breaking news
secunderabad bonalu
-
మహంకాళి బోనాల్లో అపచారం.. ప్రభుత్వంపై భగ్గుమన్న జోగిన శ్యామల
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో జోగినులకు తీవ్ర అవమానం జరిగిందని జోగిన శ్యామల ఆరోపించారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న జోగినుల సంప్రదాయాలకు తగిన గౌరవం కల్పించడంలో దేవాదాయ శాఖ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బోనాల ఉత్సవాల్లో జోగినులకు తగిన గుర్తింపు, మర్యాదలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా నిన్న జోగినిలకు జరిగిన అవమాన ఘటనపై జోగిన శ్యామల తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా శ్యామల.. బోనాల జాతరలో జోగినుల పాత్ర ఎంతో కీలకమైనదని, అయినప్పటికీ ప్రతి ఏడాది తమకు హామీలు ఇస్తున్న అధికారులు వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. జోగినుల సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపై ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను నిర్వర్తించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.కాంగ్రెస్ తీరుపై కన్నీళ్లు పెట్టుకున్న జోగినీలు..,అమ్మవారికి సమర్పించే బోనాలని నేలపై పెట్టేలా చేశారంటూ ఆవేదన…🥺💔నేను మాత్రం ఇన్నేళ్లల్లో జోగినిల ఏడుపులు చూడలేదు..🥺 pic.twitter.com/vNtSmx40cn— ChAnduBRS✊🏻 (@IamPRVChAnduBRS) August 2, 2026దేవాదాయ శాఖ పరిధిలో జోగినులకు ప్రత్యేక స్థానం, అధికారిక హోదా కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆలయ సంప్రదాయాల్లో భాగమైన జోగినుల సేవలకు గుర్తింపు ఇవ్వడంతో పాటు, ఉత్సవాల్లో వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల్లో జరిగిన అపచారాన్ని వెంటనే సరిదిద్దాలని శ్యామల డిమాండ్ చేశారు. జోగినుల గౌరవానికి భంగం కలిగించేలా జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని కోరారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.సికింద్రాబాద్ బోనాల్లో అపశృతిపోలీసులు నెట్టడంతో సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోయిన జోగినులు.. అమ్మవారి బోనాలుప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కన్నీటి పర్యంతమైన జోగినులుబోనం కింద పడేసి మమ్మల్ని ఏడిపించడం ఈ ప్రభుత్వానికి, రాష్ట్రానికే అరిష్టమంటూ శాపనార్థాలు… https://t.co/FRwrbOHsnc pic.twitter.com/AwuRsbUp09— Telugu Scribe (@TeluguScribe) August 2, 2026జరిగిన పరిణామాల నేపథ్యంలో వారం రోజుల్లో తిరిగి అమ్మవారికి బోనం సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు శ్యామల ప్రకటించారు. సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రతి ఏడాది జోగినుల సమస్యలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మాటలు మాత్రమే కాకుండా ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని జోగినుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. జోగినుల సంప్రదాయం తెలంగాణ సంస్కృతి, బోనాల ఉత్సవాల్లో విడదీయరాని భాగమని పేర్కొన్న శ్యామల.. ఆ సంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, దేవాదాయ శాఖపై ఉందన్నారు. జోగినుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి చర్యలు ఉండకూడదని, జరిగిన ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.బోనాల పండక్కి అరేంజ్మెంట్స్ నిజంగా చాలా గలీజ్ గా చేశారంటూ నిశాక్రాంతి…,#CongressFailedGovernment pic.twitter.com/eCeuLZ8PZZ— dinesh reddy (@dinni73799) August 2, 2026 -
రంగం భవిష్యవాణి.. ప్రాణ నష్టం తప్పదంటూ స్వర్ణలత హెచ్చరిక
సాక్షి, సికింద్రాబాద్: మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమంలో భాగంగా భవిష్యవాణిలో స్వర్ణలత కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాలకు ప్రజలు కొట్టుకుపోతారు.. అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ప్రజల తీరుపై అమ్మవారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. నా పాదాల కింద నలిపేస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు.సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం భక్తుల మధ్య ఘనంగా జరిగింది. భవిష్యవాణి వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాతంగి స్వర్ణలత రంగంలోకి వచ్చి అమ్మవారి తరఫున భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. ప్రజల తీరుపై అమ్మవారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఏ ప్రమాదాలు వచ్చినా నేను కాపాడుతున్నా.. కానీ మీరు నా మాట వినడం లేదు. వావివరుసలు లేకుండా ఘోరాలు జరుగుతున్నాయని, అలాంటి వారిని వదిలిపెట్టనని పేర్కొన్నారు. అలాంటి వారిని తన పాదాల కింద నలిపేస్తానని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలకు ప్రజలు కొట్టుకుపోతారు.. అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించారు. ప్రజలు కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారని, వారి ప్రవర్తన తనకు సంతోషం కలిగించడం లేదని అన్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేస్తామని ఇచ్చిన మాటను కొందరు నిలబెట్టుకోలేదని స్వర్ణలత ప్రస్తావించారు. “మీ ప్రశ్నలకు నేనెందుకు సమాధానం చెప్పాలి.. నేను మిమ్మల్ని కాపాడుతున్నా.. మీరు నా మాట వినడం లేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. నన్ను కంట తడి పెట్టిస్తున్నారు. నన్ను గోరంతా కూడా సంతోష పరచలేదు. నా విగ్రహ ప్రతిష్ట చేస్తే కోరింది బంగారం అవుతుంది. ఆరు నెలలలో నా విగ్రహ ప్రతిష్ట చేయకుంటే.. నా పాదాల కింద నలిపేస్తా’ అని అన్నారు. దీంతో, ఏడాదిలో విగ్రహ ప్రతిష్ట చేస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. -
Telangana Bonalu 2024: అమ్మా బైలెల్లినాదో...
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గ్రామదేవతలకు ప్రతియేటా ఆషాఢమాసంలో పూజలు జరిపి, బోనాలు సమర్పించే ఈ సంప్రదాయం ఎనిమిది వందల ఏళ్లుగా వస్తోంది. నగర వాతావరణంలో ఎన్ని హంగులు, ఆర్భాటాలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా, కాలగమనంలో సంప్రదాయక పండుగలెన్నో పేరు తెలీకుండా అదృశ్యమై పోతున్నా,ఈ బోనాల వేడుకలు మాత్రం అలనాటి ఆచార సంప్రదాయాలతో వైభవోపేతంగా నేటికీ కొనసాగుతుండడం విశేషం.మూసీ నది వరదల కారణంగా అంటువ్యాధులకు ఆలవాలమైన నగరంలో నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాని మహారాజా కిషన్‌ప్రసాద్ సలహా మేరకు నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్‌దర్వాజ సమీపంలోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి చార్మినార్ వద్దకు చేరిన వరద నీటిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు సమర్పించాడట. అప్పటికి అమ్మ తల్లి శాంతించి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో నవాబులే బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.ఎందుకు సమర్పిస్తారు?ఆషాఢమాసమంటే వర్షాకాలం.. అంటే అంటువ్యాధులకు ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు, ΄÷ంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లంగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. అచ్చ తెలంగాణ జానపదాలు బోనాలపాటలు ఆడమగ, చిన్న పెద్ద, ధనిక బీద తారతమ్యం లేకుండా ఆనందంతో చిందులేస్తూ చెవులకింపైన అచ్చ తెలంగాణ జానపదాలు‘‘గండిపేట గండెమ్మా దండ బెడత ఉండమ్మా....., బోనాలంటే బోనాలాయే బోనాల మీద బోనాలాయే....., అమ్మా బైలెల్లినాదే....అమ్మా సల్లంగ సూడమ్మ..... మైసమ్మా మైసమ్మా.... వంటి పాటలు, పోతురాజుల నృత్యవిన్యాసాలు, శివసత్తుల చిందులు చూపరులను అలరిస్తాయి. అమ్మవార్లకు సోదరుడు పోతురాజుపోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు. తమ ఇంటి ఆడపడుచును ఆదరించేందుకు, ఆమెకు సమర్పించే ఫలహారపు బండ్లకు కాపలా కాసేందుకు విచ్చేసే పోతురాజులు నృత్యవిన్యాసాలు చేస్తారు. చిన్న అంగవస్త్రాన్ని ధరించి ఒళ్ళంతా పసుపు రాసుకుని కాళ్ళకు మువ్వల గజ్జెలు, బుగ్గన నిమ్మపండ్లు, కంటికి కాటుక, నుదుట కుంకుమ దిద్దుకుని మందంగా పేనిన పసుపుతాడును కొరడాగా ఝళిపిస్తూ, తప్పెట్ల వాయిద్యాలకు అనుగుణంగా గజ్జెల సవ్వడి చేస్తూ లయబద్ధంగా పాదాలు కదుపుతూ కన్నుల పండుగ చేస్తారు.బోనం అంటే... భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయ లతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచుతారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.ఇంటి ఆడబిడ్డ లెక్కఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ్రపాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ ్రపాంతానికి చేరుకుంటుంది. ఆషాడంలోనే కాకుండా కొన్ని ్రపాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు. గోల్కొండ జగదంబికదే తొలిబోనంబోనాల మొదట వేడుకలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, ఇక ఆ తర్వాత అన్నిచోట్లా బోనాల సంరంభం మొదలవుతుంది. సికింద్రాబాద్ పరిసర ్రపాంతాల్లో ఒక్కోరోజు ఆషాఢ ఘటోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఘటాల ఊరేగింపు తర్వాతే బోనాల వేడుకలు ్రపారంభమవుతాయి. గోల్కొండ జగదాంబిక ఆలయంలో మొదలైన ఉత్సవాలు తిరిగి ఆ అమ్మకు సమర్పించే తుదిబోనంతో ముగియడం ఆచారం.– డి.వి.ఆర్. భాస్కర్ -
