breaking news
s.kota
-
ఎస్.కోట ప్రచార సభలో వైఎస్ జగన్
-
బాబుకు అధికారమిస్తే.. ఇక పాతాళంలోకే!
సాక్షి, విజయనగరం : ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఎన్నో వాగ్దానాలు చేస్తారని ఆయన మాటలు నమ్మి మరోసారి అధికారం ఇస్తే... ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజలను పాతాళంలోకి నెట్టేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 2014ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు 650 వాగ్ధానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చకుండా.. మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు ఆశపడి మోస పోవద్దని ప్రజలను కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్.కోట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె. శ్రీనివాస్, విశాఖ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారంవిజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. గుర్తించుకునే మూడు పనులు అయినా చేశారా? మండుతున్న ఎండల్లో కూడా చిక్కటి చిరునవ్వులతో అప్యాయతలను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరీ ఆత్మీయతకు రెండు చేతులు జోడించి శిరస్సు వహించి నమస్కరిస్తూ..పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎస్.కోట నియోజకవర్గం గుండా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. మీ కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. మీ అందరికి చెబుతున్నా నేనున్నాను. ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశారు. ఇదే నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ పుట్టిన తర్వాత ఒక్క 2004 తప్ప, మిగతా 30 ఏళ్ల పాటు తెలుగు దేశం పార్టీని ఇక్కడ గెలిపించారు. ఇంతగా టీడీపీని ఆశ్వీరదించిన ఈ నియోజకవర్గంలో ఈ 30 ఏళ్ల కాలంలో ప్రజలు గుర్తించుకునే మూడు పనులు అయినా జరిగాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? ఇదే నియోజకవర్గంలోనే వి.కోట, కొత్త వలస, రేపాల మండలాలలో తీవ్రమైన కరువు ఉంది. రేపాల మండలానికి ఆనుకోనే రైవాడ రిజర్వాయర్ ఉన్నాసాగునీరు, సాగు నీరు రాదు. ఇదే రైవాడ నుంచి నిళ్లు విశాఖకు తరలించుకుపోతున్నారు. అక్కడి పరిశ్రమలకు ఈ నీళ్లు పోతున్నాయి. ఇక్కడ సాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? ఇదే నియోజకవర్గంలోనే బాబు గారు వస్తే కర్మాగారాలు ఏరకంగా మూడపడ్డాయో ఆలోచించారు. ఈ ప్రాంతంలో భీమ్‌సింగి చక్కెర ఫ్యాక్టరీని 2003లో చంద్రబాబు ఏ రకంగా మూసేయించారో ఆలోచించాలి. మళ్లీ అదే చక్కెర ఫ్యాక్టరీని ప్రియతమ నాయకుడు వైఎస్సార్ తెరిపించారు. మళ్లీ చంద్రబాబు హయంలో రూ. 43కోట్ల అప్పుల్లోకి నెట్టేశారు.చెరకు రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా? చెరుకు రైతులకు రూ.2600 కూడా గిట్టని పరిస్థితి ఇక్కడ ఉంటే ఇదే ఉత్తరప్రదేశ్లోరూ. 