breaking news
Skydive
-
దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి..
ఎనభై సంవత్సరాల వయసులో కొద్ది దూరం నడిచినా అలసటగా అనిపిస్తుంది. ‘సాహసం’ అనే మాట ఊహకు అందదు. అయితే డా. శ్రద్దా చౌహాన్ మాత్రం ‘తగ్గేదే ల్యా’ అని డిసైడై పోయింది. సాహసానికి సై అంది. స్కైడైవింగ్తో తన 80వ పుట్టిన రోజు జరుపుకున్న శ్రద్ధ చరిత్ర సృష్టించింది. ‘స్కైడైవింగ్’ అనే మాట తల్లి నోటి నుంచి వినిపించిన క్షణమే ‘ఓకే’ అన్నాడు ఆమె కుమారుడు సౌరభ్ సింగ్ షెకావత్. శ్రద్ధ భర్తతోపాటు, రెండవ కుమారుడు మాత్రం... ‘ఈ వయసులో చాలా కష్టం. వద్దు’ అన్నారు. వారిని ఒప్పించి రంగంలోకి దిగారు తల్లీకొడుకులు. స్కైడైవర్ అయిన షెకావత్ ‘స్కై హై ఇండియా’ చీఫ్ ఇన్స్ట్రక్టర్. పర్వతారోహణలో, గుర్రపు స్వారీలో దిట్ట అయిన షెకావత్‌కు సాహసాలు కొత్త కాదు. వర్టిగో, సర్వికల్ స్పాండిలైటిస్లాంటి సమస్యలతో బాధ పడుతున్నప్పటికీ 10,000 అడుగుల ఎత్తు నుంచి కుమారుడితో కలిసి జంప్ చేసింది శ్రద్ధ. ‘ఏ మదర్: ఏ మైల్స్టోన్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. వీడియో విషయానికి వస్తే...షెకావత్ మొదట తన తల్లిని పరిచయం చేస్తాడు. ‘మా అమ్మతో కలిసి ఈ సాహసంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నాడు షెకావత్. స్కైడైవింగ్ చేయాలనేది శ్రద్ధ చౌహాన్ చిన్నప్పటి కల. ఎట్టకేలకు కుమారుడి సహకారంతో తన కల నెరవేర్చుకుంది. ‘ఇది నేను గర్వించే సందర్భం’ అని సంతోషం నిండిన కళ్లతో అంటుంది డా.శ్రద్ధా చౌహాన్. ఈ ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియో సాహసానికి మాత్రమే కాదు తల్లీకొడుకుల అనుబంధానికి కూడా అద్దం పడుతుంది. View this post on Instagram A post shared by Skyhigh (@skyhighindia) (చదవండి: Shubhanshu Shuklas mission: మధుమేహం ఉన్నవాళ్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చా..? ) -
80 ఏళ్ల వృద్ధులు స్కై డైవింగ్‌తో... గిన్నిస్ రికార్డు
80 ఏళ్ల వయసులో ఉండే బామ్మ లేదా తాతలు ఎలా ఉంటారో మనందరకీ తెలుసు. పాపం ఆ వయసులో నడవడానకి, తినడానికి కూడా ఇబ్బంది పడతారు. కనీసం ఎక్కడికైనా పంపించాలన్న భయపడతాం. పైగా వారు కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేందుకే ఇష్టపడతారు. తాము గడిపని ప్రదేశాల నుంచి వచ్చేందుకు కూడ ఇష్టపడరు. అలాంటిది 80 ఏళ్ల వయసులో ఎనిమిది మంది వృద్ధులు విమానం నుంచి జంప్ చేసే స్కై డైవింగ్‌ని చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ది జంపర్స్ ఓవర్ ఎయిటీ సోసైటీ (జేంఈఎస్)కి చెందిన ఎనిమిది మంది సభ్యులు జిమ్ కుల్హనే, క్లిఫ్ డేవిస్, స్కాటీ గాలన్, వాల్ట్ గ్రీన్, పాల్ హినెన్, స్కై హుమిన్స్కీ, వుడీ మెక్కే, టెడ్ విలియమ్స్ తదితరులు ఈ రికార్డును సృష్టించారు. వారంతా విమానం నుంచి దూకి ఒక వృత్తాకారంలో స్కై డైవింగ్ చేశారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్కైడైవింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ సెలబ్రేషన్ కోసం మూడు రోజుల ఈవెంట్లో భాగంగా స్కైడైవ్ డిలాండ్లో నిర్వహించిన స్కైడైవ్లో వారు ఫీట్‌ని ప్రదర్శించారు. ఈ ఆధునిక స్కై డ్రైవింగ్ క్రీడలో మా బృందం కాలానుగణంగా అభివృద్ధి చెందుతుంది అని తెలిపేలా ఈ ప్రదర్శన ఇచ్చినందుకు తమకు గర్వంగా ఉందని ఆ వృద్ధ సభ్యులు చెబుతున్నారు. (చదవండి: ట్రక్కును ఢీకొట్టిన ఖడ్గమృగం.. వీడియో షేర్ చేసిన సీఎం) -
102 ఏళ్ల బామ్మ సాహసం.. దేనికోసం అంటే..!
ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకి చూస్తే కళ్లు తిరగటం సహజం. మనలో చాలా మందికి ఇలాంటి అనుభవం ఎపుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది. అయితే ఇరిన్ ఒషక్ అనే బామ్మ మాత్రం ఇందుకు మినహాయింపు.102 ఏళ్ల వయసులో ఏకంగా 14 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి.. ఈ ఫీట్ చేసిన అత్యంత పెద్ద వయస్కురాలిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. దక్షిణ ఆస్ట్రేలియాలోని లాంగ్‌హార్న్ క్రీక్ ఇందుకు వేదిక అయింది. శిక్షకురాలితో కలిసి బామ్మ గాల్లో విహరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బామ్మ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసించడంతో పాటు.. ఇలా చేయడానికి గల కారణాన్ని తెలుసుకుని ఆమె పెద్ద మనసుకు సలాం అంటున్నారు. అసలు విషయమేమిటంటే... దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన న్యూరాన్ మోటార్ డిసీజ్ అసోసియేషన్ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం విరాళాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా తన వంతు సాయం చేసేందుకు ఒషక్ ముందుకు వచ్చారు. స్కైడైవింగ్ చేయడం ద్వారా సమకూరే ఆదాయాన్ని చారిటీ కోసం వినియోగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన స్కైడైవింగ్ ఈవెంట్లో పాల్గొని విజయవంతంగా స్టంట్ పూర్తి చేశారు. అయితే ఇలాంటి స్టంట్ చేయడం బామ్మకు ఇదే మొదటిసారి కాదు. 2016లో స్కైడైవింగ్ చేసి... తద్వారా వచ్చిన సొమ్మును కూడా విరాళంగా ఇచ్చేశారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలనుకునే గుణం ఉంటే చాలు అందుకు వయసు, వయోభారం అడ్డంకి కానేకాదు అనే విషయాన్ని బామ్మ నిరూపించారు అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
సౌత్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం..!
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ చేస్తున్న తాజా చిత్రం గౌతమ్ నంద. మాస్ ఇమేజ్ ఉన్న గోపిచంద్ తొలిసారిగా ఓ స్టైలిష్ పాత్రలో కనిపిస్తున్నాడు. మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరున్న సంపత్ నంది ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. యాక్షన్ సీన్స్ చేయటంలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న గోపిచంద్, గౌతమ్ నంద సినిమా కోసం ఓ రిస్కీ స్టంట్ చేశాడు. సౌత్ ఇండస్ట్రీలోనే తొలి సారిగా ఓ పూర్తి స్థాయి స్కైడైవ్ సీక్వెన్స్‌ను గౌతమ్ నంద కోసం షూట్ చేసినట్టుగా తెలిపారు. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా తెలిపిన దర్శకుడు సంపత్ నంది, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో స్కైడైవ్కు రెడీ అవుతున్న గోపిచంద్ ఫోటోలను పోస్ట్ చేశాడు. అయితే ఈ సీక్వెన్స్ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్‌లో వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌లో రాజు సుందరం కొరియోగ్రఫిలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. first time in south cinema...just wrapped up full fledged sky dive episode in our film GOWTHAM NANDA... pic.twitter.com/aQqXKTpOXb — Sampath Nandi (@DirectorSampath) 10 April 2017 Hats of to Gopi Chand gari courage...more updates soon...feast to his fans... — Sampath Nandi (@DirectorSampath) 10 April 2017 -
90 ఏళ్ల వయసులో.. స్కైడైవ్
లండన్: సాహసం చేయడానికి వృద్ధాప్యం ఆటంకం కాదని ఓ సాహసనారి నిరూపించారు. 90 ఏళ్ల వయసులో అబ్బురపరిచే సాహసం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇంగ్లండ్‌కు చెందిన స్టెల్లా గిలార్డ్ 15 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేశారు. పేరు కోసమో రికార్డు కోసమే గాక సమాజసేవ కోసం ఆమె ఈ ఫీట్ చేశారు. స్టెల్లా స్కైడైవ్ చేయడం ద్వారా 1.54 లక్షల రూపాయల నిధులు సేకరించి కేన్సర్ ఛారిటీకి అందజేశారు. స్టెల్లా జీవితంలో ఓ విషాదకర సంఘటన దాగుంది. ఆమె కూతురు మూడేళ్ల క్రితం కేన్సర్‌తో చనిపోయారు. ప్రపంచ కేన్సర్ పరిశోధన సంస్థకు నిధులు సమకూర్చడం కోసం తన కూతురి జ్ఞాపకార్థం ఈ సాహసం చేశారు. 'స్కైడైవ్ చేసేటపుడు కొంచెం కూడా భయపడలేదు. ఇన్స్ట్రక్టర్ చెప్పినట్టు చేశా. పైనుంచి దూకిన తర్వాత పారాచ్యూట్ ఓపెన్ కాకముందు కాస్త ఉత్కంఠకు గురయ్యా. పారాచ్యూట్ తెరుచుకున్నాక అద్భుతంగా అనిపించింది. ఓ పక్షిలాగా కిందకు దిగుతూ అద్భుతమైన దృశ్యాలను చూశాను' అని స్టెల్లా తన అనుభూతులు చెప్పారు.