breaking news
spy arrested
-
పాకిస్తాన్‌కు గూఢచర్యం.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్
ఢిల్లీ: భారత్‌లో విస్తరించిన పాకిస్తాన్ నిఘా సంస్థలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని అరెస్ట్ చేశారు. ఇక, తాజాగా మరో ప్రభుత్వ ఉద్యోగి గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయ్యాడు. అతడి ఫోన్లో పాకిస్తాన్‌కు చెందిన పలు నంబర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సకూర్ ఖాన్ మగళియార్ గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయ్యాడు. సకూర్ ఖాన్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. తాజాగా సకూర్ ఖాన్‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్ బృందాలు అదుపులోకి తీసుకొన్నాయి. ఈ సందర్బంగా ఎస్పీ సుధీర్ చౌధ్రీ మాట్లాడుతూ.. సకూర్‌ఖాన్‌పై గత కొన్ని వారాలుగా దర్యాప్తు బృందాలు నిఘా పెట్టాయి. అతడికి పాక్ దౌత్య కార్యాలయంతో సంబంధాలపై కూడా సందేహాలున్నాయి. సకూర్ అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఉన్నత స్థాయి నుంచి సమాచారం అందింది. దీంతో వాటిని ప్రశ్నించి.. నిర్ధారించుకునేందుకు అరెస్ట్ చేసినట్టు తెలిపారు.ఇక, సకూర్ ఖాన్ ఫోన్లో పలు పాకిస్థానీ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి గురించి సంతృప్తికరమైన వివరణ మాత్రం అతడి నుంచి రావడం లేదని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. పాక్‌ను దాదాపు ఏడుసార్లు సందర్శించినట్లు అతడు అంగీకరించాడు. ఇప్పటివరకు అతడి ఫోన్లో ఎటువంటి మిలిటరీ సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. కాకపోతే కొన్ని ఫైల్స్‌ను అతడు డిలీట్ చేసినట్లు గుర్తించారు. ఇక ఖాన్‌కు ఉన్న రెండు బ్యాంకు ఖాతాలపై దృష్టిసారించారు.ఇదిలా ఉండగా.. సకూర్ ఖాన్ స్వస్థలం పాక్ సరిహద్దుల్లోని జైసల్మేర్ జిల్లా బరోడా గ్రామంలోని మంగళియార్ ధాని. ఇతడు గత రాష్ట్ర ప్రభుత్వంలో ఓ మంత్రికి వ్యక్తిగత సహాయకుడిగా కూడా పనిచేయడం సంచలనంగా మారింది. సదరు మాజీ మంత్రిది కూడా ఇదే గ్రామం కావడం గమనార్హం. దర్యాప్తు వర్గాలు మాత్రం రాజకీయ లింక్‌లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. राजस्थान में कांग्रेस के पूर्व मंत्री सालेह मोहम्मद के निजी सहायक शकूर खान पर पाकिस्तान की ISI के लिए जासूसी करने के पुख्ता सबूत मिले हैं। वह सीमावर्ती इलाकों की गोपनीय सूचनाएं पाक अधिकारियों से साझा करता था। शकूर खान सरकारी कर्मचारी है और कई बार सरकार को बिना बताए पाकिस्तान की… pic.twitter.com/xCb9OtkSLK— Amit Malviya (@amitmalviya) May 29, 2025 -
జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు.. హైదరాబాద్, పూరీలో ఏం జరిగింది?
ఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తూ పలువురు భారతీయులు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ కాగా, తాజాగా యూపీకి చెందిన షహజాద్ అనే వ్యక్తిని.. అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఉంటూ పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. మరోవైపు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ జ్యోతి మల్హోత్రా జాడలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒకసారి చైనాకూ వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పహల్గాం సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు నిర్ధరించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. Jyoti Malhotra met Mariyam Nawaz in Pakistan, Hindu influencers are trapped by ISI, Sources claimed ISI motto is to prepare a Hindu to do terrorist attack in IndiaNaam : Jyoti MalhotraKaam : Gaddari A Woke Girl Can never be a True Patriot!!#JyotiMalhotra #YouTuber pic.twitter.com/7H5mPMgoeb— Sumit (@SumitHansd) May 17, 2025హైదరాబాద్‌తో టచ్‌లో..జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లోనూ కనిపించాయి. 2023 సెప్టెంబరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. తాజాగా ఆమె అరెస్ట్ కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా? కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా? అన్న కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.YouTuber से जासूस तक: Jyoti Malhotra का चौंकाने वाला सफर #JyotiMalhotraArrested #JyotiMalhotraYoutuber #jyotimalhotra pic.twitter.com/UJ2PkufpSA— Rubika liyaquat (@RubikaLiyakatFC) May 19, 2025పూరీలోనూ జాడలు..ఇదిలా ఉండగా.. తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాక్‌కు గూఢచర్యం కేసులో జ్యోతితోపాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. ఆ విషయాన్ని పూరీ పోలీసు యంత్రాంగానికి తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.News Flash 🔴 ବେଶ୍ ନିବିଡ଼ ଥିଲା ଜ୍ୟୋତି ଓ ପ୍ରିୟଙ୍କାଙ୍କ ସମ୍ପର୍କ❗ପାକିସ୍ତାନ ପାଇଁ ଗୁପ୍ତଚରୀ ଅଭିଯୋଗରେ ଗିରଫ ୟୁଟ୍ୟୁବର ଜ୍ୟୋତି ମାଲହୋତ୍ରା ଲିଙ୍କର ଖୋଳତାଡ଼, ପୁରୀର ୟୁଟ୍ୟୁବର ପ୍ରିୟଙ୍କା ସେନାପତିଙ୍କୁ ଇଣ୍ଟେଲିଜେନ୍ସ ବ୍ୟୁରୋ ପରେ ପୁରୀ ପୋଲିସର ପଚରାଉଚରା ସୂଚନା #ONL #Jyoti #PriyankaSenapati #Puri #Odisha pic.twitter.com/WSbg7BziAi— OdishaNewsLive (@OdishaNews_Live) May 18, 2025 2024 సెప్టెంబరు 26న పూరీ వచ్చిన జ్యోతి.. ఇక్కడి శ్రీక్షేత్రాన్ని సందర్శించినట్లు తెలిసింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కళ్లున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా? లేక రెక్కీ చేసి, పాక్‌కు ఏదైనా సమాచారం అందించారా? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ప్రియాంక మూడు నెలల క్రితం పాక్‌లోని కర్తార్‌పుర్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అన్న అంశాలు కీలకంగా మారాయి.Puri: IB questioned Odisha YouTuber Priyanka Senapati over suspected Pakistan ties, following Jyoti Malhotra's espionage arrest. Jyoti had visited Puri last year, including the Jagannath Temple, raised security concerns due to sensitive footage.#JyotiMalhotra #PriyankaSenapati pic.twitter.com/MTjO5EuYh8— Ishani K (@IshaniKrishnaa) May 18, 2025 BIG BREAKING 🚨#YouTuber Jyoti Malhotra was arrested on charges of Spying for Pakistan.📍Pakistan Link According to an FIR, #JyotiMalhotra met Ehsan-ur-Rahim alias Danish, a Pakistan High Commission staffer in New Delhi, in 2023. Danish, her alleged handler, connected her… pic.twitter.com/dNRKDq5ogP— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) May 17, 2025 -
పాక్ కుట్రను తిప్పికొట్టిన భారత్!
