breaking news
Siddharth luthra
-
చంద్రబాబు బిగ్ ప్లాన్.. గుట్టుచప్పుడు కాకుండా కేసులు క్లోజ్!
-
ఏ తప్పూ చేయకుండా జైల్లో మగ్గుతున్నారు
విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో ఏ తప్పూ చేయకుండా నిందితులు సుదీర్ఘకాలం జైళ్లలో మగ్గుతున్నారని డిఫెన్స్ న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో విచారణ పూర్తయ్యిందని, ఇందుకు అనుగుణంగా చార్జ్షీట్లు కూడా దాఖలయ్యాయని పేర్కొంటూ రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. నిందితులకు బెయిల్ మంజూరుచేస్తే, విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎటువంటి షరతులకైనా సిద్ధమని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో జైలులో ఉన్న రాజ్ కేసిరెడ్డి, చెరుకూరి వెంకటేష్‌నాయుడు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బాలాజీకుమార్ యాదవ్, నవీన్‌కృష్ణల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. నిందితుల తరపున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రగిరి విష్ణువర్థన్, నాగేంద్రరెడ్డి, ఎం వాణి, నగేష్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఆన్లైన్లో హాజరై వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు ముగియడంతో తీర్పును కోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఎటువంటి ఆధారాలూ చూపలేకపోయిన సిట్: పొన్నవోలురాజ్ కేసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘కేసుకు సంబంధించి నిందితులపై సిట్ విచారణ పూర్తిచేసి, చార్జ్‌షీటు కూడా దాఖలుచేసింది. ఈ కేసులో 409 మంది సాక్షులను విచారించింది. గత ప్రభుత్వ లిక్కర్ పాలసీలో రాజ్ కేసిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసులో సిట్ ఎటువంటి ఆధారాలు చూపలేకపోయింది. సిట్ అధికారులు సెల్‌టవర్ లొకేషన్ ఆధారంగా రాజ్ కేసిరెడ్డిని ముద్దాయిగా నిర్ధారిస్తూ రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొనడం తగదు. వాస్తవానికి ఒక్కో టవర్ లొకేషన్ 3 నుండి 5 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. ఆ పరిధిలో ఎంతో మంది సెల్ఫోన్లు వాడతారు. అంతమాత్రాన ఈ కేసుతో వారందరికీ నిందితులతో సంబంధం ఉందని ఎలా నిర్ధారిస్తారు? సిట్ అధికారులు నిందితుడి కార్యాలయం కూడా జూబ్లిహిల్స్ పరిధిలో ఉందని చెబుతున్నారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి లొకేషన్ కూడా అదే పరిధిలో ఉంది. అంతమాత్రాన ఆయనకు కేసుతో సంబంధం ఉందని భావించాలా?. రాజ్ కేసిరెడ్డిని కావాలనే 188 రోజులుగా జైలులో ఉంచారు. అరవింద్ కేజ్రివాల్ వర్సెస్ సీబీఐ, కల్వకుంట్ల కవితకు సంబంధించిన కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అనుగుణంగా రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు చేయవలసినదిగా కోరుతున్నాను’ అని అన్నారు. 24వరకు రిమాండ్ పొడిగింపురాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేష్ నాయుడు ,చాణక్య, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలకు ఈనెల 24వరకు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. రిమాండ్ ముగియడంతో శుక్రవారం వారిని కోర్టులో హాజరు పరిచారు.సాగదీత ధోరణి మార్చుకోని లూథ్రాప్రాసిక్యూషన్ తరఫున తొలుత వాదనలను వినిపించిన లూథ్రా గురువారం తరహాలోనే కేసు కౌంటర్, రిమాండ్ రిపోర్టులు సుదీర్ఘంగా చదువుతూ, ‘అదే వాదన’ అన్న ధోరణిని ప్రదర్శించారు. ఈ సందర్భంలో డిఫెన్స్ తరపున న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గంటలు గంటలు కౌంటర్, రిమాండ్ రిపోర్టులు చదువుతూ పోతే వాదనలు ఎప్పుడు వినిపిస్తారని ప్రశ్నించారు. కోర్టు విలువైన సమయాన్ని లూథ్రా వృథా చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి అమెరికా వెళ్లేందుకు అనుమతిరాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఈ నెల 27 నుంచి 31 వరకు న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు హాజరయ్యేందుకు అనుమతిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 23 నుంచి నవంబరు 4వ తేదీ వరకు ఆయనకు అనుమతి మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పి. భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. రూ. 50వేలు చొప్పున ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆమెరికా పర్యటన ముగించుకొని తిరిగి రాగానే పాస్ పోర్టు తిరిగి కోర్టుకు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెవిరెడ్డిపై కేసు అంతా కుట్ర కోణమే: న్యాయవాది వాణిరెడ్డి చెవిరెడ్డి భాస్కరరెడ్డి తరపు న్యాయవాది వాణిరెడ్డి వాదనలు వినిపిస్తూ...ఆయన ప్రజలలో నుండి వచ్చారని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడని అన్నారు. ఈ కేసుతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. వాదనల్లో మరికొన్ని అంశాలు.. » గన్‌మెన్ గిరిబాబు సాక్ష్యం ఆధారంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై ఈ అక్రమ కేసు నమోదుచేశారు. » సిట్ అధికారులు గిరిబాబును 2025 జూన్ 1న విచారణ జరిపారు. » ఆ మర్నాడు జూన్ 2న అతనికి ప్రమోషన్ కల్పించి భారీ వేతనం పెంపుతో ఆక్టోపస్‌లోకి తీసుకున్నారు. » కేసు వెనుక ప్రలోభాల పర్వం ఎంత దారుణంగా ఉందో ఈ ఒక్క విషయం అద్దం పడుతోంది. » బాలాజీకుమార్ యాదవ్, నవీన్‌కృష్ణ ఇరువురు చిరు ఉద్యోగులు. » వారిని కూడా సంబంధం లేని మద్యం కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. » నిందితులకు సంబంధించిన పాస్‌పోర్టులను సీజ్‌చేశారు. » లుక్అవుట్ నోటీసులు కూడా జారీచేశారు. » ఇటువంటి పరిస్థితులలో నిందితులు ఎక్కడికి పారిపోయే పరిస్థితి లేదు. » రాజ్యాంగంలోని 21వ అధికరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నాము. -
