breaking news
Special General Meeting
-
IPL 2021: ఎప్పుడు నిర్వహిద్దాం?
ముంబై: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్–2021లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న బీసీసీఐ నేడు దీనిపై మరింత స్పష్టత ఇవ్వనుంది. శనివారం జరిగే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఐపీఎల్ తేదీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. లీగ్ జరగకపోతే భారీగా ఆర్థిక నష్టాలు చవిచూసే ప్రమాదం ఉండటంతో ఎస్‌జీఎంలో ఇదే ప్రధాన అజెండాగా బోర్డు సభ్యులు పాల్గొనబోతున్నారు. అయితే లీగ్ మిగిలిన భాగం భారత్‌లో జరగదని మాత్రం తేలిపోయింది. యూఏఈ వేదికగా టోర్నీ నిర్వహించడం దాదాపు ఖాయమైంది. ‘రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున పది రోజులు, ఏడు రోజుల పాటు రోజూ ఒక్కో మ్యాచ్ జరిపి మిగిలిన నాలుగు ప్లే ఆఫ్‌లను కూడా వారాంతంలో నిర్వహిస్తే మేం అనుకున్న తేదీల్లో లెక్క సరిపోతుంది. ఇప్పుడు కావాల్సింది దీనికి అధికారికంగా ఆమోదముద్ర వేయడమే’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. టి20 వరల్డ్‌కప్‌పై వేచి చూడండి... ఎస్‌జీఎంలో మరో ప్రధానాంశం టి20 వరల్డ్ కప్ నిర్వహణ. అక్టోబర్–నవంబర్ మధ్య ఈ టోర్నీ భారత్‌లో జరగాల్సి ఉండగా మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ కూడా వస్తుందంటున్న నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు. అయితే దీనిని మరో దేశానికి తరలించే విషయంలో తొందరపాటు ప్రదర్శించవద్దని, తగినంత సమయం ఉంది కాబట్టి కొన్నాళ్లు ఆగి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఐసీసీని ఈ సమావేశం ద్వారా బీసీసీఐ కోరనుంది. మరోవైపు ఎనిమిది జట్లతో ఐపీఎల్ నిర్వహించలేని స్థితి ఉండగా, 16 జట్లతో ప్రపంచకప్ ఎలా జరుపుతారనే దానిపై కూడా చర్చ సాగవచ్చు. వీటితో పాటు రంజీ ట్రోఫీ రద్దు కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సుమారు 700 మంది దేశవాళీ క్రికెటర్లకు ఎలా నష్టపరిహారం అందించాలనే అంశాన్ని కూడా ఎస్జీఎం అజెండాలో చేర్చారు. -
తగని నిర్ణయం తీసుకుంటే ‘సుప్రీం’కు
సీఓఏ నిర్ణయం న్యూఢిల్లీ: ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎమ్)లో బీసీసీఐ భారత క్రికెట్ భవిష్యత్తుకు మింగుడు పడని నిర్ణయం తీసుకుంటే సుప్రీం కోర్టుకు వెళదామని పరిపాలక కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. దేశ క్రికెట్ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించాలని... అలా కాకుండా ప్రతిష్టకు పోయి ఏకపక్షంగా మొండివైఖరి అవలంభిస్తే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర సంఘాలకు రాసిన లేఖలో సీఓఏ హెచ్చరించింది. ‘బిగ్–3’ ఫార్ములాకు వ్యతిరేకంగా ఐసీసీ వ్యవహరించడంతో ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చే చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాలని బీసీసీఐలోని కొందరు పెద్దలు గట్టిగా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు ముందే తెలపాలని సీఓఏ సూచించిన సంగతి తెలిసిందే. ఐసీసీతో ఇంకా సంప్రదింపుల ప్రక్రియ ముగిసిపోలేదని ఏదేమైనా చర్చల ద్వారా సాధించుకోవాలని సీఓఏ భావిస్తోంది. దీనిపై ఆ లేఖలో పాయింట్ల వారిగా పలు అంశాలను ప్రస్తావించింది. లేఖలోని 13వ పాయింట్లో ‘మొత్తం భారత క్రికెట్ ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకునే నిర్ణయాలకు సీఓఏ మద్దతిస్తుంది’ అని స్పష్టం చేసింది. అయితే దీనికి