గోదావరి బోర్డు భేటీ వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అధికారుల విజ్ఞప్తి మేరకు నేడు జరగాల్సిన గోదావరి బోర్డు సమావేశం వాయిదా పడింది. తిరిగి సెప్టెంబర్ 23న బోర్డు సమావేశం నిర్వహిస్తారు. రక్షాబంధన్తో పాటు అసెంబ్లీ సమావేశాలకు సమాయత్తం కావాల్సి వున్నందున భేటీని వాయిదా వేయాల్సిందిగా ఏపీ అధికారులు కోరడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.