సిద్ధార్థ్ లూథ్రాకు ACB కోర్టు సీరియస్ వార్నింగ్
-
లూథ్రాపై సీరియస్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/లీగల్ : మద్యం విధానంపై అక్రమ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా తీరుపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితులు రాజ్ కేసిరెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బాలాజీకుమార్ యాదవ్, నవీన్‌కృష్ణల బెయిల్ పిటిషన్లపై వాదనలు వినిపించడంలో లూథ్రా ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తుండటాన్ని తప్పుబట్టింది. ఈ బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా సిద్దార్ధ లూథ్రా గురువారం ఆన్లైన్లో వాదనలు వినిపించారు.అయితే తన వాదనలు సూటిగా వినిపించకుండా కాలయాపన చేసేందుకు యత్నించారు. కౌంటర్లోని అంశాలను చదువుకుంటూ ఆయన ఆలస్యం చేస్తుండటంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. సూటిగా వాదనలు వినిపించాలని న్యాయమూర్తి సూచించినప్పటికీ సిద్దార్థ లూథ్రా తన సాగదీత వైఖరిని కొనసాగించడం గమనార్హం. దాంతో మరింత అసహనానికి గురైన న్యాయమూర్తి.. అసలు ఈ కేసు విచారణ పూర్తయిందా.. లేదా? సూటిగా చెప్పాలని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.అయినా సరే లూథ్రా ఈ విషయాన్ని పట్టించుకోకుండా.. శుక్రవారం వాదనలు వినిపిస్తానని, విచారణ వాయిదా వేయాలని పదేపదే కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఇప్పటికే రిమాండ్ మూడుసార్లు పొడిగించామని గుర్తు చేశారు. కొత్త ఆధారాలు, మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టుకు సమరి్పంచలేదని, ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు.డిఫెన్స్ న్యాయవాదులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమయంలో డిఫెన్స్ న్యాయవాదులు స్పందిస్తూ.. గతంలో చంద్రబాబుపై దాఖలైన కేసులో లూథ్రా అర్థరాత్రి వరకు వాదనలు వినిపించిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం తామంతా సిద్ధంగా ఉన్నప్పటికీ వాదనలు ఎందుకు వినిపించడం లేదని ప్రశ్నించారు. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. మిధున్‌రెడ్డి అమెరికా వెళ్లే పిటిషన్‌పై విచారణ పూర్తి ఐక్యరాజ్య సమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు వెళ్లేందుకు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు అనుమతి ఇప్పించాల్సిందిగా ఎంపీ తరఫున న్యాయవాది చంద్రగిరి విష్ణువర్ధన్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ఏసీబీ న్యాయస్థానంలో ఇరుపక్షాల తరఫున విచారణ పూర్తయింది. న్యాయమూర్తి పి.భాస్కరరావు తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు. చెవిరెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెన్నెపూస వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన మంతెన సత్యనారాయణరాజు వైద్యశాలలో చికిత్స తీసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది ఎం.వాణిరెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.మెరిట్ ఆధారంగా విచారణ జరపండి మద్యం విధానంపై అక్రమ కేసులో బెయిల్ పిటిషన్లపై ‘సుప్రీం’ కీలక ఉత్తర్వులుసాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానంపై అక్రమ కేసులో కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బూనేటి చాణక్య బెయిల్ పిటిషన్ల విచారణకు మార్గం సుగమమైంది. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. బెయిల్ పిటిషన్లను కేసు మెరిట్ ఆధారంగా విచారించాలని స్పష్టం చేసింది. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కేసులో బుధవారం ఇచ్చిన తీర్పునే ఈ కేసులకు కూడా వర్తింపజేస్తున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. అందరికీ ఒకే తీర్పు వర్తింపు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు విచారించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏసీబీ కోర్టు ప్రతి బెయిల్ పిటిషన్‌ను మెరిట్ ఆధారంగా, స్వేచ్ఛగా విచారించి నిర్ణయం తీసుకోనుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యం.. మద్యం విధానంపై దాఖలైన కేసుల్లో కొందరు నిందితుల బెయిల్‌పై నిర్ణయం వెలువడే వరకు ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో విచారించవద్దని హైకోర్టు ఆదేశించటాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు ఉత్తర్వులను తప్పుబట్టింది. ఒకరి బెయిల్ పిటిషన్‌తో మరొకరికి సంబంధం లేదని, ప్రతి కేసును దాని యోగ్యత (మెరిట్) ఆధారంగానే విచారించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన బెయిల్ పిటిషన్ల విచారణను నిలిపివేయడం సరికాదని, వ్యక్తి స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. -
జడ్జిపై చంద్రబాబు లాయర్ అనుచిత వ్యాఖ్యలు..