విరుద్ధంగా ప్రయోజనాలను పక్కనబెట్టి కేవలం తమ ప్రతిష్టకు పోతే సహించమని... తప్పకుండా సుప్రీమ్ కోర్టును ఆశ్రయిస్తామని సీఓఏ హెచ్చరించింది. ఇందులో అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలను కోరతామని చెప్పింది. ఆదాయ పంపిణీపై ఐసీసీతో వైరం కాకుండా ముందుగా చర్చల ద్వారా పరిష్కారానికే ప్రాధాన్యమివ్వాలని 10వ పాయింట్లో ఉదహరించింది. మొండి పట్టుదలకు పోకుండా పట్టువిడుపులు ప్రదర్శించాలని సీఓఏ ఆ లేఖలో పేర్కొంది. ఎస్‌జీఎమ్‌లో ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా లోతైన కసరత్తు చేయాలని రాష్ట్ర సంఘాలకు సూచించింది. -
ప్రతిపాదనలపై రుసరుస
‘మన జిల్లా-మన ప్రణాళిక’ ఖరారే ప్రధానంగా గురువారం చేపట్టిన జిల్లా పరిషత్ తొలి సమావేశం గరంగరంగా సాగింది. సమస్యల ప్రస్తావన, ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్ష సభ్యుల వాగ్బాణాలు వాతావరణాన్ని వేడెక్కించాయి. తమతో చర్చించకుండానే పనుల ప్రతిపాదనలను రూపొందించడంపై విపక్ష కాంగ్రెస్ జెడ్పీటీసీల రుసరుసలాడగా.. కలెక్టర్ ‘కూల్’గా సమాధానమిచ్చి చల్లబరిచారు. వర్షాభావ పరిస్థితులను ఏకరువు పెడుతూ టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ‘కరువు జిల్లా’గా ప్రకటించాలని తీర్మానం చేయాలని పట్టుబట్టడం... దానిని సభ ఆమోదించడం చకచకా సాగిపోయాయి. తొలిసారి సమావేశ మందిరంలోకి అడుగిడిన కొత్త సభ్యులు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ తడబాట్లతో సాగించిన ప్రసంగాలు ఆసక్తి కలిగించాయి. - వాడివేడిగా సాగిన జిల్లా పరిషత్ తొలి భేటీ - సమస్యలు ఏకరువు పెట్టిన కొత్త సభ్యులు - ‘కరువు జిల్లా’గా తీర్మానం సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం గురువారం గందరగోళంగా మారింది. తమ ప్రమేయం లేకుండానే ప్రణాళిక తయారు చేయడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గానికి చెందిన వారితో ప్రణాళిక తయారు చేయించి సభలో ఆమోదించాలనడం సరికాదంటూ కాంగ్రెస్ జెడ్పీటీసీలు మండిపడ్డారు. సభ్యుల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక తయారు చేస్తేనే.. పక్కాగా ఉంటుందని, సొంత ఆలోచనలు మానుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, కలెక్టర్ ఎన్.శ్రీధర్ హాజరయ్యారు. ‘మన జిల్లా-మన ప్రణాళిక’ నేపథ్యంలో చేపట్టిన ఈ సమావేశం.. ప్రజా సమస్యలపై కాకుండా పార్టీలపై విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీసింది. కనీస సమాచారం ఇవ్వరా? చైర్పర్సన్ సునీతారెడ్డి సమావేశం ప్రధాన ఎజెండాను ప్రస్తావిస్తూ.. రూ.40 కోట్లతో రూపొందించిన ‘జిల్లా ప్రణాళిక’లో లోటుపాట్లను వివరించి సవరణలు సూచించాలని సభ్యులను కోరారు. ఇంతలో కాంగ్రెస్ జెడ్పీటీసీలు ఏనుగు జంగారెడ్డి, బి.మహిపాల్ కల్పించుకుంటూ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏవిధంగా ప్రణాళిక తయారు చేస్తారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రణాళికపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలవుతున్నా ఏ సమస్యకూ పరిష్కారాన్ని చూపలేదని పేర్కొన్నారు. దీంతో మంత్రి మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం అభివృద్ధి చేశారంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఇంతలో కలెక్టర్ శ్రీధర్ కల్పించుకుని ప్రణాళికపై మాట్లాడాలని, సభ్యుల సందేహాలకు తాను ప్రత్యేకంగా సమాధానం ఇస్తానని పేర్కొనడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. సమస్యల ప్రస్తావన కొత్తగా