3150 పలుకుతుంది. ఒక్క కొత్తపరిశ్రమ కూడా రాలేదు విశాఖనగరానికి ఈ నియోజకవర్గం అతి సమీపంలో ఉన్నాకూడా ఈ ఐళ్లుగా ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు. ఇదే జిల్లాలో జూట్ మిల్లులు మూతపడుతన్నాయి. జిల్లాలో ఉన్న ఫేరా పరిశ్రమలు చంద్రబాబు పెంచిన కరెంట్ రేట్లకు మూతపడుతున్నాయి. విభజన హామీలలో భాగంగా కొత్తవలస మండలంలో ఏర్పాటు కావాల్సిన గిరిజన యూనివర్సీటీ పనులు ప్రారంభం కూడా కాలేదు. ఎస్.కోట నియోజకవర్గంలో జన సందోహం చంద్రబాబు ఏప్రిల్పూల్ చేస్తూనే ఉన్నారు 2014లో ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు 650 వాగ్ధానాలు చేశారు. మళ్లీ 2019 ఏప్రిల్ వచ్చింది. మళ్లీ మోసం చేసేందుకు రెఢీగా ఉన్నారు. చంద్రబాబు పుట్టింది ఇదే ఏప్రిల్ మాసంలో పుట్టారు. అంటే నాల్గొ నెల 20వ తారీఖు. అంటే ఫోర్ట్వంటీ(420). ఇది చంద్రబాబు వ్యక్తిత్వానికి సరిపోయేలా ఉంది. ఈరోజు ఏప్రిల్ ఒకటో తేది. అంటే పూల్స్డే. చిన్న పిల్లలు అబద్దాలు చెబుతూ ఆటపట్టించుకుంటారు. ఇవాళ చంద్రబాబు ప్రజలను ప్రతి రోజు పూల్స్ చేస్తున్నారు. ఆయన పుట్టిన రోజు మహత్యమేమో కానీ పూల్ చేయడానికే చంద్రబాబు అలవాటు పడ్డాడు. చెప్పింది ఏది చేయరు. ఎన్నికల ముందు ఎన్నో వాగ్ధాలు చేస్తారు. ఎన్నికల తర్వాత పాతాళానికి నెట్టేస్తారు. చేస్తానన్నది అభివృద్ధి చేసింది అవినీతి గత ఎన్నిక సమయంలో వ్యవసాయ రుణాలు మాఫీ అన్నాడు. ఏమైంది? రూ. 87612 కోట్లు ఉంటే ఈ ఐదేళ్లలో వడ్డీలతో కలిపి రూ.1.5లక్షల కోట్లకు చేరాయి.డ్వాక్రా రుణాలు అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. ఏమైంది? అక్షరాలు ఇవాళ రూ. 28వేల కోట్లరూపాయలకు ఎగబాకింది. నిరుద్యోగుల ఇంటికో ఉద్యోగం అన్నాడు ఏమైంది? ప్రతి యువకునికి లక్షా ఇరవైవేల రూపాయలకు బాకీ పడ్డారు. ప్రతి కూలానికి హామీ ఇచ్చారు. ఆహో ఓహో ఇవన్ని బాబు చేసేస్తున్నారని కొన్ని టీవీలు ఆకాశానికి ఎత్తేశాయి. చంద్రబాబు ఎన్నికల ప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో మాయం చేశారు. ప్రకటనలు మాయం చేశారు. ఐదేళ్ల తర్వాత చూస్తే బాబు మాటలు అన్నీ మాయలే. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజున చేసిన ఐదు సంతకాలకు దిక్కుదివానా లేకుండా పోయింది. చేస్తానన్నది అభివృద్ధి చేసింది అవినీతి. దేశ చరిత్రలో ఇంతటి అవినీతి ఎవరూ చేయలేదు. సొంతకూతురిని ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడినచిన చంద్రబాబు ఐదేళ్లుగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తునే ఉన్నాడు. అటువంటి బాబును నమ్ముతారా? అలోచన చేయండి. చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపోవద్దు ఎన్నికలు దగ్గరుకు వస్తే చంద్రబాబు రోజకో సినిమా చూపిస్తాడు. అధికారం కోసం దేనికైనా తెగిస్తాడు చంద్రబాబు. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. 12రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. ఎస్.కోట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె. శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణలపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
ఎస్.కోట నియోజకవర్గంలో జన సందోహం
-
గోడకూలి ఇద్దరు తాపీ మేస్త్రీలు మృతి
