాలే దుమ్మురేపుతాయని ట్రేడ్ భావిస్తోంది. ముఖ్యంగా ‘జురాసిక్ వరల్డ్ 2’, ‘అవెంజర్స్’, ‘డెడ్‌పూల్ 2’, ‘బ్లాక్ పాంథర్’, ‘ఎక్స్ మెన్’ తదితర సినిమాలపై ట్రేడ్ భారీ అంచనాలే పెట్టుకుంది. ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ మార్క్ అన్నది ఇండియాలో హాలీవుడ్ సినిమాకు కామన్ అయిపోయింది. ఈ ఏడాది సరికొత్త రికార్డులు సెట్ చేసే సినిమాలు వస్తున్నాయని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మరి ఆ అంచనాలను ఈ భారీ బడ్జెట్ సినిమాలు అందుకుంటాయా? చూడాలి! -
సైకో.. స్టాన్లీ
ప్రతి మనిషిలోనూ మంచీ చెడూ ఉంటాయి. మంచి ఎక్కువ ఉంటే అతడు మహానుభావుడు అవుతాడు. చెడు హద్దులు దాటితే రాక్షసుడు అవుతాడు. మహానుభావుడు కాకపోయినా ఫర్వాలేదు. రాక్షసుడు కాకుండా ఉంటే చాలు. ఇతరుల జీవితాలతో, ప్రాణాలతో ఆడుకోకుండా ఉంటే చాలు. అతణ్ని చూశాక అందరికీ ఇలానే అనిపించింది. ఇలాంటివాడు ఇక పుట్టకుండా ఉంటే బాగుణ్ననిపించింది. ఇంతకీ ఎవరతడు? ఏం చేశాడు? ఫిబ్రవరి 8, 1983... ఇంగ్లండ్. ఆఫీసులో కూర్చుని తన ఇద్దరు అసిస్టెంట్లకు ఓ కేసు గురించి వివరిస్తున్నాడు డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ పీటర్ జే. అంతలో ఫోన్ రింగయ్యింది. తీసి ‘హలో’ అన్నాడు. ‘‘హలో... మిస్టర్ జే. దిసీజ్ ఇన్స్పెక్టర్ స్టాన్లీ. మీతో కాస్త పనుంది, ఒకసారి రాగలరా’’... ఆ మాటలోని తీవ్రతను బట్టి తను వెళ్లడం ఎంత అవసరమో అంచనా వేసుకున్నాడు జే. ఫోన్ పెట్టేసి, తన అసిస్టెంట్లను తీసుకుని బయలుదేరాడు. అరగంటలో వాళ్లు ‘23, క్రాన్లీ గార్డెన్స్’ దగ్గర ఉన్నారు. ‘‘ఏమయ్యింది’’ అన్నాడు జే. ‘‘వాళ్లను అడగండి’’ అంటూ ఎదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల వైపు చూపించాడు స్టాన్లీ. వాళ్లవైపు చూశాడు జే. యూనిఫామ్, దాని మీద ఉన్న ముద్రలను బట్టి ఆ ఇద్దరూ డ్రైనేజీ పని చేయడానికి వచ్చిన వారని అర్థమయ్యింది. ‘‘ఏం జరిగింది’’ అన్నాడు వాళ్ల ముఖాల్లోకి చూస్తూ. ‘‘నా పేరు మైఖేల్ సర్. ఈయన మా సూపర్వైజర్ గ్యారీ వీలర్. డ్రైనేజీ బ్లాక్ అవుతోందని ఈ ఇంట్లో అద్దెకుండేవాళ్లు నిన్న సాయంత్రం కంప్లయింట్ ఇచ్చారు. నేను పొద్దున్నే వచ్చి చూస్తే డ్రైనేజీకి అడ్డంగా ఏవేవో ఉన్నాయి. అవి చూసి అనుమానం వచ్చి మా సార్‌కి ఫోన్ చేశాను’’... గడగడా చెప్పాడో వ్యక్తి. ‘‘అడ్డంగా ఉన్నాయా... ఏంటవి?’’ అనుమానంగా అన్నాడు జే.‘‘మాంసపు ముద్దల్లాగా అనిపించాయి సర్. ఎముకలు కూడా ఉన్నాయి.’’ ‘‘వ్వా...