breaking news
Service number
-
మీటర్లలో ‘సర్వీస్’ మాయ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ మీటర్లు అమర్చిన విద్యుత్ పంపిణీ సంస్థలు వాటికి సర్వీస్ నంబర్లు లేవనే విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించాయి. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సర్కిల్ పరిధిలో ఈ భాగోతం వెలుగు చూసింది. దీనిపై నివేదిక సమర్పించాలని ఈసీడీసీఎల్ సీఎండీ ఐ.పృథ్వీతేజ్ అధికారులను ఆదేశించగా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అమలాపురం ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు అమలాపురం సర్కిల్ ఎస్ఈ ఎస్.రాజబాబు మెమో జారీ చేశారు. ఇప్పటికైనా ‘మోస్ట్ అర్జంట్ మేటర్’గా పరిగణించి ఏడు రోజుల్లోగా మీటర్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అందులో స్పష్టం చేశారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది అంగన్వాడీ కేంద్రాల్లో సర్వీస్ నంబర్ లేకుండా మీటర్లు అమర్చి, బిల్లులు ఇవ్వకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. మరికొన్ని సర్వీసులకు బిల్లులు జారీ చేసినా వాటిని వినియోగదారులకు ఇవ్వలేదు. దీని వెనుక భారీ కుంభకోణం ఉందని తెలుస్తోంది. ప్రాణాలతోనూ చెలగాటం రాష్ట్రవ్యాప్తంగా 55,605 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. దాదాపు 35 లక్షల మంది ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఈ కేంద్రాలకు వస్తుంటారు. దాదాపు 1.30 లక్షల మంది అంగన్వాడీ సిబ్బంది నిత్యం ఈ కేంద్రాల్లోనే విధులు నిర్వర్తిస్తుంటారు. అలాంటిచోట విద్యుత్ మీటర్లు 6 అడుగులకు పైగా ఎత్తులో అమర్చాలి. కా..నీ చిన్న పిల్లలుంటారనే కనీస ఇంగితం కూడా లేకుండా ఈ కేంద్రాల్లో కేవలం 3 అడుగులు ఎత్తులోనే మీటర్లు ఏర్పాటు చేశారు.మొత్తం బిల్లు ఇప్పుడు ఇస్తాం కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు కూడా రూపొందించాం. కానీ.. ఆ బిల్లులను ఎవరికీ ఇవ్వలేదు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు మీటర్లు ఇచ్చినప్పటికీ సర్వీసు నంబర్ ఇవ్వలేదు. కొన్నేళ్లుగా రీడింగ్ తీయకపోయినా ఆ సమాచారం మీటర్లో నిక్షిప్లమై ఉంటుంది. దాని ఆధారంగా మొత్తం బిల్లును ఇప్పుడు జారీ చేస్తాం. – రవికుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అమలాపురం ఆపరేషన్ డివిజన్ -
ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించండిలా...
కరెంట్ బిల్లు చెల్లించేందుకు కౌంటర్ వద్దకు వెళ్తే అక్కడ చాంతాడంత క్యూ.. అంత సమయం మనకు లేదు.. బిల్లు చెల్లించి తీరాల్సిందే.. మరెలా..? ఇపుడు క్యూ లైన్లో నిలబడి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా ఆన్లైన్లోనే.. మీ బ్యాంకు ఖాతాలో డబ్బుంటే ఎంచక్కా కంప్యూటర్ ముందు కూర్చోని నెట్ ఓపెన్ చేసి బిల్లు చెల్లించండి. అదెలాగో తెలుసుకోండి మరి.. - హస్తినాపురం ఆన్లైన్లో విద్యుత్ బిల్లు చెల్లించే విధానం.. ముందుగా గూగుల్‌లో ఎంటర్ చేసి సెర్చ్ చేయండి ఆ వెంటనే తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పే యువర్ బిల్‌పై నొక్కండి బిల్ డెస్క్ అని వస్తుంది ఆ తరువాత ఆన్లైన్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో సెలెక్ట్ డిస్ట్రిక్ట్, ఈఆర్ఓ, సర్వీస్ నెంబర్ అడుగుతుంది. వాటిని ఎంటర్ చేయాలి. ఉదాహరణకు: బిల్‌పై 6146 02194 నంబర్లు ఉంటాయి. అందులో 6146 ఏరియా కోడ్, 194 సర్వీస్ నంబర్ అన్నమాట. వివరాలు నమోదు చేసిన తరువాత మేక్ పేమెంట్‌పై నొక్కండి గో టూ ఇంటర్నెట్ బ్యాంకింగ్(ఇంటర్నెట్ బ్యాంకు సేవలోకి వెళ్లండి) సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని వస్తుంది. అప్పుడు మీ బ్యాంకును ఎంపిక చేసుకోండి. క్లిక్ ఆన్ సబ్మిట్పై నొక్కండి ఇట్ విల్ టేక్ యువర్ బ్యాంక్ అకౌంట్ (అది బ్యాంకు ఖాతాను తీసుకుంటుంది) ఎంటర్ బ్యాంక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్లిక్ ఆన్ కన్ఫార్మ్ వెరిఫైయింగ్ అమౌంట్ అండ్ కరెంట్ మీటర్ నంబర్ అని అడుగుంది. ఆ తరువాత మీ మొబైల్ నంబర్‌కు ఎనిమిది అంకెలతో కూడిన ఎస్ఎంఎస్ వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేయాలి క్లిక్ ఆన్ కన్ఫార్మ్ అని అడుగుతుంది.(దాన్ని క్లిక్ చేయండి) రిక్వెస్ట్ కంప్లీటెడ్ మీ బిల్లు చెల్లింపు పూర్తయినట్టు. తరువాత ప్రింట్ తీసుకోండి