-
మరోసారి ఎస్సీలే లక్ష్యంగా బాబు కుతంత్రం
సాక్షి, అమరావతి: ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అంటూ గతంలో ఎస్సీలను ఘోరంగా అవమానించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మరోసారి ఎస్సీలను లక్ష్యంగా చేసుకున్నారు. మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి భాస్కరరావు ఇటీవల వరుసగా బెయిళ్లు మంజూరు చేస్తూ వస్తుండటంతో చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్సీ అయిన ఆయన్ను లక్ష్యంగా చేసుకుని న్యాయ చరిత్రలో ఎన్నడూ, ఎవ్వరూ చేయని విధంగా తన ఆస్థాన న్యాయవాది సిద్దార్థ లూథ్రా చేత హైకోర్టులో అనుచిత వ్యాఖ్యలు చేయించారు. భాస్కరరావు నిబంధనల మేరకు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేస్తుండటాన్ని సహించలేని చంద్రబాబు.. ఆ న్యాయాధికారిపై తన అసహనాన్ని, ఆక్రోశాన్ని లూథ్రా ద్వారా వెళ్లగక్కించారు. వైఎస్సార్సీపీ ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. భాస్కరరావును ఏసీబీ కోర్టు నుంచి బదిలీ చేయించాలని తాను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు లూథ్రా బహిరంగంగానే తెలిపారు. భాస్కరరావు తాము చేస్తున్న ప్రతీ వాదనను తోసిపుచ్చుతున్నారని, తమ వాదనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసేస్తున్నారని లూథ్రా కోర్టుకు నివేదించారు. ఇటీవల మిధున్‌రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా తాము చేసిన ఏ వాదనను కూడా ఆయన పట్టించుకోకుండా తీర్పు ఇచ్చారని తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద, సెక్షన్ 164 కింద సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలను సైతం ఆయన పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అంతేకాక గూగుల్ టేకౌట్‌ను కూడా పట్టించుకోలేదన్నారు. ఎన్ని ఆధారాలు సమర్పించినా వాటిని ఆరోపణలనే పేర్కొంటూ ఆధారాల్లేవని చెబుతున్నారని తెలిపారు. మిధున్‌రెడ్డి ఏ నేరం చేయలేదంటూ క్లీన్ చీట్ ఇచ్చేశారన్నారు. బెయిలు మంజూరు సమయంలో భాస్కరరావు ఏ ఒక్క నిబంధనను కూడా పాటించలేదని తెలిపారు. మిధున్‌రెడ్డికి బెయిల్ తీర్పును కొట్టేయాలని పిటిషన్మద్యం కేసులో మిధున్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులోని పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ తీర్పులోని అంశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా మిధున్‌రెడ్డికి బెయిల్ ఇస్తూ ఇచ్చిన తీర్పులోని పలు అంశాలను స్టే చేయాలని, లేని పక్షంలో మిగిలిన నిందితులు ఆ అంశాలను ఆధారంగా చేసుకుని బెయిల్ పొందే అవకాశం ఉందని సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదించారు. దర్యాప్తు మొత్తం ప్రభావితం అయ్యేలా మిధున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు న్యాయాధికారి బెయిల్ ఇచ్చారని తెలిపారు. దీని వల్ల మొత్తం దర్యాప్తే నిర్వీర్యమై పోతుందన్నారు. మిధున్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించిందని లూథ్రా తెలిపారు. ఇదిలా ఉండగానే న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు వీలుగా పార్లమెంటరీ కార్యదర్శి నుంచి సెప్టెంబర్ 26న మిధున్‌రెడ్డికి మెయిల్ వచ్చిందన్నారు. అప్పుడు మిధున్‌రెడ్డి జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం న్యూయార్క్ వెళ్లేందుకు వీలుగా మిధున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు పాస్‌పోర్టును వెనక్కి ఇచ్చేసిందన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి షరతులు విధించలేదన్నారు. ఈ సందర్భంగా సిట్ తరఫున లూథ్రా ఏసీబీ కోర్టు న్యాయాధికారిపై పలు ఆరోపణలు చేశారు. ఏకపక్షంగా స్టే ఇవ్వలేంమిధున్రెడ్డికి బెయిలిస్తూ ఇచ్చిన తీర్పులోని అంశాలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. మిధున్‌రెడ్డి వాదనలు వినకుండా ఏకపక్షంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సోమవారం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్‌రెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్లపై విచారణ ఉందని, మిధున్‌రెడ్డికి ఇచ్చిన తీర్పులోని అంశాలను స్టే చేయాలంటూ తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను తేల్చేంత వరకు తన ముందున్న వ్యాజ్యాలపై విచారణ జరపకుండా ఏసీబీ కోర్టును నియంత్రించాలని లూథ్రా హైకోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై తాము నిర్ణయం వెలువరించేంత వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరుల పిటిషన్లపై విచారణ జరపొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. కాగా, సిట్ తరఫున ఇంకా హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.వ్యక్తిగత పర్యటన కాదు.. అది ప్రతిష్టాత్మక సమావేశం ఈ సమయంలో మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి స్పందిస్తూ, అనుబంధ పిటిషన్‌కు సంబంధించిన కాపీలను సిట్ తరఫు న్యాయవాదులు ఇప్పుడే తమకు అందచేశారన్నారు. వాటన్నింటినీ పరిశీలించి తగిన విధంగా స్పందించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. మి«థున్‌రెడ్డి పాల్గొనే సమావేశం చాలా ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు. ఈ సమావేశానికి వెళుతున్న అతి తక్కువ మందిలో మిథున్ రెడ్డి ఒకరని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్ కార్యదర్శి నుంచి మెయిల్ వచ్చాక పాస్‌పోర్ట్‌ను వెనక్కి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశామన్నారు. సమావేశంలో పాల్గొనే హక్కు ఎంపీగా మిథున్‌రెడ్డికి ఉందని, దానిని పరిగణనలోకి తీసుకునే ఏసీబీ కోర్టు పాస్‌పోర్ట్‌ను వెనక్కి ఇచ్చిందన్నారు. మిథున్ దేశం తరఫున ఆ సమావేశానికి వెళుతున్నారే తప్ప అది వ్యక్తిగత పర్యటన కాదన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. బెయిల్ మంజూరు చేసిన న్యాయాధికారికి ఉద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు. ఎంపీ తన వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లడం లేదని, అధికారిక కార్యక్రమంలో భాగంగానే వెళ్తున్నారని.. ఈ ప్రోగ్రాం మొత్తాన్ని పీఎంవో పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు. చెవిరెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ జరుపుతుంది కాబట్టి, మిధున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌లోని అంశాలపై స్టే ఇవ్వాలని ఎలా కోరతారని ఆయన ప్రశ్నించారు. స్టే కావాలనుకుంటే అందుకు ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. లూథ్రా సిఫారసు చేస్తే సరిపోతుందా?ఏసీబీ కోర్టు జడ్జి భాస్కరరావును అక్కడి నుంచి బదిలీ చేయించాలని తాను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు లూథ్రా చెప్పిన నేపథ్యంలో ఓ న్యాయాధికారి బదిలీ అంత సులభమా అని సందేహం కలుగుతోంది. ప్రభుత్వం అనుకున్నంతనే న్యాయాధికారి బదిలీ జరిగిపోదు. న్యాయవాదులు ప్రభుత్వ పరిధిలో హైకోర్టు నియంత్రణలో పని చేస్తుంటారు. వారిని బదిలీ చేసే అధికారం హైకోర్టుకే ఉంటుంది. ప్రభుత్వానికి కేవలం న్యాయాధికారుల బదిలీని నోటిఫై చేసే అధికారం మాత్రమే ఉంటుంది. న్యాయాధికారుల బదిలీల విషయంలో హైకోర్టుదే తుది నిర్ణయం. న్యాయాధికారుల బదిలీల విషయంలో పరిపాలన హెడ్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన సహచర సీనియర్ న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఉంటారు. ఆ కమిటీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లూథ్రా సిఫారసు చేశారనో, ప్రభుత్వం అడిగిందనో బదిలీ చేయడం ఉండదు. అందునా సీఐడీకి నచ్చని విధంగా న్యాయాధికారి వ్యవహరిస్తున్నారనే కారణంతో బదిలీ చేయడం అన్నది జరిగే పని కాదు. -
స్కిల్ స్కామ్ కేసు వాదించినందుకు 2.86 కోట్లా..!
-
AP Govt: లాయర్ సిద్ధార్థ్ లూథ్రాకు రూ.2.86 కోట్లు చెల్లింపు
విజయవాడఛ కూటమి సర్కారు కేసులు వాదిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం రూ. 2.86 కోట్లు చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కేసులు వాదించిందుకు గాను ఈ మొత్తాన్ని చెల్లించింది. హైకోర్టులో నాలుగు కేసులు వాదించినందుకు రూ. 2.86 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో అవినీతి కేసులను సిద్థార్థ్ లూథ్రా వాదించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిల్ స్కామ్, అమరావతి స్కామ్ కేసులు వాదించారు సిద్ధార్థ్ లూథ్రా.. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రభుత్వం తరఫున కేసులకు ఆయన్ను నియమించుకుంది కూటమి సర్కారు.సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థకు సూపర్ బాస్‌గా అవతరించారు. గతంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలిపోయిన ఆ సీనియర్ న్యాయవాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున కేసులు వాదిస్తున్నారు. -
న్యాయాధికారిపై ఇంటెలిజెన్స్ నిఘా!
చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా న్యాయమూర్తులపైనే నిఘా పెట్టిందా..? ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదిని రంగంలోకి దించి చంద్రబాబుపై కేసులను నీరు గార్చేలా పోలీస్ వ్యవస్థకు ‘కౌన్సెలింగ్’ చేస్తోందా..? తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుపై నమోదైన అవినీతి కేసులను అడ్డగోలుగా మూసివేసే పన్నాగమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది. ఏకంగా ఆ కేసులను విచారిస్తున్న న్యాయాధికారి కదలికలపై ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా నిఘా పెట్టిందన్న విషయం సంచలనం కలిగిస్తోంది. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆ జడ్జీ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో గత ఏడాది చంద్రబాబుకు రిమాండ్ విధించిన పరిణామాల నేపథ్యంలోనే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు తెగించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు చంద్రబాబు నిందితుడిగా ఉన్న కేసులో చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించకుండా తాత్సారం చేయడంపై ఆ జడ్జీ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఉదంతం ఇలా ఉంది...ఇంటి వద్ద ఎందుకు మాటు వేశారు?– పోలీసు అధికారిని ప్రశ్నించిన న్యాయాధికారి చంద్రబాబుపై నమోదైన కేసులను విచారిస్తున్న ఓ న్యాయస్థానం న్యాయాధికారిపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఆ జడ్జీ ఇంటి పరిసరాల్లో తిష్ట వేసిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రతికదలికనూ గమనిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడం గమనార్హం. అయితే నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయాధికారి సిబ్బంది గుర్తించారు. న్యాయాధికారి కోసం వాకబు చేస్తున్న విషయాన్ని పసిగట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జీ ఓ పోలీసు అధికారిని దీనిపై న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం. తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు మాటు వేశారు...? తన ప్రతి కదలికను ఎందుకు పరిశీలిస్తున్నారని సూటిగా ప్రశ్నించడంతో ఆ పోలీసు అధికారి తత్తరపాటుకు గురయ్యారు. చార్జిషీట్లు ఎందుకు తొక్కిపెట్టారు? – సీఐడీని ప్రశ్నించిన న్యాయాధికారి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు సీఐడీ పన్నిన పన్నాగంపై కూడా న్యాయాధికారి ప్రశ్నించారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ చార్జిషీట్లను ఈ ఏడాది ఏప్రిల్‌లో వెనక్కి పంపింది. వివరణలతో ఆ చార్జిషీట్లను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు అప్పటి సీఐడీ అధికారులు వివరణలతో చార్జిషీట్లను సిద్ధం చేశారు. అయితే జూన్‌లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సీఐడీ ఉన్నతాధికారులు ఆ చార్జిషీట్లను తొక్కిపెట్టారు. వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఆ కేసులో సాక్షులను బెదిరించి చంద్రబాబుకు అనుకూలంగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలన్నది సీఐడీ ఉన్నతాధికారుల లక్ష్యం. అప్పటివరకు చార్జిషీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి పి.నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్ భూముల కేసులో గత ఏడాది సిట్ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వెల్లడిస్తానని, తనను అప్రూవర్‌గా గుర్తించాలని కోరుతూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ జప్తు చేసిన తన పత్రాలను విడుదల చేయాలని ఆయన ఇటీవల న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కొద్ది రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సీఐడీ ఇంతవరకు చార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఆ చార్జిషీట్లు దాఖలు చేయనంతవరకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్రూవరా లేక నిందితుడా అన్నది నిర్ధారించలేమన్నారు. చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా సీఐడీ తరపు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు. లూథ్రా కంట్రోల్లో పోలీస్ వ్యవస్థ!చంద్రబాబు తరపున కేసులను వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తాజాగా విజయవాడలోని నోవాటెల్ హోటల్లో వరుసగా రెండు రోజుల పాటు పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో సమావేశమై ఆ కేసులను నీరుగార్చే చర్యలను స్వయంగా పర్యవేక్షించడంపై న్యాయ వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఈ కేసులో గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులు, ఇతరులను బెదిరింపులకు గురి చేసి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లకు గురి చేయాలని పథక రచన చేశారు. మొత్తం పోలీస్ వ్యవస్థను లూథ్రా తన కంట్రోల్లోకి తీసుకోవడం.. చంద్రబాబుపై కేసుల దర్యాప్తు అధికారులకు దిశా నిర్దేశం చేయడం.. దీన్ని నుంచి ఆయన్ను మూడు నెలల్లోగా బయట పడేయాలని ఏకంగా డెడ్‌లైన్ విధించడం రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతోందో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షులను బెదిరించి దారికి తేకుంటే ఈ కేసులో చంద్రబాబుకు విముక్తి కలిగించడం కష్టమని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. -
మూడు నెలల్లో ముగించేద్దాం
సాక్షి,టాస్క్ ఫోర్స్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన కేసులను యుద్ధప్రాతిపదికన మూసివేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇప్పుడు ఈ వ్యవహారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. పోలీసు, సీఐడీ విభాగాలను వీలైనంత మేర ఉపయోగించుకోవడం, కేసులను నీరుగార్చడం.. ఇదీ పథకం. ఈ పథకాన్ని సిద్ధార్థ్ లూథ్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. విజయవాడలోని నోవాటెల్ హోటల్ కేంద్రంగా ఆది, సోమవారాల్లో నిర్వహించిన రహస్య సమావేశాల్లో ఈ మేరకు ఓ కుట్రను ఖరారు చేశారని వినిపిస్తోంది. లూథ్రాతో పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం. సాక్షులను బెదిరించండి... వాంగ్మూలాలు మార్చండి.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బరితెగించి పాల్పడిన దోపిడీని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణాల కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబేనన్నది ఆధారాలతో బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధమని చెప్పినా సరే సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించడంతోనే అక్రమాలకు పాల్పడాల్సి వచ్చిందని ఆనాటి ఉన్నతాధికారులతోపాటు ఇతరులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అక్రమ నిధులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి, టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేరినట్టు ఆధారాలను సిట్ సేకరించింది. దాంతోనే ఆ కేసుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికినట్టైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసుల నుంచి చంద్రబాబు పేరు తప్పించేందుకు కుట్ర పన్నుతోంది. అందుకు గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులను, ఇతరులను తీవ్రస్థాయిలో బెదిరించి బెంబేలెత్తించాలని పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులకు ఆదేశాలందాయని తెలుస్తోంది. అవసరమైతే వారిపై ఇతరత్రా అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయాలని కూడా లూథ్రా సలహా ఇచి్చనట్లు సమాచారం. సాక్షులను బెదిరించి దారికి తెచ్చుకోకపోతే చంద్రబాబును ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేయడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎంతమందిని బెదిరించారు... ఎంతమంది ఇంకా బెదిరించాల్సిన జాబితాలో ఉన్నారనే వివరాలు కూడా లూథ్రా అడిగి తెలుసుకున్నారట.అన్నీ మూసేద్దాం..చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేయాలనేది కూడా ఈ రెండు రోజుల సమావేశాల్లో ఖరారు చేసిన కుట్రలో భాగంగా ఉంది. గతంలో సిట్‌లో పనిచేసిన కిందిస్థాయి అధికారులను పిలిపించి బెదిరించాలని కూడా లూథ్రా సలహా ఇచ్చారట. ఇప్పటికే తాము నాలుగైదు సార్లు ఆ కిందిస్థాయి అధికారులను తీవ్రస్థాయిలో బెదిరించామని పోలీసు, సీఐడీ అధికారులు ఆయనకు చెప్పారు. అది సరిపోదని....