వైభవంగా మినీ జాతర.. పోటెత్తిన భక్తజనం (ఫోటోలు)
-
ఉజ్జయిని మహంకాళి: స్వర్ణలత భవిష్యవాణి
-
బోనాల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఆ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆది–సోమవారాల్లో వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి పూజ ముగిసే వరకు: ♦ఉజ్జయిని మహంకాళి పూజ ముగిసే వరకు టుబాకో బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్, అధ్వయ్య చౌరస్తాల నుంచి మహంకాళి దేవాలయం వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ అనుమతించరు. బాటా చౌరస్తా నుంచి రామ్‌గోపాల్‌పేట పోలీసుస్టేషన్ మధ్య ఉన్న సుభాష్ రోడ్లో వాహనాలకు మూసేస్తారు. ♦కర్బాలా మైదాన్ నుంచి రాణిగంజ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్‌ను మినిస్టర్స్ రోడ్, రసూల్‌పుర చౌరస్తా, సీటీఓ, ఎస్బీహెచ్ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, సెయింట్ జాన్స్ రోటరీ, గోపాలపురం లైన్, రైల్వేస్టేషన్ మీదుగా పంపిస్తారు. ♦ బైబిల్ హౌస్ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఘాస్మండి చౌరస్తా, సజన్‌లాల్ స్ట్రీట్ మీదుగా పంపిస్తారు. ♦ రైల్వేస్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్ని అల్ఫా హోటల్, గాంధీ ఎక్స్ రోడ్, మహంకాళి ఓల్డ్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, ఘాస్మండి, బౌబిల్ హౌస్, కర్బాలా మైదాన్ మీదుగా పంపిస్తారు. ♦రైల్వేస్టేషన్ నుంచి తాడ్‌బండ్, బేగంపేట వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్ని క్లాక్ టవర్, ప్యాట్నీ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, ఎస్బీహెచ్ చౌరస్తా మీదుగా మళ్ళిస్తారు. ♦ ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి క్లాక్ టవర్, ప్యారడైజ్ వైపు, ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్, క్లాస్టవర్ వైపు పంపిస్తారు. ♦ క్లాక్ టవర్ వైపు నుంచి ఆర్పీ రోడ్లోకి వెళ్ళే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్ చౌరస్తా వైపు పంపిస్తారు. ♦ సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సింధికాలనీ, మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ చౌరస్తా, కర్బాలా మైదాన్ వైపు, ప్యాట్నీ చౌరస్తా నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి సీటీఓ వైపు పంపిస్తారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు: ♦ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, సెయింట్ మేరీస్ రోడ్ మధ్య మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. హకీంపేట్, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్‌పేట్ వైపుల నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే బస్సుల్ని క్లాక్ టవర్ వరకే అనుమతిస్తారు. పార్కింగ్ ప్రాంతాలివి: సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్ ఉప్కార్, ఎస్బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు హరిహర కళాభవన్, మహబూబియా కాలేజ్ కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, ఘాసీమండీ వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇస్లామియా హైస్కూల్ రాణిగంజ్, ఆదయ్య చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రభుత్వ ఆదయ్య మెమోరియల్ హైస్కూల్ సుభాష్ రోడ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు పాత జైల్‌ఖానాలోని ప్రాంతం మంజు «థియేటర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు అంజలి థియేటర్ మద్యం విక్రయాలపై ఆంక్షలు... సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి బోనాల నేపథ్యంలో ఉత్తర, మధ్య మండలాల్లోని కొన్ని ఠాణాల పరిధిలో మద్యం విక్రయాలు నిషేధిస్తూ కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు గోపాలపురం, చిక్కడపల్లి, లాలగూడ, తుకారాంగేట్, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, తిరుమలగిరి, రామ్‌గోపాల్‌పేట, గాంధీనగర్ ఠాణాల పరిధిలో ఇవి వర్తిస్తాయి. స్టార్ హోటల్స్‌లో ఉండే బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపునిచ్చారు. -
బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఆ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆది–సోమవారాల్లో వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. వేర్వేరు మార్గాల్లో వచ్చే వారి వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి ♦ ఉజ్జయిని మహంకాళి పూజ ముగిసే వరకు టుబాకో బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్, ఆదయ్య చౌరస్తాల నుంచి మహంకాళి ఆలయం వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ అనుమతించరు. బాటా చౌరస్తా నుంచి రామ్‌గోపాల్‌పేట పోలీసుస్టేషన్ మధ్య ఉన్న సుభాస్ రోడ్‌ను వాహనాలకు మూసేస్తారు. ∙కర్బాలా మైదాన్ నుంచి రాణిగంజ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్‌ను మినిస్టర్స్ రోడ్, రసూల్‌పుర చౌరస్తా, సీటీఓ, ఎస్బీహెచ్ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, సె యింట్ జాన్స్ రోటరీ, గోపాలపురం లైన్, రైల్వేస్టేషన్ మీదుగా పంపిస్తారు. ♦ బైబిల్ హౌస్ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఘాస్మండి చౌరస్తా, సజన్‌లాల్ స్ట్రీట్ మీదుగా పంపిస్తారు. ♦ రైల్వేస్టేషన్నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు ల్ని అల్ఫా హోటల్, గాంధీ ఎక్స్ రోడ్, మహంకాళి ఓల్డ్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, ఘాస్మండి, బౌబిల్ హౌస్, కర్బాలా మైదాన్ మీదుగా పంపిస్తారు. ♦ రైల్వేస్టేషన్ నుంచి తాడ్‌బండ్, బేగంపేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని క్లాక్ టవర్, ప్యాట్నీ చౌరస్తా, వైఎం సీఏ చౌరస్తా,ఎస్బీహెచ్ చౌరస్తా మీదుగా పంపిస్తారు. ♦ ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి క్లాక్ టవర్, ప్యారడైజ్ వైపు, ♦ ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్, క్లాస్టవర్ వైపు పంపిస్తారు. ♦ క్లాక్ టవర్ వైపు నుంచి ఆర్పీ రోడ్లోకి వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్ చౌరస్తా వైపు మళ్లిస్తారు. ♦ సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సింధికాలనీ, మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ చౌరస్తా, కర్బాలా మైదాన్ వైపు, ప్యాట్నీ చౌరస్తా నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి సీటీఓ వైపు పంపిస్తారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు: ♦ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, సెయింట్ మేరీస్ రోడ్ మధ్య మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. హకీంపేట్, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్‌పేట వైపుల నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే బస్సుల్ని క్లాక్ టవర్ వరకే అనుమతిస్తారు. పార్కింగ్ ప్రాంతాలివి: ♦ సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్ ఉప్కార్, ఎస్బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు హరిహర కళాభవన్, మహబూబియా కాలేజ్ ♦ కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, ఘాసీమండీ వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇస్లామియా హైస్కూల్ ♦ రాణిగంజ్, ఆదయ్య చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రభుత్వ ఆదయ్య మెమోరియల్ హైస్కూల్ ♦ సుభాష్ రోడ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు పాత జైల్‌ఖానాలోని ప్రాంతం ♦ మంజు «థియేటర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు అంజలి థియేటర్. -
బోనాలకు 3వేలమంది పోలీసులతో భద్రత
హైదరాబాద్ : నగరంలో బోనాల సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బోనాలు సందర్భంగా 3వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. బోనాలకు షీ టీమ్స్‌తో పాటు, యాంటీ చైన్ స్నాచింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే వంద అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు, దేవాలయానికి ఒక ఎస్ఐ చొప్పున ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. కాగా ఈ నెల 24,25న సికింద్రాబాద్, 31, ఆగస్టు 1న లాల్ దర్వాజా బోనాలు జరగనున్న విషయం తెలిసిందే.


