ఆహారమే కాదు ఔషధం కూడా!
గుడ్ ఫుడ్
క్యారట్‌లోని బీటా కెరోటిన్ యాంటిఆక్సిడెంట్‌గా పని చేసి చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ‘ఎ’ లోపిస్తే కంటి సమస్యలతో పాటు చర్మం, జుత్తు, గోళ్లు పొడిబారుతాయి. చిన్న వయసులోనే ముసలితనం వస్తుంది. వీటిని క్యారట్ నివారిస్తుంది. ఔషధం... క్యారట్ యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. గాట్లు, గాయాల మీద తురిమిన క్యారట్‌ను కానీ ఉడికించి చిదిమిన క్యారట్ గుజ్జును కానీ పెట్టి కట్టు కడితే గాయం మానుతుంది.
క్యారట్లో ఉండే కెరోటినాయిడ్స్ గుండె సమస్యలను తగ్గిస్తాయి. రోజూ క్యారట్ తీసుకుంటుంటే కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి.ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ (పెద్దపేవు) క్యాన్సర్లను నివారించవచ్చు.కాలేయం నుంచి విషపూరితమైన వ్యర్థాలను క్యారట్ తొలగిస్తుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య రాదు. క్యారట్ తింటే దంతాలు, చిగుళ్లు కూడా శుభ్రమవుతాయి. దంతాల మీద నిలిచిన గార, ఆహారపదార్థాల అవశేషాలు తొలగిపోతాయి. లాలాజలం బాగా ఉత్పత్తి అవుతుంది. బ్యాక్టీరియా నివారణ అవుతుంది.