నృసింహుని సన్నిధిలో ఎస్పీ దంపతులు
                  
	కదిరి అర్బన్ : స్థానిక  లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో గురువారం  ఎస్పీ రాజశేఖర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వారికి ఘనస్వాగతం పలికారు.  ఎస్పీ దంపతులకు  ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట డీఎస్పీ రామాంజనేయులు,  సీఐ శ్రీనివాసులు,ఎస్ఐలు మధుసూదన్‌రెడ్డి, గోపాలుడు, తదితరులు ఉన్నారు.