breaking news
Sricaran
-
సోమవారం ఏం జరిగింది?
ధన్‌రాజ్, శ్రీచరణ్, సుమన్‌శెట్టి, ‘జబర్దస్త్’ శ్రీను, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో భవానీ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘ఫామ్‌హౌస్’. ఎమ్.యన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శోభారాణి, ప్రచార చిత్రాలను మల్టీ డైమన్షన్ వాసు, సాయి వెంకట్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘సోమవారం రోజు ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సస్పెన్స్, హారర్ నేపథ్యంలో సినిమా సాగుతుంది’’ అని చెప్పారు. ఎమ్.ఎన్. రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారని భవానీ అగర్వాల్ అన్నారు. -
నలుగురు కుర్రాళ్ల ఆశయం
జీవితంలో బాగా స్థిరపడాలని ఆ నలుగురు కుర్రాళ్లు అనుకుంటారు. తమ ఆశయం నెరవేర్చుకోవడానికి హైదరాబాద్‌లో అడుగుపెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్లు అనుకున్నట్లుగానే స్థిరపడగలి గారా? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘భలే కుర్రాళ్లు’. శశాంక్, వికేష్, శ్రీచరణ్, బ్రహ్మ, భవ్య, నయన, సోనాలి, పవిత్ర ముఖ్య తారలుగా చరణ్ మల్లెల దర్శకత్వంలో ఉప్పలపాటి వికేష్ చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారూ చూడదగ్గ విధంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎల్.ఎమ్. ప్రేమ్, కెమెరా: శ్రీరామ్.