breaking news
self protection
-
‘ఇంతి’ంతై..
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అనేది మొన్నటి మాట. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే ఉద్యోగాల్లో సైతం ముందుంటున్నారు. వ్యవసాయంలోనూ తమ సత్తా చాటుతున్నారు. పట్టుదలతో తమకు సాటి లేదని నిరూపిస్తున్నారు. మహిళా సాధికారత సాధన దిశగా కదం తొక్కుతున్నారు. నేడు మహిళాదినోత్సవం ఈ సందర్భంగా.. తెనాలి టౌన్, న్యూస్‌లైన్ పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తెనాలి పట్టణం, రూరల్ మండలం, కొల్లిపర మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంతోమంది మహిళలు అధికారులుగా పనిచేస్తున్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా వారి అభిప్రాయాలు.. సెల్ఫ్ ప్రొటెక్షన్‌పై తరగతులు నిర్వహించాలి.. ప్రాథమిక విద్యాదశ నుంచే బాలికలకు పాఠశాలల్లో సెల్ఫ్ ప్రొటక్షన్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. మహిళా దినోత్సవం నిర్వహణ వల్ల సామాజికాంశాల్లో అవగాహన వస్తుంది. సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. - కె.జ్యోతిరమణి, ఏడీఏ అబ్బాయిలకూ అవగాహన కల్పించాలి.. ఈ రోజుల్లో ఆడపిల్లలను బయటకు పంపాలంటే భయమేస్తోంది. సమాజంపై అబ్బాయిలకు కూడా అవగాహన కల్పించాలి. పురుషులతో పాటు అన్ని పనులు చేసే ఘనత మహిళలకే దక్కుతుంది. -పి.లావణ్య, మార్కెట్ యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్థిక స్వాతంత్య్రం రావాలి.. సమాజంలో మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కావాలి. బాలికలను పెంచే విధానంలో మార్పురావాలి. ధైర్యసాహసాలను పెంపొందించి, ఆత్మనూన్యతాభావాన్ని పారదోలాలి. - ఎ.సులోచన, సీడీసీవో విద్యతో విజ్ఞానం.. విద్య వల్ల విజ్ఞానం కలుగుతుంది. అభివృద్ధికి కారణం అవుతుంది. పురుషుల సహకారం ఎంతో అవసరం. సంప్రదాయాలను పాటిస్తూ, కుటుంబ పరిస్థితులను చూసుకుంటూ ఉద్యోగాల్లో పురుషులతో పాటు ధీటుగా పనిచేస్తున్నాం. -కె.అమలకుమారి, వ్యవసాయాధికారి చిన్నచూపు తగదు.. సమాజంలో ఆడపిల్లలపై చిన్నచూపు తగదు. సమాజంలో మహిళలను గౌరవించాలనే విషయాన్ని పిల్లలకు చిన్నప్పటినుంచే నేర్పించాలి. ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. - డాక్టర్ బి.శ్రీదేవి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వ్యవ‘సాయం’లోనూ.. పిట్టలవానిపాలెం, న్యూస్‌లైన్ : సేంద్రియ వ్యవ‘సాయం’లో ఈ మహిళలు భాగస్వాములవుతున్నారు. డీఆర్డీఏ, జిల్లా మహిళా సమాఖ్యలు సంయుక్తంగా అమలు చేస్తున్న సుస్థిర సేంద్రియ వ్యవసాయ విధానంలో భాగంగా ఎలాంటి రసాయనిక, పురుగుమందులు వినియోగించకుండా వ్యవసాయం చే యిస్తూ మండలంలో పలువురి ప్రశంశలు పొందుతున్నారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 14 మంది మహిళలు గ్రామ కోర్డినేటర్లుగా పనిచేస్తూ సుస్థిర సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది మండలంలో గోకరాజునల్లిబోయినవారిపాలెం గ్రామంలో ఎన్‌పీఎం(నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్) పద్ధతుల ద్వారా సాగు చేస్తున్న పంటలను చూసిన రాష్ట్రస్థాయి అధికారుల బృందం మహిళలను అభినందించింది. ఈ సందర్భంగా మహిళలు అభిప్రాయాలు.. మహిళలే ముందంజ.. మండలంలో సుస్థిర సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. సంప్రదాయ వ్యవసాయంలోనూ, నూతన పద్ధతుల సాగులోనూ మహిళలు ముందున్నారనడానికి ఇదే నిదర్శనం. - వరధానం (క్లస్టర్ కోఆర్డినేటర్ ) -
పెప్పర్ ప్రభావం ఏ‘పాటి’
సాక్షి, విజయవాడ : గత ఏడాది ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో మహిళా ఉద్యోగులు తమ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే ఉపయోగించడం మొదలు పెట్టారు. మెట్రో నగరాల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగులకు మాత్రమే పరిమితమయిన పెప్పర్ స్ప్రే గురువారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. లోక్‌సభలో తనపై దాడి చేస్తున్న తెలంగాణా ఎంపీల నుంచి తప్పించుకునేందుకు లగడపాటి పెప్పర్ స్ప్రే వాడారు. దీంతో లోక్‌సభలో కలకలం చెలరేగింది. దాని ఘాటుకు తట్టుకోలేక కొందరు ఆస్పత్రి పాలవ్వగా, ఎంపీలందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. ఏంటీ పెప్పర్‌స్ప్రే... పెప్పర్ స్ప్రే ప్రాణాంతకమైంది కాదు. దీన్ని స్ప్రే చేయగానే వెంటనే కళ్లు మండుతాయి. కొద్ది సేపటి వరకూ కళ్లు తెరవలేము. శ్వాస ఇబ్బంది అవుతుంది. దాని ఘాటుకు తుమ్ములొస్తాయి. ముక్కు నుంచి నీరు కారుతుంది. దగ్గు వస్తుంది. స్ప్రే ఎంత దగ్గర నుంచి ఎంత మోతాదులో వాడతామనే దానిపై ప్రభావం ఆదార పడి ఉంటుంది. దీని పూర్తి ప్రభావం తగ్గడానికి ఆరగంట నుంచి గంట వరకూ సమయం పడుతుంది. ఒకసారి స్ప్రే చేయడం వల్ల కళ్లకు ఎటువంటి హాని ఉండదు. ఆస్తమా ఉన్న రోగులకు మాత్రమే కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది. ఈ పెప్పర్ స్ప్రే చేతిలో ఇమిడిపోయే బాటిల్స్‌లో మార్కెట్ అందుబాటులో ఉంది. మహిళలు ఆకతాయిల నుంచి అత్మరక్షణ కోసం మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. -
మారణాయుధంతో తమిళనాడువాసి బీభత్సం
ఇంట్లోకి చొరబడిన తమిళనాడు వాసి బీభత్సం సృష్టించి నవ దంపతులపై దాడికి పాల్పడ్డాడు. ఆత్మరక్షణ కోసం ఆ దంపతులు ఎదురుదాడికి దిగడంతో నిందితుడు హతమయ్యాడు. ఈ పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పరప్పన అగ్రహార సమీపంలోని హొసరోడ్డులో చెన్నకేశవ నగరకు చెందిన శ్యామ్ అలియాస్ శ్యామ్‌రాజ్, కనకపుర తాలుకా మరళవాడికి చెందిన రుక్మిణిల వివాహం 16 రోజుల క్రితం జరిగింది. మంగళవారం ఉదయం రుక్మిణిని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు బెంగళూరుకు తీసుకు వచ్చి భర్త వద్ద వదలిపెట్టి వెళ్లారు. రుక్మిణికి జ్వరంగా ఉండటంతో ఉదయం 10 గంటల సమయంలో ఆమె భర్త హోటల్లో టిఫిన్ తెచ్చేందుకు వెళ్లాడు. ఆ సమయంలో స్కూటర్ మెకానిక్‌గా పని చేస్తున్న సతీష్ అనే యువకుడు ఇంటిలోకి చొరబడి మంచం కింద దాక్కున్నాడు. చప్పుడు కావడంతో శ్యామ్‌కు అనుమానం వచ్చి మంచం కింద చూడగా సతీష్ ఉన్న విషయం వెలుగు చూసి నిలదీశాడు. రుక్మిణి కుటుంబ సభ్యులు తనకు తెలుసనని, పెళ్లికి వచ్చానని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో సతీష్ కత్తితీసుకొని రుక్మిణి గొంతుపై గాయపరచి శ్యామ్‌పైనా దాడి చేశాడు. శ్యామ్ అప్రమత్తమై అదే కత్తిని లాక్కొని సతీష్ కడుపులో పోడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులుగుర్తించి ముగ్గురినీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సతీష్ మృతి చెందాడు. డీసీపీ టి.డి. పవార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. శ్యామ్, రుక్మిణి దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, హతుడు సతీష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నామని పరప్పన అగ్రహార పోలీసులు తెలిపారు.