breaking news
Sri waas
-
‘సాక్ష్యం’ నుంచి రేపు ఫస్ట్ సింగిల్
గతేడాది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ‘జయ జానకి నాయకా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ సినిమా విజయవంతమైంది. ఈయన కెరీర్లో పెద్దగా విజయాలు లేకపోయినా... హై బడ్జెట్, కాస్టింగ్‌తో సినిమాలు రిచ్‌గా ఉంటాయి. ప్రస్తుతం ‘సాక్ష్యం’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ (సౌందర్య లహరి...)ను రేపు (మే 4) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించగా...శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నెక్ట్స్ సినిమాలో పూజా హెగ్డే..?
అల్లుడు శీను లాంటి భారీ బడ్జెట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ వారసుడు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్.సాయి తొలి సినిమానే 40 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందించి రికార్డ్ సృష్టించాడు బెల్లంకొండ సురేష్. సమంత హీరోయిన్గా నటించటం, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ చేయించటంతో అల్లుడు శీను సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో సాయి కెరీర్ ఊపందుకోలేదు. తరువాత స్పీడున్నోడు సినిమాతో మరోసారి నిరాశపరిచిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సాయి శ్రీనివాస్‌తో జోడి కడుతోంది. భారీ స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తరువాత శ్రీవాస్ దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు.ఈ సినిమాకు కూడా స్టార్ గ్లామర్‌ను యాడ్ చేసే పనిలో ఉన్నాడు బెల్లంకొండ సురేష్. అందుకే టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న పూజా హెగ్డేను ఈ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. పూజా ఓకే చెప్తే భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు.