రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
నాయుడుపేట : నెల్లూరు జిల్లా నాయుడు పేట సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన గురువారం నెల్లూరు జిల్లా నాయుడుపేట బైపాస్ వద్ద జరిగింది. వివరాలు..పెల్లకూరు మండలం చిల్లకర్రు గ్రామానికి చెందిన వి. సతీష్(21), మునిరాజ్(19)లు ధాన్యం కొలతలు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ధాన్యం కొలతలకు వెళ్తుండగా వీరు ప్రమాణిస్తున్న బైక్ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.