breaking news
Spinny
-
బీసీసీఐకి కొత్త తలనొప్పి!
క్రికెట్లో అత్యంత సంపన్న బోర్డుగా పేరుపొందిన భారత క్రికెట్ నియంత్రణ సంస్థ (బీసీసీఐ)కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. కొత్త స్పాన్సర్ వెతుకులాటలో బీసీసీఐకి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఏడాది పొడవునా మ్యాచ్లుండే టీమిండియా క్యాలెండర్ ద్వారా మరింత డబ్బు సంపాదించాలన్న బీసీసీఐ ప్రయత్నానికి స్పాన్సర్ రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి.రాబోయే రెండేళ్లపాటు భారత టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల కోసం బోర్డు ఒక్కో మ్యాచ్‌కు కనీస ధరగా రూ. 4.85 కోట్లను నిర్ణయించింది. అయితే, బీసీసీఐ పేర్కొన్న అంనాలకు తగిన విధంగా ఆఫర్ రాలేదు. ఇంతలోనే బిడ్లకు సంబంధించిన గడువు ముగిసిపోవడంతో బీసీసీఐ బిడ్ దాఖలు సమయాన్ని పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది.అయితే ప్రస్తతం స్పాన్సర్‌గా ఉన్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మునుపటి ఒప్పందం ప్రకారం టీమిండియా ఆడే ఒక్కో మ్యాచ్‌కు బీసీసీఐకి రూ. 4.2 కోట్లు చొప్పున చెల్లిస్తుంది. అయితే ప్రస్తుతం బీసీసీఐ ఒక్కో మ్యాచ్ ధరను గణనీయంగా పెంచడంతో స్పాన్సర్లు ముందుకు రావడం లేదు. అయితే రాబోయే రెండేళ్ల కాలంలో భారత జట్టు సుమారు 35 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ లెక్కన స్పాన్సర్షిప్ హక్కులు పొందిన సంస్థ నుంచి పెద్ద మొత్తంలో నగదు అందుతుందని, దీనిద్వారా భారీ వాణిజ్య లాభాన్ని పొందవచ్చని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది.బిడ్ సమర్పణకు గడువు ఆగస్టు 13 అయినప్పటికీ, భారత బోర్డుకు హక్కుల కోసం బిడ్లు అందలేదు. బీసీసీఐ జూలై 20న ఆహ్వానాన్ని విడుదల చేసింది. ఐటీటీ పత్రాల కొనుగోలుకు చివరి తేదీ ఆగస్టు 4గా నిర్ణయించింది. వివరణలు కోరడానికి బీసీసీఐ ఆగస్టు 5న చివరి తేదీగా ఉంచింది. అయితే బిడ్లకు గడువు ముగియడంతో బీసీసీఐ ఇప్పుడు ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గూగుల్ జెమిని, స్పిన్నీ, ఎస్బీఐ లైఫ్ వంటి కంపెనీలతో ఇప్పటికే బీసీసీఐ చర్చలు ప్రారంభించినట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి.అంతేకాకుండా, బీసీసీఐ ఈవెంట్ల కోసం అసోసియేట్ పార్టనర్ హక్కులకై ఇండియన్ బోర్డ్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ (RFQ)ను కూడా విడుదల చేసింది. టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను కొనుగోలు చేసిన బ్రాండ్, అసోసియేట్ పార్టనర్ హక్కులను పొందేందుకు వీలు లేదు. అందుకే టైటిల్ స్పాన్సర్ ఖరారైన తర్వాతే ఈ హక్కులు ఖరారు చేయబడతాయి. RFQను కొనుగోలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 14 కాగా, ఆగస్టు 16లోగా వివరణలు ఇచ్చుకోవాలి. ఇక కొటేషన్ పత్రాలను సమర్పించడానికి ఆగస్టు 25 చివరి తేదీ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఉద్యోగులకు బంపరాఫర్
ముంబై: క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ తెండూల్కర్ పెట్టుబడులున్న సెకండ్‌హ్యాండ్(ప్రీఓన్డ్) కార్ రిటైలింగ్ ప్లాట్‌ఫామ్ స్పిన్నీ.. ఉద్యోగులకు స్టాక్ కేటాయింపు పథకాన్ని(ఇసాప్) ప్రవేశపెట్టింది. ఏడాది కాలాన్ని పూర్తిచేసుకున్న ఉద్యోగులకు తాజాగా షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. గత రౌండ్లో ఇసాప్ పొందిన ఉద్యోగులకు జతగా అర్హత కలిగిన మరో 3,000–3,500 మందికి షేర్లు లభించనున్నట్లు వెల్లడించింది. 2021 డిసెంబర్లో తొలిసారి తొలి ఇసాప్ బైబ్యాక్ సౌకర్యాన్ని కల్పించినట్లు ప్రస్తావించింది. దీంతో పలువురు ఉద్యోగులు భారీగా లబ్ది పొందడంతో సొంత గృహాలను సైతం సమకూర్చుకున్నట్లు వివరించింది. కంపెనీ హైదరాబాద్‌సహా ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, ముంబై, పుణే తదితర 22 పట్టణాలలో 36 కేంద్రాల ద్వారా సేవలందిస్తోంది.


