breaking news
Speed Skating
-
ప్రపంచ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌కు తెలంగాణ యువకుడి ఎంపిక
నవంబర్ 7 నుంచి 15 వరకు ఖజకిస్తాన్‌లో జరగనున్న జూనియర్ వరల్డ్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌కు తెలంగాణ యువకుడు ప్రణవ్ మాదవ్ సురపనేని ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISAI) అధికారికంగా ప్రకటించింది. ISAI అధ్యక్షుడు అమితాబ్ శర్మ ఓ లేఖ ద్వారా ప్రణవ్ ఎంపికను ధృవీకరించారు.ఆ లేఖలో అమితాబ్ ప్రణవ్ ఇటీవలి ప్రదర్శనలను కొనియాడాడు. ప్రణవ్ వరల్డ్ చాంపియన్‌షిప్ అర్హతకు అవసరమైన టైమింగ్‌ను క్లాక్ చేసి, దేశానికి గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు. తెలంగాణ నుంచి వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన ఏకైక అథ్లెట్ ప్రణవ్ అని తెలిపారు.ప్రణవ్ ఎంపికను పురస్కరించుకుని, అతనికి ప్రోత్సాహం అందించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీని కోరారు. వింటర్ స్పోర్ట్స్‌ను ప్రోత్సహిస్తూ, ప్రతిభావంతులైన అథ్లెట్లను పెంపొందించడంలో మీ సహకారం అమూల్యమైందని లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్న ప్రణవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
ఆరేళ్లప్రాయంలోనే ఆసియా రికార్డు..
కోయంబత్తూరు: ఆరేళ్లప్రాయంలోనే తమిళనాడుకు చెందిన ఓ బాలిక స్కేటింగ్‌లో ఆసియా రికార్డులోకి ప్రవేశించింది. కేవలం 41.3 నిమిషాల్లోనే 10.5 కిలోమీటర్ల వరకు వేగంగా స్కేటింగ్ చేసి ఆసియాలో తొలి రికార్డు సృష్టించింది. తమిళనాడులో యువభారతి పబ్లిక్ స్కూల్లో చదువుతున్న కె దర్శని (6)విద్యార్థిని క్వార్టర్ స్కేటింగ్ మారథాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్కేటింగ్ పోటీలో పాల్గొంది. ఈ పోటీలో పాల్గొన్న చిన్నారి.. అత్యంత వేగంగా స్కేటింగ్ చేసి ఆసియాలో రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా ఆదివారం కోయంబత్తూరులో తమిళనాడు స్పీడ్ స్కేటింగ్ అసోసియేషన్(టీఎన్‌ఎస్‌ఎస్‌ఏ) జనరల్ సెక్రటరీ మురుగానందం మాట్లాడుతూ.. స్కేటింగ్‌లో ఆసియాలో ఈ తరహా రికార్డ్ సృష్టించడం ఇదే తొలిసారిగా పేర్కొన్నారు. 150 బంగారు పథకాలను కైవసం చేసుకున్న చిన్నారి దర్శని.. 2014లో నిర్వహించిన కోయంబత్తూరు జిల్లా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా 500 మీటర్ల స్కేటింగ్‌లోనూ, అదే ఏడాది తమిళనాడు రాష్ట్ర రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లోనూ అద్భుతంగా స్కేటింగ్ చేసి ప్రతిభను కనబర్చింది. గతనెలలో గోవాలో జాతీయ స్థాయిలో టీఎన్‌ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కేటింగ్ పోటీల్లో చిన్నారి దర్శని.. బంగారు, కాంస్య పథకాలను సాధించింది. వచ్చే నెల సింగపూర్‌లో అంతర్జాతీయ స్థాయిలో జరిగే స్కేటింగ్ పోటీల్లో చిన్నారి దర్శనిని టీఎన్‌ఎస్‌ఎస్‌ఏ ఎంపికచేయనుంది. -
భారత్‌కు 7 స్వర్ణాలు
ముంబై : హాంకాంగ్ ఇంటర్నేషనల్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 14 పతకాలు గెలుచుకుంది. ఇందులో 7 స్వర్ణాలు కావడం విశేషం. వీటితో పాటు మరో 5 రజతాలు, 2 కాంస్యాలు భారత్ సొంతం చేసుకుంది. 11 ఏళ్ల ఖుషీ షా మూడు ఈవెంట్లలో స్వర్ణాలు సాధించింది.


