కాంట్రాక్ట్ పెళ్లిని అడ్డుకున్న పోలీసులు
చాంద్రాయణగుట్ట: పాతబస్తీకి చెందిన యువతికి సోమాలియా దేశస్థుడితో జరుపుతున్న కాంట్రాక్ట్ వివాహాన్ని ఫలక్‌నుమా పోలీసులు శనివారం అడ్డుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలు.. ఫలక్‌నుమా నవాబు సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన వాహబ్, స్థానికంగా ఉండే షబానాబేగం, షాయిన్ సుల్తానాలతో కాంట్రాక్ట్ వివాహాలు జరిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక యువతిని (23)ని సోమాలియాకు చెందిన సయ్యద్ ఇబ్రహీం (28)తో 15 రోజుల కోసం కాంట్రాక్ట్ వివాహం జరిపించేందుకు * 80 వేలు వసూలు చేశాడు. శనివారం వివాహం జరిపించేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు.
కాగా ఈ నెల 6వ తేదీనా దక్షిణ మండలం పోలీసులు షేక్‌లతో వివాహాలు జరిపించే ఖాజీలపై సస్పెక్ట్ షీట్లు తెరిచారన్న విషయం తెలుసుకున్న ఖాజీ ఖుద్రతుల్లాబేగ్ బెదిరిపోయి విషయాన్ని ఫలక్‌నుమా పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివాహాన్ని అడ్డుకున్నారు. సయ్యద్ ఇబ్రహీం, దళారీ వాహబ్, షబానాబేగం, షాయిన్సుల్తానాలను రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ యువతికి ఐదేళ్ల క్రితం ఐదు రోజుల కోసం ఓ బ్రోకర్ అరబ్‌షేక్‌తో కాంట్రాక్ట్ వివాహం జరిపించాడు.