ఎన్నికైన పాలకవర్గం తొలి భేటీ కావడంతో పలువురు సభ్యులు సమస్యల ప్రస్తావనలో కొంత తడబడ్డారు. సమావేశంలో అన్ని మండలాల ప్రజాప్రతినిధులకు ప్రాధా న్యం ఇచ్చారు. దీంతో దాదాపు అందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు తమ పరిధి సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులు పేర్కొన్న సమస్యల్ని నోట్ చేసుకున్న అనంతరం వాటిని మండల, జిల్లాస్థాయి ప్రణాళికలో తగిన ప్రాధాన్యం ఇస్తామని చైర్పర్సన్ సునీతారెడ్డి హామీ ఇచ్చారు. కరువుపై తీర్మానం.. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంపై దృష్టిసారించి ప్రత్యేక చర్చ జరపాలంటూ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యాదయ్య, తీగల కృష్టారెడ్డి సభలో ప్రస్తావిం చారు. గతేడాది పంట నష్టపరిహారం సైతం అందలేదని, రైతులు పలురకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు లేవనెత్తారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలోని తాజా పరిస్థితిని వివరించాలని జేడీఏ విజయ్‌కుమార్‌ను ఆదేశిం చారు. జిల్లాలో వర్షపాతం, సాగు వివరాలు ప్రకటించగా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు, అధికారుల నివేదికలకు పొంతనలేదని, వర్షపాత వివరాలు తీసుకోవడంలో ఆయా శాఖలు పూర్తిగా విఫలమవుతున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నష్టానికి సంబంధించిన సరైన అంచనాలతో నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి ఇవ్వాలని ఎమ్మెల్యే యాదయ్య సూచించారు. జిల్లాలోని పరిస్థితుల దృష్ట్యా కరువు ప్రాంతంగా ప్రకటించాలంటూ సభ్యులు ఈ సందర్భంగా తీర్మానం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవరావు, ప్రకాష్‌గౌడ్, కేఎం వివేక్, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ‘ప్రణాళిక’పై స్పష్టత ఏదీ? ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ‘మన జిల్లా- మన ప్రణాళిక’లో భాగంగా జిల్లా యంత్రాంగం తయారుచేసిన ప్రణాళికపై స్పష్టత ఇవ్వాలంటూ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రణాళికలో గ్రామానికి మూడు, మండలానికి పది పనుల చొప్పున ప్రణాళికలో పేర్కొన్నారని, మొత్తంగా వేల కోట్ల రూపాయలతో కూడిన ఈ ప్రణాళిక కేవలం ఏడాది కాలానికా, లేక ఐదేళ్ల ప్రణాళికా అంటూ ప్రశ్నించారు. నిధుల విడుదలపైనా స్పష్టతలేదని, మొత్తంగా ఈ ప్రణాళికకు సంబంధించి నెలకొన్న సందేహాలపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ సభ ముగిసే వరకు అటు అధికార యంత్రాంగం, ఇటు జెడ్పీ పాలకవర్గం స్పష్టత ఇవ్వకపోవడం కొసమెరుపు. ఎత్తిపోతల పథకాన్ని ప్రణాళికలో చేర్చాలి: ఎమ్మెల్యే టీఆర్ఆర్ జిల్లాకు కీలకం కానున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి ప్రత్యేకంగా కొంత బడ్జెట్‌ను జిల్లా ప్రణాళికలో పొందుపర్చాలని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి సూచించారు. కనిష్టంగా మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించాల న్నారు. అదేవిధంగా అనంతగిరిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్- బీజాపూర్ రోడ్డును నాలుగు లైన్లతో ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశాలపై సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించే ఏర్పాటు చేయాలని ఆయన కోరగా.. మంత్రి మహేందర్‌రెడ్డి స్పందిస్తూ త్వరలో జిల్లాలోని ప్రజాప్రతినిధులను సీఎం వద్దకు తీసుకెళ్లి భేటీ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.