ఎస్.కోట(విజయనగరం): నిర్మాణం లో ఉన్న గోడ కూలి ఇద్దరు తాపీ మేస్త్రీలు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం సీతంపేటకు చెందిన పూడి ఈశ్వరరావు(26), నాగభూషణం(25) తాపీ మేస్త్రీలు. సోమవారం పోతనాపల్లిలో గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా గోడ నిర్మిస్తున్నారు. అయితే, గోడ పటిష్టం కాకపోవటంతో నిర్మిస్తుండగానే కూలింది. ఇటుకలు మీద పడటంతో తాపీ మేస్త్రీలు అక్కడికక్కడే మృతిచెందారు. -
అంతా జంతర్‌మంతర్
ఐటీఐ పరీక్షల్లో అన్నీ అక్రమాలే ప్రశ్న పత్రాలు లేకుండానే కొన్ని చోట్ల పరీక్షలు ఇన్విజిలేటర్లు డైరెక్షన్లో ఓఎంఆర్‌లో బబ్లింగ్ కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తులే డిక్టేటింగ్ విజిలెన్స్ అధికారులైనా... పరీక్షల సూపరింటెండెంట్లైనా నామమాత్రమే చీపురుపల్లి/గరివిడి/శృంగవరపుకోట: జిల్లాలో ఐటీఐ సెమిస్టర్ పరీక్షలు చాలా గందరగోళంగా ఉన్నాయి. ప్రైవేటు ఐటీఐల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్షలైతే అంతా జంతర్‌మంతరే. ఏ కేంద్రంలో చూసినా అంతా వింతగా కనిపిస్తోంది. ప్రశ్నపత్రాలు లేకుండానే పరీక్షలు రాసేదొకచోట... ఇన్విజిలేటర్లే జవాబులు చెప్పేదొకచోట... ప్రైవేటు వ్యక్తులు లోపలికి వచ్చేసి పెత్తనం చేసేది మరోచోట... ఇలా అంతా అక్రమాలమయంగానే కనిపిస్తోంది. పరీక్షలను పర్యవేక్షించే పరిశీలకులు... సూపరింటెండెంట్లు... అంతా నామమాత్రమే తప్ప వారి విధులు కచ్చితంగా నిర్వర్తించలేకపోతున్నారంటే... వెనుక ఏం జరిగి ఉండొచ్చు? జిల్లాలోని ఐటీఐ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ చోటు చేసుకుంటోంది. మొన్నటికి మొన్న గజపతినగరం బాలాజీ పాలిటెక్నిక్ సెంటర్లో జరిగిన పరీక్షల్లో ఈ పరిస్థితి కనిపిస్తే... మంగళవారం గరివిడిలోని సరోజినీదేవి ఐటీఐలోనూ... శృంగవరపుకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మళ్లీ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ సాక్షికి చిక్కారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటునుంచీ... పరీక్షల్లో సాయం అందించేవరకూ... ప్రతీ అంశంలోనూ అనుమానాలకు తావిచ్చే రీతిలోనే నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. పరీక్ష పత్రాలు లేకుండానే పరీక్షరాయడం... గుంపులుగుంపులుగా కూర్చుని చక్కగా జవాబులు ఒకరికొకరు షేర్ చేసుకోవడం చూస్తుంటే అంతా గందరగోళంగా కనిపిస్తోంది. అందుకే విజిలెన్స్ తనిఖీకి వచ్చేవారుగానీ... పరీక్షల సూపరింటెండెంట్లుగానీ దీనిపై కనీసం ఎలాంటి చర్యలూ తీసుకుంటున్న దాఖలాలే కనిపించడం లేదు. ప్రశ్నపత్రం లేకుండానే పరీక్షలు గుర్లమండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు గరివిడిలో సరోజినీదేవి ఐటీఐ కళాశాల నిర్వహిస్తున్నారు. ఇక్కడ తమ విద్యార్థులతోపాటు చీపురుపల్లికి చెందిన విష్ణు ఐటీఐ, విజయనగరంలోని అంబేద్కర్ ఐటీఐ కళాశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మంగళవారం వర్క్‌షాపు అండ్ కాలుక్యులేషన్ సైన్స్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 362 మంది హాజరవ్వాల్సి ఉండగా 318 మంది వచ్చారు. మంగళవారం మద్యాహ్నం 12.30 