breaking news
special position
-
సమాజంలో పోలీసులకు ప్రత్యేక స్థానం
సంగారెడ్డి క్రైం: ‘సమాజంలో పోలీసులకు ప్రత్యేక స్థానం ఉంది, పోలీసు ఉద్యోగంలో ప్రజలకు న్యాయం చేయడం వల్ల సంతృప్తి కల్గుతుంది’ అని రాష్ట్ర డీఐజీ (అడ్మిన్) కల్పనా నాయక్ అన్నారు. సంగారెడ్డి మండలం చిద్రుప్పలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శుక్రవారం ఎస్‌సిటిపిసి (స్టైఫండ్ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుల్)ల 2014 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన డీఐజీ కల్పనా నాయక్‌ను జిల్లా ఎస్పీ డా.ిశెమూిషీ బాజ్‌పాయ్ సాదరంగా ఆహ్వానించారు. 9 నెలల పాటు పోలీసు శిక్షణ పూర్తి చేసుకొని ప్రజాసేవ కోసం వెళ్తున్న 58 మంది ఎస్‌సిటిపిసి (ఏఆర్)లతో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి ఉద్యోగ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా డీఐజీ కల్పనా నాయక్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగంలో కుటుంబ రక్షణతో పాటు ప్రజల రక్షణ చేయాల్సి ఉంటుందన్నారు. 87 మంది ఎస్సిటిపిసిలలో ఇన్డోర్, అవుట్డోర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిన 58 మందిని అభినందించారు. ట్రైనింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. అత్యుత్తమంగా పోలీసు శిక్షణ ఇచ్చిన జిల్లా ఎస్పీ డా.శెమూషీ బాజ్‌పాయ్, ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, డీటీసీ సిబ్బందిని ఆమె అభినందించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపును మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి (డీజీపీ) అనురాగ్‌శర్మ, ట్రైనింగ్ ఐజీపీ రాజీవ్త్రన్లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ (ఆపరేషన్స్) జ్యోతిప్రకాష్, జిల్లా శిక్షణ కేంద్రం డీఎస్పీ వెంకట్‌రెడ్డి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కె.ఎన్.విజయ్‌కుమార్, మెదక్ డీఎస్పీ రాజరత్నం, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ పోరులో ఓరుగల్లు
ఉద్యమ రివ్యూ ఉద్యమచరిత్రలో ప్రత్యేక స్థానం 112 మంది ఆత్మబలిదానం 6వేల కేసులు, 10వేల మంది జైలుకు రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరంగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో ఓరుగల్లు ఉద్యమ చరిత్ర చరిత్రపుటలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నది. పది జిల్లాల పోరులో అగ్రభాగాన నిలిచిన జిల్లా ‘కీర్తితోరణానికి’ రాజముద్రలో స్థానం దక్కింది. రాష్ట్ర గీత రచయిత అందేశ్రీ జిల్లావాసి కావడం మరో గర్వకారణం. ఆరు దశాబ్దాల కల నెరవేర బోతున్న తరుణంలో సోమవారం తెలంగాణ అప్పాయింటెడ్ డే ను పురస్కరించుకొని జిల్లా ప్రజలు తాము చేపట్టిన పోరాటాన్ని, అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు 2014 ఫిబ్రవరి 18 లోక్‌సభలో, 20న రాజ్యసభలో పాస్ కావడం తో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అధికార ముద్రపడింది. 1969 తొలి దశ తెలంగాణ పోరాటం అనంతరం.. మలిదశలో దశాబ్దన్నర కాలం ఆటుపోట్లు, అరెస్టులు, కేసులు, జైళ్లు, లాఠీ చార్జ్‌లను తట్టుకొని ప్రజలు పోరాట స్ఫూర్తిని చాటిచెప్పారు. జిల్లాలో 112 మంది విద్యార్థి, యువకులు ఆత్మత్యాగం చేశారు. తెలంగాణ తొలి, మలి దశ పోరుకు సకలజనుల సమ్మె ఊపిరులూదింది. 2001 టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు నుంచే ప్రొఫెసర్ జయశంకర్, భూపతి కష్ణమూర్తి, కాకతీయ యూనివర్సిటీ మేధావులు డాక్టర్ జనార్దన్‌రావు, డాక్టర్ బుర్ర రాములు, ఉద్యోగ సంఘాల నేతలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటిచెబుతూ వచ్చారు. తెలంగాణ మహాసభ, జనసభ, ఐక్యవేదికలు తెలంగాణ భావవ్యాప్తికి పునాదులు వేశాయి. అణచివేత నుంచి అప్పటికే అణచివేత సుడిగుండంలో ఉన్న ఓరుగల్లు తెలంగాణ పోరుగొంతై నిలిచింది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఎన్నికల గెలుపోట ములను పక్కనపెట్టి జిల్లా అన్ని విధాలుగా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచింది. ఉద్యమ ఫలితంగా కొంత స్వేచ్ఛావాయువులు పీల్చుకునే అవకాశం ప్రజలకు దక్కింది. ‘అదు ను చూసి దెబ్బతీద్దాం తెలంగాణ సాధించుకుం దాం’ అనే ఉద్యమకారుల వ్యూహంతోపాటు టీఆర్ఎస్ కలగలిపి ముందుకు సాగింది. ఈ సమయంలోనే ఫ్రీజోన్ సమస్య తెరపైకి వచ్చిం ది. ఈ అంశాన్ని అస్త్రంగా ప్రయోగించి కేసీఆర్ 2009 నవంబర్ 29న అమరన నిరాహార దీక్షకు పూనుకున్నారు. కాంగ్రెస్, టీడీపీపై ఒత్తిడి ఉద్యమం క్రమంగా రూపొంతరం చెందుతూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతోపాటు రాజకీ య నేతలపై ఒత్తిడికి దారితీసింది. ఈ క్రమం లో ఆయా పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తగిలాయి. నిర్బంధం పెరిగి అణచివేత ముందుకొచ్చింది. అరెస్టులు, లాఠీ చార్జ్‌లు, బైండోవర్లు నిత్యకృత్యమయ్యాయి. 2010 ఫిబ్రవరి 7న కేయూలో భారీ విద్యార్థి గర్జన సభ నిర్వహించారు. ఇక్కడే మంద కృష్ణపై దాడి జరిగింది. సకలజనుల సమ్మె శ్రీకష్ణ కమిటీ, అఖిలపక్షాల అనంతరం 2010 డిసెంబర్ 16న టీఆర్ఎస్ మహాగర్జన సభ చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో నిర్వహించా రు. మరోసారి 14ఎఫ్ కేంద్రంగా ఉద్యమం ఉధృతంగా ముందుకొచ్చింది. ఈ దశలో నిర్భంధం మరితం పెరిగింది. మిలియన్ మార్చ్, తెలంగాణ మార్చ్‌లు మరింత ఊపునిచ్చాయి. సెప్టెంబర్ 13 నుంచి 52 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మెకు ముందుగా జిల్లాలోని బొగ్గుగని కార్మికులు సమ్మెకు సైరన్ ఊదారు. ఆర్టీసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యు త్, వైద్య, ఆటో, కార్మిక కర్షకులు, వృత్తి సం ఘాలు భాగస్వామవుతూ వచ్చారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు రాలేని పరిస్థితి ఏర్పడింది. నేతలకూ తప్పని అడ్డంకులు పాలకుర్తి పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకునే యత్నం చేశారు. ముఖ్యమంత్రిగా తొలిసారి జిల్లాకు వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డికి రాయినిగూడెంలో కేయూ విద్యార్థినులు వణుకు పుట్టించారు. చిరంజీవికి చేదు అనుభవం తప్పలేదు. జిల్లాలో క్రమం తప్పకుండా జేఏసీ, టీఆర్ఎస్, బీజేపీ, తెలంగా ణవాదులు, ముఖ్యంగా న్యాయవాదులు, కేయూ విద్యార్థి లోకం పోరులో ముందుంది. కాకతీయ విద్యార్థి శక్తి 2009 నవంబర్ 16న విద్యార్థి ఉద్యమ చరిత్రలో విద్యార్థి సంఘాలు తొలిసారి జెండాలను పక్కకుపెట్టి జేఏసీ జెండా ఎత్తారు. విద్యార్థి ఉద్యమ చరిత్రలో ప్రత్యేకతను చాటుకున్న కేయూ మరోసారి నవంబర్ 23న తెలంగాణ సాధన పోరుకు పొలికేక వేసింది. ఈ సమావేశంలో కేసీఆర్‌తోపాటు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో అమరన నిరాహార దీక్షకు వెళ్లేందుకు కరీంనగర్ నుంచి పయణమైన కేసీఆర్‌ను అరెస్టు చే శారు. దీనిపై కాకతీయ యూనివర్సిటీ ఉద్యమ కెరటమై ఎగిసింది. తదుపరి డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చింది. ఈ సంబరం ఎంతోకాలం నిలవలేదు. విజయోత్సవాలకు సిద్ధమవుతుండగా 23న తెలంగాణ వ్యతిరేక ప్రకటన రావడంతో ఉద్యమం ఉప్పెనలా మారింది. తెలంగాణ జేఏసీలకు అంకురార్పణ జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, ఉద్యోగ, విద్యార్థి, న్యాయవాద, వైద్య, కళాకారులు, ప్రజాసంఘాలు భాగస్వామ్యమయ్యాయి. లాఠీలు.. జైలు ఉద్యమ క్రమంలో 6వేల బెయిలబుల్, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఒక్కో ఉద్యమకారుడు పదుల సార్లు జైళ్లకు వెళ్లారు. జిల్లాలో 1500 మంది జైలుకు వెళ్లివచ్చారు. పది వేల మంది లాఠీదెబ్బలను చవిచూశారు. ఇప్పటికీ ఈ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చి నిర్ణయం తీసుకోవడంతో ఆనందం వెల్లివిరిసింది. యూపీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఎగిసిన నిరసనోద్యమం తెలంగాణ వాదులను కలవరపరిచినప్పటికీ పార్లమెంట్లో బిల్లు పాసయ్యే వరకూ ఉత్కంఠతోనే ఎదురు చూశారు. తాజాగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర కల సాక్షాత్కరించనున్న నేపథ్యంలో అందరూ పట్టరాని ఆనంతంతో తన్మయత్వం చెందుతున్నారు.