ట్? నిజమేనా’’ అన్నాడు జే ఆశ్చర్యంగా. నిజమేనన్నట్టు తలాడించాడు స్టాన్లీ. ‘‘అందుకే మిమ్మల్ని రమ్మన్నాను జే. చూస్తుంటే మాంసంలానే ఉంది. కాకపోతే మనిషిదో, జంతువుదో తెలియక ల్యాబ్‌కి పంపించాను. కాసేపట్లో రిపోర్ట్ వస్తుంది’’ అంటుండగానే ఓ వ్యక్తి వచ్చి కవర్ ఇచ్చాడు. దాన్ని జేకి అందించాడు స్టాన్లీ. ‘‘మై గాడ్’’.. మనిషి మాంసమే. ‘‘పైగా ఒకరిది కాదు, చాలామందిది కలిసుంది’’అందరూ అవాక్కయ్యారు. ‘‘మనుషుల మాంసమా?’’... భయంగా అన్నాడు మైఖేల్. ‘‘మీరిక వెళ్లండి. అవసరమైతే కబురు పెడతాం’’ అన్నాడు స్టాన్లీ. వాళ్లిద్దరూ తలూపి అక్కడ్నుంచి కదిలారు. కానీ మైఖేల్ ఆగి వెనక్కి వచ్చాడు. ‘‘సర్... మీకో విషయం చెప్పాలి. పొద్దున్న నేను... డ్రైనేజీ చెక్ చేయాలని చెప్పినా కింది పోర్షన్లోకి వ్యక్తి లోపలికి రానివ్వలేదు. తర్వాత చూద్దాం అంటూ తలుపు మూసేసుకున్నాడు.’’జే, స్టాన్లీలు ముఖాలు చూసుకున్నారు. జే తలాడించాడు... నేను చూసుకుంటాను అన్నట్టుగా. రాత్రి పది కావస్తోంది. తన అసిస్టెంట్లతో కలిసి ఎవరికీ కనిపించకుండా చీకట్లో నిలబడి ఉన్నాడు జే. ముగ్గురి కళ్లూ ఆ ఇంటి మీదే ఉన్నాయి. ఓ అరగంట తర్వాత ఓ కారు మెల్లగా వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఓ వ్యక్తి దిగి వెళ్లి గేటు తీసుకున్నాడు. తర్వాత కారెక్కి లోనికి వెళ్లిపోయాడు. కారు పార్క్ చేసి మళ్లీ వచ్చి గేటు వేశాడు. ఓసారి అటూ ఇటూ చూసి లోపలికి వెళ్లి తలుపేసుకున్నాడు. వెంటనే ముగ్గురూ ఇంటివైపు నడి చారు. నాలుగైదుసార్లు కాలింగ్‌బెల్ కొడితేనే గానీ తలుపు తీయలేదా వ్యక్తి. జే బృందాన్ని చూసి తేరిపార చూసి, ‘‘ఏం కావాలి’’ అన్నాడు సీరియస్‌గా. ‘‘నేను డిటెక్టివ్ జే... వీళ్లు నా అసిస్టెంట్లు. మీ ఇంటి డ్రైనేజీ బ్లాక్ అయ్యిందంట కదా... ఓసారి చూడాలి.’’ ‘‘డ్రైనేజీతో పోలీసులకి, డిటెక్టివ్లకీ ఏంటి సంబంధం?’’ చురుక్కున చూశాడు జే. ‘‘అది తర్వాత చెప్తాను. ముందు మా పని మమ్మల్ని చేసుకోనివ్వు’’ అంటూ లోనికి జొరబడ్డాడు. లోపల అడుగు పెడుతూనే మాంసం కుళ్లిన వాసన గుప్పుమంది. ముగ్గురూ ఖర్చీఫులు తీసి ముక్కుకు అడ్డు పెట్టుకున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో గదిలోకి దూసుకెళ్లారు. కాసేపటి తర్వాత అసిస్టెంట్ వంటింట్లోంచి అరిచాడు... ‘‘సర్... ఇటు రండి’’. జే అటు పరుగెత్తాడు. అప్పటికే రెండో అసిస్టెంట్ కూడా అక్కడున్నాడు. ఆ ఇద్దరి ముఖాలూ పాలిపోయాయి. ‘‘ఏమైంది’’ అంటూ వంటింట్లోకి వెళ్లాడు జే. అంతే... కడుపులో తిప్పినట్టయ్యింది. వంట గది నిండా మాంసపు ముద్దలు చెల్లా చెదరుగా పడివున్నాయి. అవి మా నుంచే తీశారు అన్నట్టుగా రెండు మృతదేహాలు... మొండెం నుంచి వేరు చేయబడ్డ కాళ్లు, చేతులు... ఒలిచిన చర్మం... మాంసం తీసేయగా మిగిలిన ఎముకలు... ‘‘ఏంటి సర్ ఇది? ఇంత దారుణంగా...’’