breaking news
shape out
-
తాబేలు ఆకారంలో ఆలుగడ్డ
నెన్నెల: మండల కేంద్రంలోని వడ్లవాడకు చెందిన మోసీన్ అనే కారు డ్రైవర్ ఇంట్లో అ చ్చం తాబేలు ఆకారంలో ఉన్న ఆలుగడ్డ చూపరును ఆకట్టుకుంటుంది. పది రోజుల క్రితం దుకాణంలో రెండు కిలోల ఆలుగడ్డలు తీసుకొచ్చి ఇంట్లో ఉంచామని అందులో కొన్ని ఆలుగడ్డలు మొలకెత్తాయి. ఒక ఆలుగడ్డ మాత్రం తాబేలు ఆకారంలో కనిపించిందని మోసీన్ తెలిపారు. ఆలుగడ్డకు ముందు భాగంలో తలలాగా ఒక పిలక, వెనుక భాగంలో ఇరువైపుల రెండు పిలకలు, మధ్య భాగంలో కాళ్ల వలె రెండు పిలకలు వచ్చాయని అన్నారు. దీంతో ఆలుగడ్డ అచ్చం తాబేలులా కనిపిస్తుందని తెలిపారు. -
పిల్లలు పుడితే..!
ఆలూ లేదు చూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నారట ఎవరో. అలా ఇలియానా ఇంకా పెళ్లి గురించే ఆలోచించడంలేదు.. అప్పుడే పిల్లలు పుడితే బరువు పెరుగుతానేమో అని ఆలోచిస్తున్నారట. అవును మరి.. సన్నగా, మెరుపు తీగలా ఉండే ఏ అమ్మాయి అయినా పిల్లలు పుట్టిన తర్వాత ‘షేప్ అవుట్’ అవుతుందని భయపడటం సహజమే కదా. పైగా ఇలియానా లాంటి హీరోయిన్లకు ఈ భయం ఇంకా ఉంటుంది. అందుకేనేమో పిల్లలు పుట్టిన తర్వాత కూడా స్లిమ్‌గా ఎలా ఉండాలి? అనే విషయాలు తెలుసుకుంటున్నారట. ఆల్రెడీ ఇలియానా అక్క తల్లయ్యారు. తన అక్క గర్భం దాల్చినప్పుడు, బిడ్డను కనేలోపు వచ్చిన మార్పులు, ఆ తర్వాత మారిన ఆమె శరీరాకృతి గురించి దగ్గరగా చూశారు ఇలియానా. దాంతో తల్లయ్యాక శరీరాకృతి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొంతవరకు అవగాహన చేసుకున్నారట. ఏదేమైనా దీన్నిబట్టి ఇలియానాకు ముందు చూపు ఎక్కువ అని మాత్రం అర్థమవుతోంది.