breaking news
stage performs
-
బాహుబలి.. ఆవేశం.. షాకిచ్చిన మోహన్ లాల్
నటీనటులకు వయసు అవ్వదు అని అంటూ ఉంటారు. అయితే దీన్ని కొందరు యాక్టర్స్ నిజజీవితంలోనూ నిరూపిస్తూ ఉంటారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇప్పుడు అలానే స్టేజీ ఫెర్ఫార్మెన్స్‌లతో దుమ్మదులిపేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే)'ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్' అని స్టార్ హీరో మోహన్‌లాల్ మరోసారి నిరూపించారు. 66 ఏళ్ల వయసులోనూ జర్మనీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డ్యాన్స్‌తో అదరగొట్టారు. తిరు సినిమాలోని పాటతో పాటు బాహుబలిలోని 'మనోహరి', ఆవేశం చిత్రంలోని ఇల్యూమినాటి పాటలకు స్టెప్స్‌తో అలరించారు. అలాగే పాటలు పాడుతూ ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. (ఇదీ చదవండి: ఇంతలో ఎంతలా మారిపోయారో? ఖుష్బూ ఫ్యామిలీ ఫొటోలు వైరల్)#MohanLal Dance for Manohari Song From #Baahubali 💥🤯pic.twitter.com/gBD26WvEvm— Movies4u Official (@Movies4u_Officl) June 27, 2026వయసు మీరినా, 66 ఏళ్లలో స్టేజి మీద బీట్ సాంగ్ కి స్టెప్పులు వేసిన మోహన్ లాల్.'ఇల్యూమినాఛి ' పాటకు స్వాసిక, సానియాతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన మోహన్‌లాల్.#illuminachchi #mohanlal #svasika #sania #UANow pic.twitter.com/k4k1cIJmTe— UttarandhraNow (@UttarandhraNow) June 27, 2026This one.....🥹🥹🔥Look at the steps 🛐Im seeing Thala and Shivaraman 🤯Jithumadavan, Girsh AD, Dhyan sreenivaasan, Basil Joseph etcAnyone of these directors can easily pull a Comedy action entertainer from #Mohanlal 🙌😭🤌🔥 To explore Current stardom needs such a movie💯 https://t.co/Pb6wkP5ZLe pic.twitter.com/ShEKNIMkLi— Amal Anand K (@AmalAnandK714) June 27, 2026#Lalettan 's charm meets Germany's vibes.@Mohanlal #Mohanlal pic.twitter.com/T9Ap6pYFTP— BEN K MATHEW (@BENKMATHEW) June 26, 2026 -
పాటే ప్రాణం!
► కళాకారుడిగా రాణిస్తున్న చరణ్ ►ప్రభుత్వ గుర్తింపునివ్వడంలో వివక్ష ►రాష్ట్రం, జిల్లా సాధన, హక్కుల సాధన కోసం వందలాది ప్రదర్శనలు ►ప్రముఖులచే ప్రశంసలు గద్వాల అర్బన్: ధరూర్ మండలం నీలహాళ్లి గ్రామానికి చెందిన చరణ్‌కు పాటంటే ప్రాణం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి గాయకుడిగా, రచయితగా, డ్యాన్సర్‌గా రాణిస్తున్నాడు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో, సకలజనుల సమ్మెలో తన పాట, ఆటలతో ఆకట్టుకున్నాడు. అలాగే గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని నడిగడ్డలో ఎగసిన ఉవ్వెత్తు ఉద్యమంలోనూ తనవంతు పాత్రను పోషించాడు. ఎక్కడ ప్రదర్శనలు చేసినా తన ఆటపాటలతో ప్రజలను ఉర్రూతలూగించాడు. అమ్మ తొలిగురువు తల్లిదండ్రులకు నలుగురు సంతానం, చివరి వాడు చరణ్. నిరుపేద దళిత కుటుంబం కావడంతో ఉప్పేరు హాస్టల్లో టె¯ŒS్త వరకు చదివించారు. ఆపై చదువులు చదివించలేకపోవడంతో తల్లితో పాటు వ్యవసాయ పనులకు వెళ్లేవాడు. అక్కడ తల్లిపాడే జానపద గేయాలు, బొడ్డెమ్మ పాటలకు కోరస్‌గా పాడేవాడు. అప్పుడే పాటపై ఇష్టం ఏర్పడింది. రాత్రివేళ కాలనీలో కోలాటం వేసేవారు. అందులో తండ్రి జంగిలప్ప ద్వారా కోలాటం నేర్చుకున్నాడు. జిల్లా ఉద్యమంలో... నూతన ఏర్పాటులో మొదట గద్వాల పేరు లేకపోవడంతో ఇక్కడ ప్రజలు జిల్లా కోసం అనేక నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు, జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షల్లో చరణ్ తన గళంవిప్పాడు. జిల్లా ప్రాశ్సస్త్యం, ప్రాముఖ్యతపై పాటలు రాసి పాడాడు. జిల్లా సాధించుకున్న తర్వాత కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సంబురాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులచే శభాష్ అనిపించుకున్నాడు. 2015లో ఐదు రోజుల పాటు జరిగిన పాలమూరు కళాప్రదర్శన కళాబృందం ప్రదర్శించి అప్పటి కలెక్టర్ శ్రీదేవి చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారులను ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం కల్పించారు. కానీ చరణ్‌పై మాత్రం వివక్ష ప్రదర్శించారు. 2001 నుంచి ప్రారంభం... అప్పటి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాటలు రాసి స్వయంగా పాడాడు. ప్రభుత్వ కార్యక్రమాలు, మూఢనమ్మకాలపై, అంటరానితనం, దళితుల దేవాలయ ప్రవేశం, పల్లెసుద్దుల తదితర కార్యక్రమాలపై కళాజాతా ప్రదర్శన ఇచ్చాడు. ఎస్సీ వర్గీకరణపై చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో... 2005లో తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో నడిగడ్డ నుంచే మొట్టమొదటి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో కేసీఆర్, లక్ష్మారెడ్డి వెంట ధూంధాం కార్యక్రమాలు, ఆటలు పాటలు, డప్పుల ప్రదర్శనలు ఇచ్చారు. పాటల ద్వారా తెలంగాణ ఉద్యమంపై అవగాహన కల్పించారు. తెలంగాణ వస్తే బతుకు మారుతుందని భావించి సకలజనుల సమ్మెలో 42రోజుల పాటు అహర్నిశలు ఆటలు, పాటలు పాడుతూ ధూంధాం నిర్వహించడం జరిగింది. నడిగడ్డ జిల్లాలో చరణ్ బృందం పాల్గొనని కార్యక్రమమే లేదు. నడిగడ్డ కళాకారులపై ప్రభుత్వం వివక్ష ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా పాటను మాత్రం వదలేదు. 17ఏళ్లుగా... తెలంగాణ ఉద్యమం, జిల్లా సాధనలో, జిల్లా సంబరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంలో వందలాది ప్రదర్శనలు ఇచ్చాను. అయినా ప్రభుత్వం నడిగడ్డ కళాకారులను గుర్తించకుండా వివక్ష చూపుతోంది. నాతోపాటు అనేక మంది కళాకారులకు అన్యాయం చేసింది. ఇది నాపై వివక్ష కాదు. కళపై వివక్ష. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పించాలి. –చరణ్, కళాకారుడు