... మాట పూర్తి చేయలేకపోయాడు అసిస్టెంట్. ‘‘మనిషా, రాక్షసుడా’’ అంటూ ఆవేశంగా హాల్లోకి వచ్చాడు జే. ఆ వ్యక్తి సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు. కనీసం అతడు పారిపోవడానికి కూడా ప్రయత్నించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది ముగ్గురికీ. మెల్లగా వెళ్లి అతడికెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. ‘‘నా పేరు డెన్నిస్ నిల్సన్. ఇదంతా చేసింది నేనే. మీరు నన్ను అడగబోయే రెండు ప్రశ్నలకూ ఇవే సమాధానాలు.’’ ఎలా రియాక్టవ్వాలో అర్థం కాలేదు జేకి. తన సర్వీస్‌లో ఎంతోమంది నేరస్తులను చూశాడు. కానీ ఇలాంటి వ్యక్తినీ చూడలేదు. ఇలాంటి కేసునూ డీల్ చేయలేదు. ‘‘ఎందుకు చేశావిదంతా? వాళ్లు ఎవరు? ఎందుకు చంపావ్?’’... ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘‘మీకు మరీ తొందరెక్కువ మిస్టర్ జే. అన్నీ ఇక్కడే అడిగేస్తున్నారు. పదండి... స్టేషన్‌కి వెళ్లి మాట్లాడుకుందాం’’ అంటూ లేచాడు. అతణ్ని పోలీసులకు అప్పగించడానికి బయలుదేరింది జే బృందం. ‘‘సరిగ్గా గుర్తులేదు సర్. పదిహేనో, పదహారో అనుకుంటాను’’ ఉలిక్కిపడ్డాడు స్టాన్లీ. ‘‘అన్ని హత్యలు ఎందుకు చేశావ్?’’ ‘‘ప్రేమ కోసం’’... ‘‘చంపితే ప్రేమ దొరుకుతుందా?’’ ‘‘చంపితే దొరుకుతుందని కాదు. దొరకలేదు కాబట్టి చంపాను. వాళ్లందరినీ నేను ప్రేమించాను. కానీ ఎవ్వరూ నా ప్రేమను అర్థం చేసుకోలేదు.’’ ‘‘అంటే వాళ్లంతా ఆడవాళ్లా?’’ ‘‘కాదు... అందరూ మగాళ్లే.’’ ‘‘అదేంటి?’’ ‘‘నేను ‘గే’ని.’’ విస్తుపోయాడు స్టాన్లీ. నిల్సన్ ప్రవర్తన అంతు పట్టడం లేదతనికి. కాస్త కూడా బెదురు లేదు. తప్పు చేశానన్న బాధ లేదు. దొరికిపోయానన్న కంగారూ లేదు. స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. సినిమా కథ చెబుతున్నంత కూల్‌గా తన నేరాల గురించి మాట్లాడుతున్నాడు. స్టాన్లీ పెద్ద కష్టపడకుండానే తన గుట్టు మొత్తం విప్పేశాడు. నిల్సన్ స్కాంట్లాండులో పుట్టాడు. తండ్రి ఆర్మీ అధికారి. ఉద్యోగం తప్ప మరేమీ పట్టదు. చివరికి ప్రేమించి పెళ్లాడిన భార్య ముఖం కూడా సంవత్సరంలో ఒకట్రెండుసార్లే చూసేవాడు. ముగ్గురు బిడ్డలకూ అతడి ముఖం కూడా సరిగ్గా గుర్తుండేది కాదు. దాంతో విసిగిపోయిన నిల్సన్ తల్లి భర్తతో గొడవేసుకుంది. మాటా మాటా పెరిగింది. బంధం చెడింది. భర్త నుంచి విడాకులు తీసుకుని పిల్లల్ని తీసుకుని పుట్టింటికి చేరిందామె. అక్కడ తన తాతయ్యతో అనుబంధం ఏర్పడింది నిల్సన్కి. ఎప్పుడూ ఆయనతోనే ఉండేవాడు. అందుకే ఆయన గుండెనొప్పితో చనిపోయినప్పుడు అందరికంటే ఎక్కువగా ఏడ్చాడు. తాతయ్య పోయిన బాధ, తనను పెద్దగా పట్టించుకోని