ఆ వేధింపులను ఇంకా తీవ్రతరం చేయాలని లూథ్రా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ గరిష్టంగా మూడు నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉందని, ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రోజువారీగా తనకు నివేదిక ఇవ్వాలని ఓ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారికి లూథ్రా సూచించినట్లు పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఈ పనులు పూర్తి చేస్తే అనంతరం చంద్రబాబుపై కేసులను మూసివేసే సంగతి తాను చూసుకుంటానని సీనియర్ న్యాయవాది లూథ్రా ఈ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై కేసులను నీరుగార్చే పన్నాగాన్ని కచ్చితంగా అమలు చేస్తామని... త్వరలోనే టాస్క్ పూర్తి చేస్తామని పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో లూథ్రా వ్యాఖ్యానించినట్లు పోలీసు వర్గాలంటున్నాయి. రెండు రోజుల సమావేశాల అనంతరం లూథ్రా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారని సమాచారం.అంతా లూథ్రా చెప్పినట్లే..సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవçÜ్థకు సూపర్ బాస్‌గా అవతరించారు. గతంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలిపోయిన ఆ సీనియర్ న్యాయవాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం చంద్రబాబు అవినీతి కేసులను అడ్డగోలుగా క్లోజ్ చేసే పన్నాగానికి సర్వం తానై వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అవినీతి కేసులను మూసివేయడంతోపాటు...వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేసే కుట్రను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. లూథ్రాయే సుప్రీం అని, ప్రభుత్వ కీలక విభాగాల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారని కూడా వినిపిస్తోంది. అందువల్లే పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్, న్యాయ విభాగాలు పూర్తిగా లూథ్రా నియంత్రణలోకి వచ్చేశాయి. ఆయన ఆదేశాలకు రాష్ట్ర పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు జీ హుజూర్ అంటున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులే కాదు... జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అవసరమని భావిస్తే చివరికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కూడా ఆయన ఫోన్లు చేసి ఆదేశిస్తున్నారు. వారు చిత్తం మహా ప్రభో.. అని ఆయన ఆదేశాలను శిరసావహిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదు మేరకు నమోదుచేసిన అక్రమ కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌పై అక్రమ కేసు నమోదు చేయడంతో పాటు విచారణ పేరుతో ఎలా వేధించాలో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారికి లూథ్రాయే స్వయంగా నిర్దేశించారని పోలీసులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, ఇతర అక్రమ కేసులతో వేధింపులను కూడా లూథ్రా నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారట. సిద్ధార్థ్ లూథ్రా రాజ్యాంగేతర శక్తిగా ఆవిర్భవించారని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
చంద్రబాబుకు నో రిలీఫ్..!
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పోలీసు కస్టడీ పిటిషన్‌పై వాదనలు వినకుండా ట్రయల్ జడ్జిని తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరిస్తూ కేసును తగిన ధర్మాసనం ముందు జాబితా చేస్తామని, అక్టోబరు 3న దీన్ని విచారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకొచ్చింది. అయితే ఈ పిటిషన్ విచారణపై జస్టిస్ ఎస్వీఎన్ భట్టికి కొన్ని రిజర్వేషన్లు (అభ్యంతరాలు) ఉన్నాయని జస్టిస్ సంజీవ్‌ఖన్నా పేర్కొన్నారు. దీంతో జస్టిస్ భట్టి నిర్ణయంపై తామేమీ చేయలేమని, కేసును త్వరగా జాబితా చేయాలని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే కోరారు. వచ్చే వారం జాబితా చేస్తామని జస్టిస్ సంజీవ్‌ఖన్నా పేర్కొనడంతో, జస్టిస్ భట్టి విచారణ నుంచి వైదొలిగిన అంశాన్ని సీజేఐ ముందు ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా అనుమతి కోరారు. ఇందుకు అనుమతించిన జస్టిస్ సంజీవ్‌ఖన్నా కేసును పాస్ ఓవర్ చేయాలా? అని న్యాయవాదుల్ని ప్రశ్నించారు. పాస్ ఓవర్‌తో ఉపయోగం ఉండదని, సోమవారం జాబితా చేయాలని హరీశ్ సాల్వే అభ్యర్థించారు. అది సాధ్యం కాదని, వచ్చే వారం జాబితా చేస్తామని, ప్రాసెస్‌కు కొంత సమయం పడుతుందని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి లేని ధర్మాసనంలో అక్టోబరు 3న ప్రారంభయ్యే వారంలో కేసును జాబితా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేం.. ట్రయల్ కోర్టు జడ్జిని నియంత్రించలేం: సీజేఐ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నిరాకరించారని, దీనిపై వెంటనే విచారణ జరిగేలా చూడాలని అనంతరం సీజేఐ ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా అభ్యర్థించారు. అయితే ఈ అంశంలో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని, వెంటనే విచారణ వద్దని సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ విన్నవించారు. ఈ దశలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ.. ‘అసలు మీకేం కావాలి? సెక్షన్ 17ఏతో బెయిలు కావాలని కోరుతున్నారా?’ అని ప్రశ్నించడంతో చంద్రబాబు ఎస్సెల్పీపై విచారణ జరపాలని లూత్రా కోరారు. అయితే బెయిలు కావాలని దరఖాస్తు చేసుకోవచ్చుగా? అని సీజేఐ సూచించారు. దీనిపై లూత్రా స్పందిస్తూ ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, 17 ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని చెప్పారు. దీంతో అక్టోబరు 3న విచారణ జాబితాలో చేర్చుతామని సీజేఐ తెలిపారు. సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు విచారిస్తోందని, చంద్రబాబును వారి కస్టడీకి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని లూత్రా కోరారు. ఇప్పటికే పోలీసు కస్టడీ పూర్తయిందని, మరో 15 రోజులు పోలీసు కస్టడీ కోరుతున్నారని ఎన్నికల నేపథ్యంలో పదే పదే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని లూత్రా ఆరోపించారు. తొలుత జ్యుడీషియల్ కస్టడీ తర్వాత పోలీసు కస్టడీకి ఇచ్చారన్నారు. ఈ క్రమంలో లూత్రా పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, ఈ దశలో అలాంటి ఆదేశాలను ఇవ్వలేమని, ట్రయల్ కోర్టు జడ్జిని నియంత్రించలేమని, అక్టోబరు 3నే విచారణ జాబితాలో చేర్చుతామని సీజేఐ తేల్చి చెప్పారు. దర్యాప్తు కొనసాగేలా చూడాలి: రంజిత్‌కుమార్ ఇదే సమయంలో సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ స్పందిస్తూ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.