-
నటి మృతి కేసులో యువ హీరో అరెస్ట్
కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటుడు విక్రమ్ చటర్జీని పోలీసులు శుక్రవారం ఉదయం కోల్‌కతాలో అరెస్ట్ చేశారు. బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా సింగ్ చౌహన్ మృతి కేసుకు సంబంధించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతి వేగంతో పాటు నిర్లక్ష్యంగా కారు నడిపి సోనికా సింగ్ మృతికి విక్రమ్ చటర్జీ కారణం అంటూ అతడిపై పోలీసులు 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అతడిపై నమోదు అయిన అభియోగాలు నిరూపణ అయితే కనీసం రెండేళ్ల నుంచి 10ఏళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 29న సోనికా సింగ్ చౌహాన్, విక్రమ్ చటర్జీ... ఓ పార్టీలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకు వెళ్లి, అనంతరం పల్టీలు కొడుతూ వెళ్లి రోడ్డు పక్కనే వున్న ఓ దుకాణాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో సోనికా అక్కడికక్కడే మృతి చెందగా, విక్రమ్ గాయపడ్డాడు. ఆ సమయంలో విక్రమ్ వాహనాన్ని నడుపుతున్నాడు. మద్యం సేవించి అతడు డ్రైవింగ్ చేసినట్టు తమ దర్యాప్తులో తేలడంతో అతడిపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాను తాగి కారు నడపలేదని విక్రమ్ తొలుత చెప్పినప్పటికీ.. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ద ఈ కేసుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పార్టీలో పాల్గొన్నప్పుడు వారిద్దరూ మద్యం సేవిస్తూ తమ మిత్రులకు షేర్ చేసిన ఫోటోలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ప్రమాద సమయంలో కారు అతివేగంగా నడిపినట్లు నిరూపితమైందని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ కేసు నుంచి విక్రమ్ చటర్జీని తప్పించేందుకు పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. -
బెయిల్ కోసం కోర్టు తలుపు తట్టిన హీరో
కోల్‌కతా: యువ హీరో విక్రమ్ ఛటర్జీ ముందస్తు బెయిల్ కోసం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు విక్రమ్ తరపు న్యాయవాది సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మోడల్, నటి టీవీ హోస్ట్ సోనికా చౌహాన్ మృతి కేసులో విక్రమ్ హత్యారోపణలు ఎదుర్కొంటున్నాడు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఆమె మరణానికి కారకుడయ్యాడని అతడిపై పోలీసులు అభియోగాలు మోపారు. ఏప్రిల్ 29న కోల్‌కతాలో బెంగాలీ హీరో విక్రమ్- సోనికా ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. తలకు గాయాలైన విక్రమ్‌ను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. మద్యం సేవించి అతడు డ్రైవింగ్ చేసినట్టు తమ దర్యాప్తులో తేలడంతో అతడిపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో విక్రమ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు తలుపు తట్టాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement