breaking news
Sectarian violence
-
మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్ర
కోల్కతా: ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతోందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ ఆరోపించారు. 24 పరగణ జిల్లాలో శనివారం ఆమె పలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ముస్లిం ఓట్లను చీల్చే బీజేపీ కుట్రలో పావులుగా మారొద్దని రాష్ట్రంలోని ముస్లింలకు మమత పిలుపునిచ్చారు. ‘బీజేపీ మద్దతుతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక పార్టీ, బెంగాల్లో ఆ పార్టీ మిత్రపక్షమైన మరో పార్టీ ముస్లిం ఓట్లను చీల్చాలని ప్రయత్నిస్తున్నాయి. వాటి కుయుక్తులను తిప్పికొట్టండి’ అని ఆమె పిలుపునిచ్చారు. అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం, అబ్బాస్ సిద్ధిఖీల ఐఎస్ఎఫ్లను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో మమత చేసిన ఇదే తరహా వ్యాఖ్యలను ఎంఐఎం, ఐఎస్ఎఫ్ ఇప్పటికే తోసిపుచ్చాయి. ఐఎస్ఎఫ్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తోంది. మతం పేరుతో బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని హిందువులను కూడా మమత కోరారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి, రాష్ట్రంలో ప్రశాంతతను దెబ్బతీయాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. మీ ప్రాంతాల్లో బయటివారు కనిపిస్తే వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తాను హిందుత్వాన్ని విశ్వసించే వ్యక్తినని మమత మరోసారి గుర్తు చేశారు. దళితుల ఇళ్లల్లో ఆ భోజనం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటు న్నారని, అయితే ఆ భోజనాన్ని ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి తెప్పించుకుంటు న్నారని బీజేపీ నేతలపై ఆమె మండిపడ్డారు. తాను బ్రాహ్మణ మహిళను అని, అయితే, తనకు అన్ని సమయాల్లో సహాయకారిగా ఉండి, వంట చేసి పెట్టేది ఒక ఎస్సీ మహిళ అని వివరించారు. వీడియోపై వివాదం మమత వీల్ చెయిర్లో కూర్చుని గాయమైన తన కాలును పైకి, కిందకు కదిలిస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సానుభూతి ద్వారా ఓట్లు పొందాలని మమత ఈ డ్రామాలు చేస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పించింది. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని టీఎంసీ బదులిచ్చింది. -
మతహింసతో చీల్చే యత్నం: సోనియా
-
మతహింసతో చీల్చే యత్నం: సోనియా
న్యూఢిల్లీ: దేశంలో మతహింస పెరగడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం తీవ్రంగా విమర్శించారు. మతం పేరుతో ప్రజలను చీల్చేందుకే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం అల్లర్లను ప్రేరేపిస్తోందని విరుచుకుపడ్డారు. తిరువనంతపురంలో కేరళ పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ఆమె మాట్లాడారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో ఇటీవలే దాదాపు 600చొప్పున మతహింస సంఘటనలు జరిగాయని యూపీఏ పదేళ్ల హయాంలో అల్లర్లు చాలా అరుదని అన్నారు. మరో సభలో మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళలకు 33శాతం కోటా కల్పించే బిల్లు ఆమోదం కోసం ప్రతిపక్షంగా కర్తవ్యం నెరవేరుస్తామన్నారు. ఆత్మపరిశీలన చేసుకోండి: వెంకయ్య మోడీ సర్కార్ వచ్చినప్పటినుంచి మత హింస పెరిగిందన్న సోనియాగాంధీ ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవరాహాల మంత్రి వెంకయ్య నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆధార రహితమైన ఇలాంటి ఆరోపణలు చేసేముందు కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఢిల్లీలో వ్యాఖ్యానించారు.