breaking news
Shelling gudumba
-
ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్‌కు రాష్ట్రస్థాయి అవార్డు
తొర్రూరు : గుడుంబా నిర్మూలన, అక్రమ నల్లబెల్లం వ్యాపారం, రవాణ నిర్మూలించడంలో కృషి చేసిన తొర్రూరు ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్‌కు రా ష్ట్రస్థాయిలో అవార్డు దక్కింది. ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ జరిగిన కార్యక్రమంలో ఎక్సైజ్ కమిషనర్ వీఆర్ చంద్రవదన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ చేతుల మీదు గా ఆయన అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా సీఐ చంద్రమోహన్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడం వల్ల తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. -
ఈ హెడ్‌కు సెపరేటు
మానుకోట ఎక్సైజ్ సర్కిల్లో కాసుల వేట నల్లబెల్లం వ్యాపారులను {పోత్సహిస్తున్న ‘హెడ్’Z మామూళ్ల వసూళ్లతో పరోక్షంగా గుడుంబా తయారీకి దన్ను సర్కిల్ పరిధిలో ఏరులై పారుతున్న గుడుంబా వరంగల్ క్రైం : మహబూబాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గుడుంబా ఏరులై పారుతోంది. జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్ సిబ్బంది గుడుంబా నిర్మూలనకు కంకణం కట్టుకుంటే.. మహబూబాబాద్ సర్కిల్ పరిధిలో ఓ హెడ్‌కానిస్టేబుల్ మాత్రం బెల్లం వ్యాపారుల నుంచి మామూళ్ల వసూళ్లకు నడుం బిగించాడు. ఇలా పరోక్షంగా ఇతడు గుడుంబా తయూరీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. యూనియన్ నాయకుడిగా చెప్పుకునే సదరు హెడ్‌కానిస్టేబుల్ ఎక్సైజ్ స్క్వాడ్‌లో కొనసాగుతున్నాడు. మహబూబాబాద్, కేసముద్రం, కురవి, నెక్కొండ, నర్సంపేట వరకు తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆయా ప్రాంతాల్లో నల్లబెల్లం వ్యాపారుల వద్ద ప్రతీ నెలా మామూళ్లు తీసుకుంటూ నల్లబెల్లం వ్యాపారులకు కొమ్ముకాస్తున్నాడు. ‘మీరు నల్లబెల్లం ఎంతైనా అమ్ముకోండి.. నేను ఉన్నంత వరకు మీకు ఏం కాదు’ అంటూ భరోసా ఇస్తున్నట్లు తెలిసింది. నల్లబెల్లం తండాలకు విరివిగా సరఫరా అవుతుండడంతో గుడుంబా కూడా అదేస్థారుులో తయూరవుతోంది. అబ్కారీ శాఖలో ఆయనకు పెద్దమనిషి అనే పేరు ఉండడంతో నల్లబెల్లం వ్యాపారాన్ని తన కనుసన్నలలో నడిపిస్తున్నాడు. కేసముద్రంలో ఒక్కో నల్లబెల్లం వ్యాపారి వద్ద ప్రతీ నె లా రూ.5 వేలు తీసుకుంటున్నాడు. అలాగే కురవిలో ఒక్కో వ్యాపారి నుంచి రూ.3 వేలు, డోర్నకల్‌లో రూ.4 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇలా ఒక్కో ప్రాంతంలో జరిగే విక్రయాలకు అనుగుణంగా ఒక్కో రేటు పెట్టి వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ నెలా ఎక్సైజ్ వారికి మామూళ్లు ఇస్తున్నామని సదరు వ్యాపారులు మొత్తుకుంటున్నా తనకు మాత్రం సెపరేటుగా ఇవ్వకుంటే కేసులు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వీరితోపాటు మహబూబాబాద్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని పలు స్టేషన్ల పరిధిలో తన మామూళ్ల సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు ఆ శాఖలోని వారే చెప్పుకుంటున్నారు. తాను సదరు సంఘానికి నాయకుడిగా ఉన్నానని, తనను ఎవరు ఏమి చేయలేరంటూ వ్యాపారుల వద్దకు వెళ్తున్నట్లు సమాచారం. సదరు హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం శాఖలోని ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ అతడిపై చర్యలకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అద నుగా భావిస్తున్న హెడ్ నల్లబెల్లం వ్యాపారాన్నిప్రోత్సహిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు సదరు అవినీతి ఉద్యోగిపై చర్య తీసుకోనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గుడుంబా నిర్మూలన కార్యక్రమానికి మహబూబాబాద్ సర్కిల్లో గండిపడే అవకాశం ఉంది.