breaking news
Sripada Rao statue
-
ట్యాంక్ బండ్‌పై మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్ర మహనీయుల విగ్రహాలను ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహనీయుల చరిత్రను కాపాడుకునే బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ విషయంపై మంత్రిమండలిలో చర్చించి, ప్రకటన చేస్తామని వెల్లడించారు. శనివారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మంథని నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి వంటి ఎంతో మంది అగ్ర నాయకులతో కలసి శ్రీపాదరావు పనిచేశారని గుర్తుచేశారు. స్పీకర్‌గా శ్రీపాదరావు ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని కొనియాడారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీపాదరావు, ఆయన కుమారుడు శ్రీధర్‌బాబుతో కలసి పనిచేసిన వ్యక్తిగా ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లా డుతూ తన తండ్రి శ్రీపాదరావు ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు రంగాలలో సేవలందిస్తున్నవారికి అవార్డులను అందజేశారు. శ్రీపాదరావుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రాజ్‌ఠాకూర్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌లతో పాటు శ్రీపాదరావు కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
శ్రీపాదరావు విగ్రహానికి నల్లరంగు పూసిన దుండగులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మాజీ అసెంబ్లీ స్పీకర్ డి. శ్రీపాదరావు విగ్రహానికి ఆగంతకులు శనివారం అర్థరాత్రి నల్లరంగు పూశారు. ఆదివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ శ్రీపాదరావు విగ్రహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను గుర్తించి కఠనంగా శిక్షించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.