80 ఏళ్ల అష్టదిగ్గజాలు స్కైడైవింగ్‌తో... గిన్నిస్‌ రికార్డు

8 People Age 80 Set Guinness World Record By Jumping Out Plane - Sakshi

80 ఏళ్ల వయసులో ఉండే బామ్మ లేదా తాతలు ఎలా ఉంటారో మనందరకీ తెలుసు. పాపం  ఆ వయసులో నడవడానకి, తినడానికి కూడా ఇబ్బంది పడతారు. కనీసం ఎక్కడికైనా పంపించాలన్న భయపడతాం. పైగా వారు కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేందుకే ఇష్టపడతారు. తాము గడిపని ప్రదేశాల నుంచి వచ్చేందుకు కూడ ఇష్టపడరు.

అలాంటిది 80 ఏళ్ల వయసులో ఎనిమిది మంది వృద్ధులు విమానం నుంచి జంప్‌ చేసే స్కై డైవింగ్‌ని చేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ది జంపర్స్‌ ఓవర్‌ ఎయిటీ సోసైటీ (జేంఈఎస్‌)కి చెందిన  ఎనిమిది మంది సభ్యులు జిమ్ కుల్హనే, క్లిఫ్ డేవిస్, స్కాటీ గాలన్, వాల్ట్ గ్రీన్, పాల్ హినెన్, స్కై హుమిన్స్కీ, వుడీ మెక్కే,  టెడ్ విలియమ్స్ తదితరులు ఈ రికార్డును సృష్టించారు.

వారంతా విమానం నుంచి దూకి ఒక వృత్తాకారంలో స్కై డైవింగ్‌ చేశారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్కైడైవింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ సెలబ్రేషన్ కోసం మూడు రోజుల ఈవెంట్‌లో భాగంగా స్కైడైవ్ డిలాండ్‌లో నిర్వహించిన స్కైడైవ్‌లో వారు ఫీట్‌ని ప్రదర్శించారు. ఈ ఆధునిక స్కై డ్రైవింగ్‌ క్రీడలో మా బృందం కాలానుగణంగా అభివృద్ధి చెందుతుంది అని తెలిపేలా ఈ ప్రదర్శన ఇచ్చినందుకు తమకు గర్వంగా ఉందని  ఆ వృద్ధ సభ్యులు చెబుతున్నారు.

(చదవండి: ట్రక్కును ఢీకొట్టిన ఖడ్గమృగం.. వీడియో షేర్‌ చేసిన సీఎం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top