breaking news
Secret Superstar
-
ఈ ఏడాది బెస్ట్ సినిమా ఇదే..!
సాక్షి, ముంబై: సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన తాజా సినిమా 'సీక్రెట్ సూపర్ స్టార్'ను సోమవారం తన సన్నిహితులు, మిత్రులు, బాలీవుడ్ సెలబ్రిటీలకు చూపించారు. ముంబైలో జరిగిన ఈ స్పెషల్ షోకు హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సినిమాను చూసి.. అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఏకంగా ఈ ఏడాది వచ్చిన బెస్ట్ సినిమా ఇదేనంటూ ఆకాశానికెత్తారు. ఆమిర్ 'దంగల్' సినిమాలో నటించిన జైరా వసీం ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలకానుంది. గాయనిగా ఎదగాలనుకుంటున్న ఓ ముస్లిం బాలిక కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎదుర్కొన్న అడ్డంకులు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చౌహాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడిగా నటిస్తున్న ఆమిర్ స్వయంగా ఆమిర్ ఖాణ్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను చూసిన బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'సీక్రెట్ సూపర్ స్టార్ ఈ ఏడాది ఉత్తమ చిత్రం. సినిమా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. నటులంతా మంచి అభినయం కనబర్చారు. ఆమిర్ ఖాన్‌కు, అద్వైత్కు అభినందనలు' అని నవాజుద్దీన్ సిద్ధిఖీ ట్వీట్ చేశారు. యువ హీరో రాజ్‌కుమార్ రావు, 'దంగల్' ఫేమ్ సనా ఫాతియా షైక్, దర్శకురాలు అశ్వినీ అయ్యార్ తదితరులు సినిమాను ప్రశంసిస్తూ.. ట్వీట్లు చేశారు. #SecretSuperstar D Best Film of d year.V Inspiring.Commendable Performances by all d Actors including Tirth. Congrats @aamir_khan #AdvaitC. — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) 17 October 2017 #SecretSuperstar Such a heartwarming&inspiring film. Do urselves a favour, go watch it. Take a bow team. @aamir_khan sir, u had me in splits — Rajkummar Rao (@RajkummarRao) 16 October 2017 #secretsuperstar is a story which does not leave U.Truly from the heart!Huge hug #zaira @aamir_khan #advait #kiranrao just speechless.Proud😊 — Ashwiny Iyer Tiwari (@Ashwinyiyer) 16 October 2017 #advaitchandan has created such a beautiful film! All the actors were just outstanding! #secretsuperstar #ZairaWasim 😘❤️ — fatima sana shaikh (@fattysanashaikh) 16 October 2017 #SecretSuperstar! Supperb Film👍. Great performances 👏👏. #ZairaWasim👌👌. @aamir_khan is just the perfect icing on this cake! @advaitchandan🙏🙏 — Avinash Gowariker (@avigowariker) 16 October 2017 -
ఆ చిత్రానికి అద్వానీ ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ : మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్‌కు ఊహించని ప్రశంస దక్కింది. ఆయన కొత్త చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ అద్భుతమని రాజకీయ దిగ్గజం ఎల్కే అద్వానీ కితాబిచ్చారు. ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమౌతున్న నేపథ్యంలో పలు నగరాల్లో ప్రముఖుల కోసం అమీర్ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనకు అద్వానీ, ఆయన కూతురు, పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. చిత్రం పూర్తయిన థియేటర్ చప్పట్లతో మారుమోగిపోగా.. తర్వాత చాలా సేపు అద్వానీ అమీర్‌తో చర్చించటం మీడియా కంటపడింది. దీనిపై అమీర్ స్పందిస్తూ... సినిమా అద్భుతంగా తెరకెక్కించారని అద్వానీ ప్రశంసించినట్లు చెప్పారు. కాగా, దంగల్ ఫేమ్ జైరా వసీమ్ ప్రధాన పాత్రలో అద్వైత్ చావ్లా దర్శకత్వంలో సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి నిర్మాతగానే కాదు.. ఓ కీలకపాత్రలో అమీర్ నటిస్తుండటం విశేషం. ఓ ముస్లిం అమ్మాయి తన ఉనికి బయటపడకుండా.. తనలోని టాలెంట్‌ను ప్రదర్శించటమే ఈ చిత్ర నేపథ్యంగా తెలుస్తోంది. అక్టోబర్ 19న సీక్రెట్ సూపర్ స్టార్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
