breaking news
shekhar kammula
-
మా సినిమాల రిలీజ్ డేట్స్‌ను వాళ్లే నిర్ణయిస్తున్నారు: కుబేర నిర్మాత
కుబేర మూవీ నిర్మాత సునీల్ నారంగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా విడుదలపై ఓటీటీల ఆధిపత్యం కొనసాగుతోందని అన్నారు. తాము నిర్మించిన మూవీ రిలీజ్ డేట్‌ను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. మా సినిమాను జూలైలో విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. ఓటీటీ సంస్థ ఒప్పుకోలేదని అన్నారు. సినిమా విడుదల ఆలస్యమైతే అంగీకరించిన మొత్తంలో రూ. 10 కోట్ల రూపాయలు కోత విధిస్తామని హెచ్చరించందని నిర్మాత సునీల్ వెల్లడించారు. ఓటీటీలే సినిమాల విడుదల తేదీలను నిర్ణయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోతోందని తెలిపారు.'కుబేరా' నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ' ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సినిమాల విడుదల తేదీని నిర్ణయిస్తున్నాయి. ఒకటి, రెండు వారాలు ఆలస్యమైతే వాళ్లు ఒప్పుకోవడం లేదు. నేను జూలైలో కుబేరా మూవీ రిలీజ్‌కు ఓటీటీ సంస్థను అభ్యర్థించా. కానీ మొదట అంగీకరించిన తేదీ జూన్ 20న విడుదల చేయాలని నన్ను కోరారు. ఆ డేట్లో రిలీజ్ చేయకపోతే అంగీకరించిన మొత్తంలో 10 కోట్లు తగ్గిస్తామని చెప్పారు.' అని వెల్లడించారు.తెలుగు చిత్ర పరిశ్రమలో పరిస్థితి గురించి మాట్లాడుతూ.. 'కొన్ని సంఘటనల కారణంగా పరిశ్రమ దెబ్బతింది. మేము సినిమా సర్వీస్ ప్రొవైడర్ అయిన క్యూబ్‌పై పూర్తిగా ఆధారపడి ఉన్నాం. శాటిలైట్ లేకుండా సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదు. ఇక బుక్‌మైషో ఒక గంట పాటు ఇంటర్నెట్ ఆపేస్తే కలెక్షన్లు సున్నాకి పడిపోతాయి. అలా మేము వాటన్నిటిపైనే కాకుండా ఇప్పుడు ఓటీటీలపై ఆధారపడాల్సి వస్తోంది' అన్నారు.గతంలో శాటిలైట్, థియేటర్లను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీసేవాళ్లమని సునీల్ నారంగ్ తెలిపారు. అయితే ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను బట్టి మేము సినిమాలు తీస్తున్నామని వెల్లడించారు. మెల్లమెల్లగా వాళ్లే ఇప్పుడు పరిశ్రమకు కింగ్‌గా మారుతున్నారని.. సినిమా ఆడినా.. ఆడకపోయినా ఈ ముగ్గురూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా.. కుబేర మూవీలో కోలీవుడ్ హీరో ధనుశ్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రంజూన్ 20న విడుదల కానుంది. -
లీడర్ హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా?
హైదరాబాద్‌లో పుట్టి.. అమెరికాలో పెరిగి.. చెన్నైలో మోడలింగ్ చేసి హీరోయిన్గా మారిన అమ్మాయి ప్రియా ఆనంద్. రానా మూవీ లీడర్ సినిమాలో టాలీవుడ్ ప్రేక్షకులకు పలకరించింది. ఆ చిత్రంలో జర్నలిస్టుగా పాత్ర వేసి శభాష్ అనిపించుకుంది. తొలి సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. లీడర్ రిలీజ్ కాకముందే మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు కొట్టేసింది. వామనన్ అనే తమిళ చిత్రంలో సినీరంగంలోకి ప్రవేశించింది. తమిళ బ్యూటీ ప్రియా ఆనంద్ లీడర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా నటించిన ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేసింది. సినిమా హిట్ అయినప్పటికీ ఆమె పెద్దగా అవకాశాలు రాలేదు. పలు కారణాలతో ఆమె ఛాన్సులు రాకుండా పోయాయి. కొన్ని సినిమాల్లో సెకండ్ ఛాయిస్‌గా ప్రియాను తీసుకున్నారు. వాటిలో రామ్ పోతినేని, సిద్దార్థ్, రానా, శర్వానంద్‌తో నటించింది. అయితే ప్రస్తుతం ఆమె చేస్తుందన్న దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. టాలీవుడ్ కనుమరుగై పోయినా.. కోలీవుడ్‌లో మాత్రం బీజీ అయిపోయింది. ఇటీవల తమిళ డబ్బింగ్ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అవకాశాలు రావడంతో అభిమానులను అలరిస్తోంది. ఇప్పటికే ఓ తమిళ మూవీలో హీరోయిన్గా చేస్తుండగా.. మరో కన్నడ మూవీకి ఓకే చెప్పిందంట ప్రియా ఆనంద్. -