కోట్లలో కుంభకోణం జరిగిందని సీజేఐ దృష్టికి తెచ్చారు. రూ.3,330 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వం పది శాతం మాత్రమే వెచ్చిస్తుందంటూ నిధులు విడుదల చేశారన్నారు. ప్రైవేట్ సంస్థ 90 శాతం నిధులను ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా పది శాతం నిధులు చేతులు మారిపోయాయన్నారు. సొమ్ములు స్వాహా అయినట్లు జీఎస్టీ అధికారులు కూడా గుర్తించారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయడంతో గత ప్రభుత్వం ఫైళ్లు మాయం చేసిందన్నారు. ముందస్తుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని పిటిషనర్ వాదించడం సరి కాదన్నారు. ఆ చట్ట సవరణ కన్నా ముందుగానే ఈ కుంభకోణం జరిగిందన్నారు. దర్యాప్తు కొనసాగేలా చూడాలని అభ్యర్థించారు. -
సీఆర్పీసీ చట్టంలో హౌస్ అరెస్ట్ అనేదే లేదు: ఏఏజీ
-
జైల్లో ఉండను మా ఇంట్లో ఉంటా
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్ (ఇంటి వద్ద)లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు సోమవారం ముగిశాయి. వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. దీనిపై మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. అయితే ఉదయమే తీర్పు వెలువరించాలన్న చంద్రబాబు తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అభ్యర్థనను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఆ సమయంలో తమకు విచారించాల్సిన కేసులు చాలానే ఉన్నాయని కోర్టు పేర్కొంది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబును విచారించేందుకు కస్టడీకి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు సూచించింది. కౌంటర్లు దాఖలైన తరువాత కస్టడీ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది. బీపీ, షుగర్ ఉంది.. : అంతకు ముందు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుకున్న ప్రాణహాని రీత్యా ఆయనకు కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించిందన్నారు. ఆయన ప్రాణాలకు పలుమార్లు బెదిరింపులు కూడా వచ్చాయన్నారు. జైలులో చంద్రబాబు భద్రతపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. అంతేకాక చంద్రబాబు వయస్సు 73 ఏళ్లని, షుగర్, బీపీలతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని కోర్టుకు నివేదించారు. ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే ఆయనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్‌లో ఉంచాలని అభ్యర్థించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కు సంబంధించి దర్యాప్తు అధికారులు ఎన్నడూ చంద్రబాబు ఇంట్లో సోదాలు నిర్వహించలేదని, ఎలాంటి డాక్యుమెంట్లను జప్తు చేయలేదని తెలిపారు. అలాంటప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ స్కామ్‌లో ఎలాంటి ఆధారాలు ఉండే అవకాశం లేదన్నారు. హౌస్ రిమాండ్‌లో ఉంచితే సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడం జరగదన్నారు. వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను ఆయన ఉదహరించారు. జైలులోనే భద్రత ఎక్కువ... అనంతరం సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ హౌస్ రిమాండ్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హతే లేదన్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీలోలో ఉన్న నేపథ్యంలో హౌస్ రిమాండ్ పిటిషన్ నిరర్థకమైందన్నారు. చంద్రబాబు కోరుతున్న హౌస్ రిమాండ్ అభ్యర్థన అసాధారణమన్నారు. వాస్తవానికి హౌస్ రిమాండ్ ప్రస్తావన ఏ చట్టంలో కూడా లేదన్నారు. అందువల్ల హౌస్ రిమాండ్ మంజూరు చేయడానికి వీల్లేదని వాదించారు. చంద్రబాబుకు ప్రస్తుతం ఉన్న భద్రత కంటే జైలులో ఇంకా ఎక్కువ భద్రత ఉందని వివరించారు. జైలులో ఆయన భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. జైలులో చంద్రబాబు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదనేందుకు ఎలాంటి వైద్య రికార్డులను కోర్టు ముందు ఉంచలేదన్నారు. అరెస్ట్, రిమాండ్ సమయంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు డాక్టర్లు తేల్చారన్నారు. జీవన శైలి సంబంధ వ్యాధులకు సాధారణ మందులు తీసుకుంటే సరిపోతుందన్నారు. చంద్రబాబు అరోగ్యంగా ఉన్నారు కాబట్టే అరెస్ట్‌కు ముందు ఆయన చాలా క్రియాశీలకంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. హౌస్ రిమాండ్‌కు పంపితే సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం ఉందని చంద్రబాబు చెబుతున్నారని, అయితే వాస్తవానికి ఆయన ప్రోద్భలంతోనే ఇద్దరు కీలక వ్యక్తులు విదేశాలకు పరారయ్యారని తెలిపారు. వారు దర్యాప్తునకు దొరకుండా ఉండేందుకే అలా చేశారన్నారు. దర్యాప్తులో జోక్యం చేసుకోకుండా, సాక్షులను ప్రభావితం చేయకుండా, సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండేందుకే జ్యుడీషియల్ కస్టడీ విధిస్తారని, ఇప్పుడు చంద్రబాబుకు హౌస్ రిమాండ్ ఇస్తే ఆ సదుపాయాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఈ కోర్టు చంద్రబాబుకు ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, తగిన భద్రత కూడా కల్పించాలని జైలు అధికారులను ఆదేశించిందని తెలిపారు. చంద్రబాబుకు ఎలాంటి ప్రాణహాని లేదని సుధాకర్‌రెడ్డి చెప్పారు. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయకుండా హౌస్ రిమాండ్ కోసం పట్టుబడుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు తీర్పులను ఉదహరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. ఈ సమయంలో చంద్రబాబు న్యాయవాది లూథ్రా జోక్యం చేసుకుని ఉదయమే తీర్పు వెలువరించాలని పట్టుబడ్డారు. అయితే ఉదయం అనేక కేసులో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా విచారించాల్సిన బాధ్యత తమపై ఉందని కోర్టు గుర్తు చేసింది. -
