ఇ-కామర్స్ పోర్టల్ మూత.. 4వేల ఉద్యోగాలు ఫట్
న్యూఢిల్లీ: లేటెస్ట్ ఈ కామర్స్ పోర్టల్ 'ఆస్క్ మీ డాట్ కాం' మూత పడింది. దీంతో దేశంలో దాదాపు నాలుగువేలమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తీవ్రమైన నగదులేమి, పెరుగుతున్న నష్టాల నేపథ్యంలో తన కార్యకలాపాలను కార్యకలాపాలు స్తంభింప చేయాలని నిర్ణయించిందని జీ బిజ్ వెల్లడించింది. నిధుల సమీకరణలో చేసిన ప్రయత్నాలు విఫలంకావడంతో ఈ నిర్ణయం తీసుకుందని రిపోర్టు చేసింది. ఈ క్రమంలో ఆస్క్ మీ వెబ్సైట్ ఉనికిలో ఉన్నప్పటకీ ఎలాంటి కొత్త ఆర్డర్ లను అంగీకరించడంలేదు. ఆస్క్ మీ లో అతి పెద్ద వాటాదారు (97శాతం ) ఆస్ట్రో హోల్డింగ్స్ గత నెల నిష్క్రమణతో ఈ పరిణామం సంభవించింది.
మలేషియాకు చెందిన ఆస్ట్రో హీలియన్ వెంచర్ కాపిటల్ సంస్థలు సంయుక్తంగా 'ఆస్క్ మీ' తన సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సంస్థకు 40 కార్యాలయాలు ఉన్న ఆస్క్ మీ డాట్ కామ్ ప్రతి నెలా 6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 39 కోట్లు) నష్టాన్ని సంస్థ భరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వేతనాలు చెల్లించ లేని పరిస్థితికి నెట్టబడిందని జాతీయమీడియా రిపోర్ట్ చేసింది.
కాగా, కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న సంస్థ ఉద్యోగులకు వేతనాలు చెల్లించ లేని పరిస్థితిలో ఆస్ట్రో కి ఈమెయిల్స్ , సందేశాలు పంపాలని ఉద్యోగులను కోరింది. ఆస్క్ మీ పేరెంట్ కంపెనీ గెటిట్ ఇన్ఫో సర్వీసెస్ జోక్యం చేసుని అప్పులను చెల్లించకుండా సంస్థ ఉనికి కష్టమంటూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ని గెట్ ఇట్ సంస్థ ఆశ్రయించింది. అయినా ఫలితం దక్కలేదు.
ఇది ఇలా ఉంటే ఈ ఏడాది మే లో 30-40 కొత్త నగరాలకు తన కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతమున్న 200 కేంద్రాలకు తోడుగా మరిన్నింటిని ప్రారంభించనున్నట్టు ప్రకటించిన ఆస్క్ మీ చివరికి అనూహ్యంగా మూడపడింది.