‘ఆ విషయంలో సాయి పల్లవికి పోటీ లేదు’
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరి’. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందంచారు. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘లవ్ స్టోరి’ చిత్రంలోని ఒక్కో పాట విడుదలవుతూ వస్తున్నాయి. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే, ఆదివారం విడుదలైన ‘సారంగ దరియా’ పాట సూపర్ హిట్ అయ్యింది. విడుదలైన 24 గంటల్లో ఏకంగా 7 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఈ ఏడాది బన్ని రికార్డు బ్రేక్ చేస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతేడాది తివ్రిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన అలా వైకుంఠపురంలో చిత్రంలోని ‘రాములో రాములా’ సాంగ్ అత్యధిక వ్యూస్ సంపాదించి రికార్డు సృష్టించిన సంగతి తెలుస్తోంది. ఈ ఏడాది సాయి పల్లవి ‘సారంగ దరియా’ ఈ రికార్డు బ్రేక్ చేస్తోందని భావిస్తున్నారు నెటిజనలు. సాంగ్ ఎంత బాగుందో.. ఇక సాయి పల్లవి డ్యాన్స్ కూడా అదే రేంజ్లో ఉందని ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సారంగ దరియా సాంగ్‌కు డ్యాన్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సాయి పల్లవి మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఓ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆమె డ్యాన్స్ చేస్తే.. నెమలి నాట్యం ఆడినట్లు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘సాయి పల్లవితో ఇది నా మూడో సాంగ్. గతంలో ఫిదా చిత్రంలో ‘వచ్చిండే’.. ఎంసీఏ చిత్రంలో ‘ఏవండోయ్ నాని గారు’ పాటలకు కొరియోగ్రఫి చేశాను. ఇప్పుడు లవ్‌స్టోరిలో ‘సారంగ దరియా’ పాటకు మరోసారి సాయిపల్లవితో పని చేసే అవకాశం లభించింది. ఇక మొదటి రెండు పాటలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో ఈ పాటకు కొరియోగ్రఫి విషయంలో ఒత్తిడి, అంచానాలు అన్ని భారీగానే పెరిగాయి’’ అన్నారు. ‘‘సాయి పల్లవిని పెట్టుకుని బాగా చేయకపోతే తప్పు అవుతుంది. ఆమె ఏ ఎక్స్ ప్రెషన్ ఇచ్చినా బాగుంటుంది. ఒకసారి పాట ఎడిట్ చేసి చూస్తే తనకంటే బాగా ఇంకెవరూ చేయలేరేమో అనిపిస్తుంది. ఆమె క్లాసికల్ డాన్సర్. కొరియాగ్రఫర్స్ కొన్ని మూమెంట్స్ అనుకుంటారు. వాటిని హీరో, హీరోయిన్ కరెక్ట్‌గా చేస్తేనే బాగుంటుంది. సాయి పల్లవితో ఈ మూవ్మెంట్ రాదు అని ఎప్పుడూ అనుకోలేదు. మేము చెప్పిన మూవ్‌మెంట్స్‌ను ఇంకా బాగా చేసి చూపిస్తుంది. మాలాంటి డాన్స్ మాస్టర్లకు సాయి పల్లవి లాంటి హీరోయిన్ దొరకడం అదృష్టం’’ అన్నారు. ‘‘తను డ్యాన్స్ చూస్తే.. నెమలి నాట్యం ఆడినట్లే ఉంటుంది. స్టార్ హీరోలకు కూడా కష్టంగా భావించే స్టెప్స్‌ని తను చాలా చేస్తుంది. డ్యాన్స్ విషయంలో తనతో ఏ హీరోయిన్ పోటి పడలేరు అని తెలిపారు. ఈ చిత్రంలో తాను సారంగ దరియాతో పాటు మరో రెయిన్ పాటకు కొరియోగ్రఫి చేసినట్లు వెల్లడించారు శేఖర్ మాస్టర్. చదవండి: రానాతో సాయిపల్లవి కోలు.. కోలు... సాయి పల్లవి స్పెషల్ టాలెంట్ : అభిమానులు ఫిదా -
తెలంగాణ సీఎం కేసీఆర్....‘ఫిదా’!
హైదరాబాద్: ‘ఫిదా’ సినిమాలో నటీనటులు చక్కగా నటించారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) కితాబిచ్చారు. వీలు చూసుకుని తనను కలవాలని దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత్ దిల్రాజును ఆయన ఆహ్వానించారు. ‘ఫిదా’ సినిమాను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సినిమాను అద్భుతంగా తీశారని చిత్రయూనిట్‌ను కేసీఆర్ మెచ్చుకున్నారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమకథతో తెరకెక్కించిన ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ సాయిపల్లవి నటనకు ప్రేక్షకులు ‘ఫిదా’ అవుతున్నారు. సున్నిత భావోద్వేగాలను తెరపై అందంగా చూపించడంలో చేయి తిరిగిన శేఖర్ కమ్ముల మరోసారి తన ప్రత్యేకత చాటుకోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.