గంటలు అంటే మరో అరగంటలో పరీక్ష సమయం ముగిసిపోతోంది. అప్పటివరకూ గదిలో ఒకరిద్దరి దగ్గర తప్ప మిగిలిన వారి వద్ద ప్రశ్న పత్రాలు లేవు. అవి లేకుండానే విద్యార్థులు ఓఎమ్ఆర్ షీట్లో జవాబులు బబ్లింగ్ చేసేశారు. ఇక్కడ గుంపులు గుంపులుగా కూర్చుని పరీక్ష రాస్తున్నారు. చాలా మంది వద్ద కనీసం పరీక్ష రాసేందుకు అవసరమైన అట్టలు కూడా లేవు. జవాబులు ఇన్విజిలేటర్లుతో చెప్పిస్తుండగా విద్యార్థులు బబ్లింగ్ చేసుకుంటున్నట్టే అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పట్టించుకోని విజిలెన్స్ అధికారి అదే సమయంలో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించేందుకు సాలూరు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జి.వీర్రాజు విజిలెన్స్ అధికారిగా కళాశాలకు వచ్చారు. చాలా సమయం వరకు ఆఫీసు గదిలోనే ఉండిపోయారు. ఆయన వద్దకు సాక్షి వెళ్లి ప్రశ్న పత్రాలు లేని విషయాన్ని ప్రస్తావించగా ఆయన ఏమీ సమాధానం ఇవ్వలేదు. అక్కడున్న చీఫ్ సూపర్వైజరు బి.బుచ్చిబాబు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు. తరువాత విజిలెన్స్ అధికారి వీర్రాజు పరీక్ష కేంద్రంలో పరిశీలించే సమయానికి విద్యార్థుల వద్ద ప్రశ్న పత్రాలు లేకపోయినా ఆయనేమీ పట్టించుకోలేదు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 నుంచి రూ.3 వేలు..... అయితే ఐటీఐ పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి తలనొప్పి లేకుండా కనీసం ప్రశ్న పత్రాలు కూడా ఇవ్వకుండా మొత్తం జవాబులు అన్నీ చెప్పేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు వసూళ్లు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన దాదాపు రూ.10 లక్షల వరకు కళాశాల యాజమాన్యాలకు ముట్టినట్లు లె లుస్తోంది. ఇందులో పైస్థాయినుంచి కింది స్థాయివరకూ వాటాలుంటాయన్న ప్రచారం జరుగుతోంది.పైగా ప్రశ్నపత్రాలు లేకపోవడానికి పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్వైజరు బి.బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రశ్న పత్రాలను ఉదయం 10.30 గంటలకు నెట్లో పెడతారని వాటిని డౌన్లోడ్ చేసుకోవడం ఆలస్యమయిందని చెప్పుకొచ్చారు. శృంగవరపుకోటలో మహా మాస్‌కాపీయింగ్ ఇచ్చుకోవటం..తీసుకోవటం...ఇబ్బంది లేకుండా చూసి రాసుకోవటం ఇదీ ఐటీఐ పరీక్షల అబ్రివేషన్లా కనిపిస్తోంది. ఎస్.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 17 గదుల్ని ఐటీఐ పరిక్ష కేంద్రాలకు కేటాయించారు. ఇక్కడ కొత్తవలస సూర్యనారాయణ ఐటీఐ, విశ్వభారతి ఐటీఐ, ఎస్.కోట ఉమాభారతి ఐటీఐ, భవానీ ఐటీఐలకు చెందిన విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాస్తున్నారు. మైదానం వైపు ఉన్న భవనంలో ఒక ప్రైవేటు వ్యక్తి విద్యార్థులకు జవాబులు చెబుతూ మీడియా కంట పడ్డారు. ఆయన్ని ఎలా అనుమతించారని అడిగితే ఇన్విజిలేటర్ బదులివ్వలేదు. విద్యార్థులు ఐదారుగురు ఒకచోట గుంపుగా కూర్చుని పరీక్ష రాస్తున్నారు. మీడియా ప్రతినిధుల్ని చూసి తమ సీట్లలోకి పరుగులు తీశారు. దీనిపై డీఓ కె.రాజారావును ప్రశ్నిస్తే దూరంగా కూర్చోబెడతాం అంటూ సర్దుకున్నారు.