breaking news
the Singareni Collieries Workers Union
-
సింగరేణికి ఏడాదికి రూ.35 వేల కోట్లు
సూపర్‌బజార్ (కొత్తగూడెం): రాబోయే ఐదు సంవత్సరాల్లో సింగరేణి సంస్థ సంవత్సరానికి రూ.35 వేల కోట్ల నికర ఆదాయం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొ న్నారు. ఆదివారం కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఆయన శ్రీధర్ విలేకరులతో మాట్లాడారు. 2013 నుంచి సింగరేణి సంస్థ నికరలాభాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల లాభాలను ఆర్జించిందని చెప్పారు. 2013 – 14 ఆర్థిక సంవత్సరం నుంచి 50 మిలియన్ టన్నుల ఉత్పత్తి మైలురాయిని అధిగమిస్తూ వస్తోందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 68 మిలియన్ టన్నుల వార్షిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. గతంలో సింగరేణి రూ.400 కోట్లకు మించి లాభాలను సాధించలేకపోయిందని, ఇప్పుడు కార్మికులు, ఉద్యోగుల సమైక్య కృషి, ప్రభుత్వ సహకారంతో రూ.1,200 కోట్ల లాభాలను ఆర్జించే స్థితికి చేరుకుందని వివరించారు. రాబోయే ఐదేళ్లలో మరో 12 గనులను కొత్తగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా 6 గనులను ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలో కూడా దేశంలోనే 5వ స్థానంలో సింగరేణి సంస్థ నిలవడం తమకు గర్వంగా ఉందని చెప్పారు. -
ఎన్నికల్లో లబ్ధికోసమే వారసత్వ ఉద్యోగాలు
మణుగూరు రూరల్: త్వరలో జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య అన్నారు. సోమవారం మణుగూరు ఏరియాలో పర్యటించిన ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్ అందరికీ ఆమోదయోగ్యంగా లేదన్నారు. ఎటువంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ అందుకు విరుద్ధంగా సర్క్యులర్ విడుదల చేశారన్నారు. దీంతో సుమారు 3వేల మంది కార్మికులకు తీరని నష్టం కలుగుతుందన్నారు. డైరెక్టర్ పా వారసత్వ ఉద్యోగాలను ఎప్పుడైనా రద్దుచేసే అవకాశం ఉందంటూ విధించిన నిబంధనతోనే దాని ప్రాధాన్యాన్ని అర్ధంచేసుకోవాలన్నారు. సమావేశంలో సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ డి.శేషయ్య, మణుగూరు బ్రాంచి కార్యదర్శి వై.రాంగోపాల్, నాయకులు అంజయ్య, బైరి శ్రీనివాస్, నజీరుద్దీన్ బాబ పాల్గొన్నారు.