breaking news
Sharmila visitation trip
-
మాట నిలబెట్టుకునే వంశం వైఎస్ఆర్దే..
షర్మిల పరామర్శయాత్ర కోసం రూట్ సర్వే చేసిన నేతలు జనగామ: రాష్ట్రంలో మాట నిలబెట్టుకునే వంశం ఒక్క వైఎస్ఆర్దేనని... ఆ ఘనత ఆ కుటుంబానికే దక్కుతుందని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షులు జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, భీష్వ రవీందర్ అన్నారు. మహానేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు రానున్న వైఎస్ జగన్ సోదరి షర్మిల యాత్రకోసం శనివారం వీరు రూట్ సర్వే చేశారు. జిల్లాలోని చేర్యాల, మద్దూరు మండలం భైరాన్‌పల్లి, బచ్చన్నపేట మండలం కట్కూరు, బండనాగారం, కేశిరెడ్డిపల్లి, ఆలీంపూర్, బచ్చన్నపేట, పోచన్నపేటలోని మూడు గ్రామాల్లోని 9 కుటుంబాలతో పాటు అలువాల యాదగిరి కుటుంబం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను నేరుగా కలుసుకుని పరామర్శించేందుకు షర్మిల ఈ నెల చివరి వారంలో పర్యటించనున్నారని వివరించారు. లక్షలాది మంది పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక్క వైఎస్‌కే దక్కుతుందని కొనియాడారు. -
షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
- 29 నుంచి రంగారెడ్డిలో యాత్ర - ఓటుకు కోట్లు కేసును పక్కదారిపట్టిస్తున్న బాబు - వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి కాజీపేట రూరల్ : ఈ నెల 29వ తేదీ నుంచి జూలై 2 వరకు రంగారెడ్డి జిల్లాలో షర్మిల చేపట్టే పరామర్శయూత్రను విజయవంతం చేయూలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి కోరారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ జిల్లా నాయకుల సమావేశంలో పాదయూత్ర పోస్టర్ ఆవిష్కరించారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఓటుకు కోట్లు కేసును పక్కదారి పట్టించేందుకే ఏపీ సీఎం చంద్రబాబు సెక్షన్ 8ను తెరపైకి తెచ్చారని విమర్శించారు. విచారణకు బాబు సహకరించాలని సూచిం చారు. రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం మాట్లాడుతూ, టీవీ చానెళ్లకు ఏపీ సర్కారు నోటీసులివ్వడాన్ని ఖండించారు. మిషన్ కాక తీయ పనుల్లో కుమ్మక్కైన అధికారులు, కాం ట్రాక్టర్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశా రు. రైతులకు గిట్టుబాట ధర కల్పించాలని రాష్ట్రసంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్ కోరారు. పింఛన్లను ఆయా డివిజన్లలో పంపిణీ చేయాలని గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్ కోరారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివ, యుజన విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్ రాజ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు దోపతి సుదర్శన్‌రెడ్డి జిల్లానాయకులు అప్పం కిషన్, ఎండీ. షంషీర్బేగ్, కాందాడి అచ్చిరెడ్డి, దుప్పటి ప్రకాస్, గౌని సాంబయ్య గౌడ్, ఎస్ఏ. ఖాదర్ హస్మీ, మంచె అశోక్, బొడ్డు శ్రావణ్ కుమార్, భీంరెడ్డి రవితేజరెడ్డి, పిడిశెట్టి సంపత్, రాకేష్, చిర్ర అనిల్, అరెపల్లి రాజు, హరీశ్, ప్రశాంత్, కిరణ్, మురళి పాల్గొన్నారు. -
8 నుంచి షర్మిల పరామర్శ యాత్ర
⇒ కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభం ⇒ మహానేత మరణవార్త విని మృతిచెందిన కుటుంబాల పరామర్శ ⇒ వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి వెల్లడి ⇒ యాత్ర పోస్టర్ విడుదల మహబూబ్‌నగర్ అర్బన్: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లాలో ఆయన సోదరి షర్మిల పరామర్శ యాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్, సీజీసీ మెంబర్ ఎడ్మ కిష్టారెడ్డి వెల్లడించారు. సోమవారం స్థానిక న్యూటౌన్‌లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం, మాల్నుంచి కురిమేడు గ్రామంలో షర్మిలమ్మ యాత్ర ప్రవేశిస్తుందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణవార్త విని తట్టుకోలేక వేలాదిమంది చనిపోయారని అన్నారు. ఆ సందర్భంగా నల్లకాలువలో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి మరణాన్ని విని ప్రాణాలుకోల్పోయిన అందరి కుటుంబాలను సందర్శించి ఓదారుస్తానని మాటిచ్చారని గుర్తుచేశారు. అప్పట్లో రాయలసీమ, ఆంధ్రాతోపాటు ఖమ్మం జిల్లాలో జగనన్న ఓదార్పుయాత్రను దిగ్విజయంగా చేపట్టారని అన్నారు. అప్పుడు జిల్లాలో జరగాల్సిన యాత్ర వాయిదా పడిందని.. ఆ యాత్రను ఇప్పు డు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పూర్తి చేసేందుకు వస్తున్నారని చెప్పారు. ఈ యాత్ర జిల్లాలో ఐదు రోజులపాటు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 19 కుటుంబాలను కలుసుకొని వారిని పలుకరించనున్నట్లు తెలిపారు. ఇది ఎన్నికల సమయం కాదని, మరో ఐదేళ్ల వరకు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలూ లేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి జిల్లాలో షర్మిల పర్యటిస్తున్నారని చెప్పారు. యాత్రకు సహకరించండి... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాల తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ, సహాయ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. అందుకే మహానేత ప్రజలందరి గుండెల్లో స్థానాన్ని సంపాదించారని, రాజకీయాలకతీతంగా జరిగే ఈ యాత్రకు సహకరించాలని కోరారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న పథకాలు అమలు చేసినందుకే వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చారని అన్నారు. ఈ యాత్ర సందర్భంగా పలుచోట్ల వైఎస్ విగ్రహాలతోపాటు ఆయా గ్రామాల్లోగల జాతీయ నాయకులందరికీ నివాళులు అర్పిస్తారని, మరికొన్ని చోట్ల పార్టీ శ్రేణులు, అభిమానులు నిర్మిస్తున్న నూతన విగ్రహాలను ఆవిష్కరిస్తారని తెలిపారు. జిల్లాలో 200మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోగా తమ పార్టీ పరంగా 157 మందికి సొంతంగా, 421 జీఓ, ఎన్ఎఫ్బీఎస్ పథకాల కింద ఆర్థికసహాయం అందించామని అన్నారు. అందుకే వీలైతే ఈ పరామర్శయాత్రలో సందర్శించే గ్రామాల్లోగల రైతు ఆత్మహత్యల కుటుంబాలను కూడా పరామర్శించే అవకాశం ఉందన్నారు. వైఎస్ అభిమానులు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు మాదిరెడ్డి భగవంతురెడ్డి, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బీష్వ రవీందర్, హైదర్ అలీ, జెట్టిరాజశేఖర్, పుల్లయ్యశెట్టి, భీమయ్యగౌడ్, బంగి లక్ష్మణ్, హన్మంతు, నసీర్, శేఖర్ పంతులు పాల్గొన్నారు.