అమ్మ, అన్నయ్య... తన బాధ వినేంత వయసు లేని చెల్లెలు... వెరసి ఒంటరిగా కుమిలిపోయేవాడు నిల్సన్. అనురాగాన్ని బయట వెతుక్కునేవాడు. స్నేహితులతో సమయం గడిపేవాడు. ఆ క్రమంలోనే తాను మగవారి పట్ల ఆకర్షితుడవుతున్నానని గుర్తించాడు. ఆ విషయం ఎవరికీ తెలియకూడదని వెళ్లి సైన్యంలో చేరిపోయాడు. చాలా యేళ్లపాటు సైన్యంలో పని చేసిన తరువాత విసుగు చెంది బయటకు వచ్చేశాడు నిల్సన్. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాడు. అదీ నచ్చలేదు. వదిలేసి ఒక కంపెనీలో చేరాడు. కుటుంబ సభ్యులకు దూరంగా ఇల్లు తీసుకున్నాడు. తన ఒంటరితనాన్ని మర్చిపోవడానికి విపరీతంగా తాగేవాడు. పబ్బుల చుట్టూ తిరిగేవాడు. అప్పుడే తనలాంటి ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. కానీ ఆ బంధం కొన్నాళ్లకే సడలిపోయింది. ఆ వ్యక్తిని చాలా ప్రేమించాడు. జీవితాంతం తనతో ఉంటాడని అనుకున్నాడు. కానీ అతడు వెళ్లిపోయేసరికి బాధ, కోపం, కసి. ఆ తర్వాత కూడా చాలామందితో సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకోవాలని చూశాడు. ఎవ్వరూ అతడికి దగ్గరవ్వలేదు. ప్రేమ చూపించలేదు. దాంతో విసిగిపోయాడు. పబ్బుల దగ్గర మాటేసి మత్తులో ఉన్న యువకులని పార్టీ చేసుకుందామంటూ తన ఇంటికి తీసుకెళ్లేవాడు. బాగా తాగించి, స్పృహ కోల్పోయాక గొంతు నులిమేవాడు. తర్వాత నీటితో నిండిన బక్కెట్లో వారి తలను ముంచి చంపేసేవాడు. ఆపైన ఆ మృతదేహాలతో కోరికలు తీర్చుకునేవాడు. తర్వాత ప్లాస్లిక్ సంచిలో చుట్టి అండర్‌గ్రౌండ్‌లో దాచేవాడు. కానీ అవి కుళ్లిపోయి కంపు కొట్టసాగాయి. పురుగులు పట్టసాగాయి. దాంతో దేహాలను నరికి, మాంసాన్ని తీసి ప్లాస్టిక్ సంచుల్లో మూటగట్టేవాడు. చర్మం, మాంసం తేలికగా ఊడి రావడానికని తలల్ని ఉడికించేవాడు. వాటన్నిటినీ లేవట్రీలో కూరేసేవాడు. అవి డ్రైనేజీలోకి పోయి పేరుకుపోయాయి. అది బ్లాక్ అవడంతో అసలు కథ బయటకు వచ్చింది. ఇదంతా నిల్సనే స్వయంగా చెప్పాడు. అతడి పాపాల చిట్టాని పోలీసులు కోర్టుకు సమర్పించారు. న్యాయస్థానం అతడిని జీవితాంతం జైల్లోనే ఉండమని ఆదేశించింది. ప్రస్తుతం యార్క్‌షైర్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. తను చేసిన నేరాలకు తన తలరాతని, తనను ‘గే’గా పుట్టించిన భగవంతుడిని నిందిస్తాడు నిల్సన్. అది కరెక్టేనా? అతడికున్నది హార్మోన్ల సమస్య. ఆ సమస్య ఉన్నవాళ్లందరూ అతడిలానే తప్పుదారి పడుతున్నారా? ప్రాణాలు తీస్తున్నారా? లేదు. ఎవరు చేసినా, ఎందుకు చేసినా, ఎలా చేసినా... నేరం నేరమే. నేరానికి శిక్ష అనుభవించక తప్పదు. అందుకే ఇప్పుడు నిల్సన్... జైలు గోడల మధ్య మగ్గిపోతున్నాడు! - సమీర నేలపూడి