సాక్షి, అమృత్సర్: పాకిస్తాన్ కుటిల బుద్ధి మరోసారి బయటపడింది. డబ్బు ఆశ చూపి భారత యువతను గూఢచారులుగా నియమించుకుంటుంది. భారత నిఘా వ్యవస్థను అస్థిర పరచడానికి పాక్ చేస్తోన్న ఈ ప్రయత్నాలను భారత అధికారులు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. పాక్ నిఘా వ్యవస్థ ఐఎస్ఐకి గూఢచారిగా వ్యవహరిస్తున్న అమృత్‌సర్‌కి చెందిన రవి కుమార్‌ని మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారుల సహాయంతో పంజాబ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడు నెలల క్రితమే అతన్ని ఫేస్బుక్ ద్వారా ఐఎస్ఐ రిక్రూట్ చేసుకున్నట్లు సమాచారం. పంజాబ్‌లోని ముఖ్యమైన సంస్థలు, నిషేధిత ప్రాంతాలు, దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మీ కదలికలు, కొత్త బంకర్లకు సంబంధించిన సమాచారాన్ని అతడు పాక్‌కి చేరవేస్తున్నాడు. ఇంటర్నెట్ ద్వారా ఫొటోలు, ఎస్ఎంఎస్లు పంపుతూ నిరంతరం పాక్ ఐఎస్ఐతో టచ్‌లో ఉంటున్నాడు. ఇందుకు ప్రతిఫలంగా ఐఎస్ఐ ఎజెంట్లు దుబాయ్ నుంచి రవి అకౌంట్‌కి డబ్బును పంపిస్తున్నారు. ఫిబ్రవరి 20 నుంచి 24 వరకు రవి దుబాయ్‌లో గడిపాడని అక్కడే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అంశాలను అతడికి వివరించినట్టు తెలుస్తోంది. రవి కుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇంకా అతడికి ఏయే గ్రూపులతో, ఎవరితో సంబంధాలున్నాయో తెలుసుకోవడానికి దర్యాప్తు తీవ్రతరం చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలు అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాల ద్వారా ఉగ్రవాదంపై ప్రేరేపిస్తున్నాయని, చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు యువతను హెచ్చరించారు. -
విశాఖ, చెన్నైలపై మరో 26/11 దాడి?
భారతదేశం మీద మరో 26/11 తరహా దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. అయితే ఈసారి దక్షిణ భారతదేశాన్ని వాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, చెన్నై నగరాలు వాళ్ల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నగరాలకు చెందిన విలువైన సమాచారాన్ని కొలంబోలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో తన హ్యాండ్లర్లకు అందజేస్తున్న శ్రీలంక గూడచారి ఒకరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వర్గాలు అరెస్టు చేశాయి. అరుణ్ సెల్వరాజన్ అనే శ్రీలంక తమిళుడు చెన్నైలోని కలీక భద్రతా సంస్థల వీడియోలు, ఫొటోలు తీసి, వాటిని పాకిస్థానీ హ్యాండ్లర్లకు ఇచ్చినందుకు అరెస్టు చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డు కేంద్రం, ఆర్మీ అధికారుల శిక్షణ అకాడమీ, కోస్ట్ గార్డ్ లాంటి కీలక కేంద్రాలన్నింటి వివరాలను సెల్వరాజన్ ఫొటోలు, వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. ఇతడు చెన్నైలో ఇటీవల ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను తెరిచి, దాని పేరుమీద ఈ అన్ని ప్రాంతాలకు వెళ్లాడు. సరిగ్గా 26/11 దాడికి ముందు డేవిడ్ హెడ్లీ ఇలాడే ఇమ్మిగ్రేషన్ సంస్థ పేరిట భారతదేశానికి వచ్చి పలు ప్రాంతాలను వీడియో తీసి లష్కరే తాయిబాకు అందించాడు. ఇప్పుడు అరుణ్ తప్పుడు పత్రాలతో భారత పాస్‌పోర్టు సంపాదించాడు. అరుణ్ సెల్వరాజన్ విశాఖపట్నం కూడా వచ్చి ఇక్కడున్న పలు నౌకాదళ సంస్థలను కూడా ఫొటో తీసినట్లు సమాచారం. వీటిని తన ఈమెయిల్ అకౌంట్లో డ్రాఫ్ట్‌లుగా సేవ్ చేసి, కొలంబోలోని తన పాకిస్థానీ హ్యాండ్లర్లకు అందించేవాడు. ఈమెయిల్ పాస్వర్డ్ వాళ్ల వద్ద కూడా ఉండటంతో వాళ్లు ఇదే మెయిల్‌ను అక్కడ తెరుచుకుని వాటిని డౌన్లోడ్ చేసుకునేవారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)