breaking news
slap eve teaser
-
ఆకతాయిని ఉతికి ఆరేసింది..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ అమ్మాయి అపరకాళికలా మారి ఈవ్ టీజర్ల భరతం పట్టింది. పోలీసులకు పట్టించి ఆకతాయిని ఉతికి ఆరేసింది. చెంప దెబ్బలు, పిడిగుద్దులు, కాలి తన్నులు, చెప్పుదెబ్బలతో వీరబాదుడు బాదింది. జీవితంలో మరే అమ్మాయి పట్లా అసభ్యంగా వ్యవహరించనని, కాళ్లపై పడి ఆకతాయి వేడుకునేలా వీర బాలిక చేసింది. ఫిలిబిత్‌లో ఓ పాఠశాల అమ్మాయి చేసిన సాహసం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ఏం జరిగిదంటే ఆ అమ్మాయి మాటల్లోనే.. 'మేం స్కూలుకు వెళ్లేటపుడు రోజు ఆకతాయిలు వెంటపడి వేధించేవారు. కొంతకాలం సహించాం. వారి ఆగడాలు మరింత హద్దుమీరాయి. మా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ బూతులు మాట్లాడేవారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసుల సాయంతో ఇద్దరు ఆకతాయిల బైకులను బంధించి వారిని పోలీసులకు అప్పగించాం. అయినా నా కోపం ఆగలేదు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కొట్టాలనిపించింది. ఈ విషయం నాన్నకు చెప్పాను. నాన్నతో కలసి స్టేషన్‌కు వెళ్లి నిందితుడిని చితకబాదాను. జీవితంలో మరే అమ్మాయి జోలికి వెళ్లకుండా తగిన బుద్ది చెప్పా' అని చెప్పింది. -
ఆకతాయిని ఉతికి ఆరేసింది..