breaking news
shot dead in Pakistan
-
పాక్‌లో ప్రముఖ మతపెద్ద కాల్చివేత
పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ ప్రావిన్స్‌లో మంగళవారం ప్రముఖ మతపెద్దను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. చార్సద్దా జిల్లా ఉట్మన్జాయ్ ఏరియాలో మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగులు షేక్ ఉల్ హదిత్ మౌలానా మహ్మద్ ఇద్రీస్ వాహనాన్ని అడ్డగించి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.తీవ్రంగా గాయపడిన ఇద్రీస్ ఆస్పత్రికి తరలిస్తుండగానే కన్నుమూశారు. గాయపడిన భద్రతా సిబ్బందికి ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. దాడికి తమదే బాధ్యతని ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసాన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ)ప్రకటించుకుంది. జమియత్ ఉలేమా–ఇ– ఇస్లామ్(ఎఫ్) చర్సద్దా జిల్లా చీఫ్‌గా ఉన్న ఇద్రిస్ ఆ పార్టీ చీఫ్ మౌలానా ఫజలుర్ రహా్మన్కు సన్నిహితుడు. -
యూఎస్ రాయబార కార్యాలయ ఉద్యోగి కాల్చివేత
పాకిస్థాన్‌లోని యూఎస్ రాయబార కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న పెషావర్‌కు చెందిన ఉద్యోగి ఫైసల్ సయ్యద్ (33)ని ఆగంతకుడు సోమవారం తుపాకితో కాల్చి చంపాడు. ఆ ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించాడు. పెషావర్ గుల్బహర్ కాలనీలోని తన నివాసం నుంచి బయటకు వస్తున్న అతడిని ఆగంతకుడు కాల్చి చంపాడని పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు.