ఏసీబీ దర్యాప్తుతో మేం సంతృప్తిగా ఉన్నాం
ఓటుకు కోట్లు కేసులో సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేస్తున్న దర్యాప్తు పట్ల సంతృప్తికరంగా ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా తెలిపారు. చంద్రబాబు ను ఇబ్బంది పెట్టడానికే ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలు చేశారని తెలిపారు. దురుద్దేశాలు, వేధింపులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు కాబట్టే, తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. రెండో రోజూ లూత్రావాదనలు ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు సక్రమంగా సాగడం లేదన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన న్యాయస్థానం దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ గత నెల 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వాటిని సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై 4 వారాల్లో తుది విచారణ జరపాలంటూ గత నెల 23న హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి ముందు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా గురువారం చంద్రబాబు తరఫున వాదనలు మొదలు పెట్టారు. తదుపరి వాదనలు వినిపించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని కోరారు. విచారణను 7కు వాయిదా వేశారు. ఉండవల్లి హక్కును కాలరాయలేను... ఈ కేసులో తన వాదనలూ వినాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేయాలని లూత్రా వాదించారు. దీనికి న్యాయమూర్తి సునీల్ చౌదరి స్పందిస్తూ... ‘వాదనలు వినిపించే ఆయన హక్కులను కాలరాయలేను’ అని తేల్చి చెప్పారు. -
ఓటుకు లంచమిస్తే చట్టం వర్తించదు
-
ఓటుకు లంచమిస్తే చట్టం వర్తించదు
చంద్రబాబు తరఫు న్యాయవాది వాదన ► ‘ఓటుకు కోట్లు’లో బాబు పిటిషన్‌పై వాదనలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ‘ఓటు హక్కు వినియోగించుకోవడమన్నది ప్రజా విధుల్లో భాగం కాదు. ప్రజా విధుల్లో భాగం కాని నేరానికి అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) ఎలా వర్తిస్తుంది’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ప్రశ్నించారు. ఆయన ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాల్సిందిగా ఏసీబీని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెల్సిందే. అయితే ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం వాదనలు ప్రారంభమయ్యాయి. పీసీ చట్టం వర్తించదు.. లూథ్రా తన వాదనలు కొనసాగిస్తూ.. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడమన్నది ప్రజావిధుల్లో భాగం కాదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం గతంలోనే స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ కేసులో అసలు ఫిర్యాదుదారైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసేందుకు లంచం ఇవ్వచూపారన్నది ప్రధాన ఆరోపణని తెలిపారు. ఇందుకు సంబంధించి నిందితులపై ఏసీబీ అధికారులు పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారన్నారు. ప్రజా విధుల్లో భాగం కాని నేరానికి పీసీ యాక్ట్ ఎలా వర్తిస్తుందో అర్థం కాకుండా ఉందన్నారు. ఇందుకు లూథ్రా ఓ ఉదాహరణనిచ్చారు.‘మునిసిపాలిటీలో ఓ ఇంజనీర్‌ను తీసుకుందాం. తాను చేయాల్సిన పనికి సంబంధించి లంచం తీసుకుంటే అది నేరం అవుతుంది. దానికి అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయవచ్చు. అదే ఇంజనీర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు తీసుకుంటే దానికి అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుంది? పబ్లిక్ సర్వెంట్ హోదాలో అతను ఓటు వేయలేదు. పెపైచ్చు ఓటు హక్కు ప్రజా విధుల్లో భాగం కానే కాదు.’ అని లూథ్రా వివరించారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఏసీబీ సంబంధిత కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేసింది’’ అని ఆయన తెలిపారు. ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసిన విషయాన్ని సంబంధిత కోర్టు దృష్టికి తీసుకురాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసిన కేసులో మళ్లీ దర్యాప్తు జరపాలని అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించిందని తెలిపారు. ఈ ఆదేశాల వల్ల ఏసీబీ అధికారులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని, ఒకే కేసులో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం సరికాదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని ఆయన కోర్టుకు నివేదించారు. సాక్షుల వాంగ్మూలాలు ఎలా వచ్చాయి? ఏసీబీ చార్జిషీట్లో ఉన్న సాక్షుల వాం గ్మూలాలు కేసుతో సంబంధం లేని థర్డ్ పార్టీ అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎలా వచ్చాయని లూథ్రా ప్రశ్నించారు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలాలను థర్డ్ పార్టీకి ఇవ్వడం సాధ్యం కాదని, ఇది కోర్టు నిబంధనలకు విరుద్ధమని ఆయన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు దాఖలు చేశారన్నారు. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు వ్యాజ్యం నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ హైకోర్టు గత నెల 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ గత నెల 23న హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం వాదనలు మొదలయ్యాయి.