బాహుబలి 2 ఇంకా చూడలేదు: సూపర్ స్టార్
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేసిన బాహుబలి సినిమాపై టాలీవుడ్ బాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురించినా.. బాలీవుడ్ ఖాన్ లు మాత్రం పెద్దగా స్పందించిన సందర్భాలు లేవు. సల్మాన్, షారూఖ్ లాంటి స్టార్ గతంలో బాహుబలి రిజల్ట్ పై స్పందించారు. ఏదో మొక్కుబడి బాహుబలి ఇంకా చూడలేదు.. కానీ మంచి టాక్ సొంతం చేసుకోవటం ఆనందంగా ఉందంటూ కామెంట్ చేశారు. తాజాగా మరో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఇలాగే స్పందించాడు. ప్రస్తుతం తానే స్వయంగా నటిస్తూ నిర్మించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆమిర్, బాహుబలి సినిమా ఇంకా చూడలేదని తెలిపాడు. సినిమా రిలీజ్ అయి 100 రోజులు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమిర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బాహుబలి 2 హిందీ వర్షన్ 500 కోట్లకు పైగా వసూళు చేసింది కథ, ఆ సినిమా కలెక్షన్లు చూస్తూ మీకు భయం వేయటం లేదా అన్న ప్రశ్నకు 'బాహుబలి 2 రిజల్ట్ తో మన హిందీ సినిమా స్థాయి ఏంటనేది మనకు తెలిసింది. ఇంకా మంచి సినిమాలు తీయాలి. అలాగే బాహుబలి 2 అంతటి ఘనవిజయం సాధించటం ఆనందంగా ఉంది. కాని నేను ఇంకా సినిమాను చూడలేదు. త్వరలోనే చూస్తాను' అంటూ కామెంట్ చేశాడు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
సీక్రెట్ సూపర్‌స్టార్: టీజర్ నిడివి : 1 ని. 26 సె. ; హిట్స్ : 85,48,767 ‘‘ఇన్సూ... రాత్రి మూడవుతోంది. కలలు కనడం మాని, నిద్రపో.’’ ‘‘అదేంటి మమ్మీ. నిద్రపొమ్మని చెప్తావ్. కలలు కనొద్దని చెప్తావ్. పడుకున్నప్పుడు కలలు రావా ఏంటీ? కలలు కనడం కనీస హక్కు కదా. ప్రతి ఒక్కరినీ కలలు కననివ్వాలి’’. ‘‘చెప్పు. నీకేం కావాలి? నీ కలేంటి?’’ ‘‘ఈ ప్రపంచం మొత్తం నా పాట వినాలి’’. ‘‘అది నా కల మాత్రం కాదనా? కానీ నాన్నకు ఇష్టం లేదు’’ నాన్న ఇన్సూ గిటార్ తీగలు తెంపేస్తాడు. తీగలు తెగిన గిటార్‌ను ఇన్సూ చేతిలో పెడతాడు. స్కూల్ నుంచి వచ్చిన ఇన్సూ బాధగా ఆ గిటార్‌ను అందుకుంటుంది. కొంతకాలం గడుస్తుంది. సడెన్‌గా సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ అవుతుంది. అందులో.. ముఖం కనిపించకుండా ముసుగు వేసుకున్న ఓ అమ్మాయి చేతిలో గిటార్ పట్టుకుని మాట్లాడ్డం మొదలుపెడుతుంది. ‘వీడియో చూస్తున్నవారందరికీ ధన్యవాదాలు. ఇది నా మొదటి యూట్యూబ్ వీడియో. నా పేరు.. అని ఆగుతుంది. ‘ఊహు’ నా పేరు చెప్పుకోను అంటుంది. పాట పాడుతుంది. ‘నేను అభయారణ్యంలో ప్రాణిలా స్వేచ్ఛగా ఆలపిస్తాను. మనసంతా సంతోషంగా..’ అంటూ పాడుతుంది. ఆమె పాటను ఎక్కడో ఉన్న ఆమిర్‌ఖాన్ కూడా వింటాడు. సూపర్‌హిట్.. సూపర్ హిట్ అంటాడు. నచ్చితే లైక్ కొట్టండి అంటాడు. నచ్చకపోతే మీ టేస్ట్ చేంజ్ చేసుకోండి అంటాడు. ఐ లవిట్ అంటాడు. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ మూవీ టీజర్ ఇది. సినిమా ఆగస్టు 4న విడుదలవుతోంది. దంగల్ ఫేమ్ జైరా వసీమ్ ఇందులో ఇన్సూగా నటించింది. ఆమె కలలను అర్థం చేసుకున్న క్యారెక్టర్ ఆమిర్ఖాన్ది. వీడియో ఇన్స్పైరింగ్గా ఉంది. లిటిల్ మిక్స్: టచ్ (అఫీషియల్ వీడియో) నిడివి : 3 ని. 37 సె. ; హిట్స్ : 84,58,749 బ్రిటిష్ గర్ల్ గ్రూప్ ‘లిటిల్ మిక్స్’ పెర్ఫామ్ చేసిన ఈ ‘టచ్’ వీడియో సాంగ్.. పాప్ అభిమానుల కళ్లను తమ వెంట పరుగులు తీయించుకుంటోంది! సాఫ్ట్ సాంగ్.. విత్ స్ట్రాంగ్ ఎమోషన్స్. జేడ్, పియరీ, యాన్, జెస్సీ అనే ఈ నలుగురు అమ్మాయిలు తమ స్టూడియో ఆల్బమ్ ‘గ్లోరీ డేస్’ నుంచి ఈ సెకండ్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. యు.కె., ఐర్లండ్, స్కాట్లాండ్ల పాప్ చార్ట్‌లలో ప్రస్తుతం ఈ పాట టాప్ 10లో ఉంది. ప్రేమ కోసం పరితపించే స్త్రీ హృదయం.. ‘జస్ట్ ఎ టచ్ ఆఫ్ యువర్ లవ్ ఈజ్ ఎనఫ్’ అంటూ రిపీటెడ్‌గా పాడుతూ ఉండడం ఇందులోని భావ సౌందర్యం. ‘నువ్వూ నేను.. నో బడీ ఎల్స్’ అంటూ మొదలై.. ‘టు టేక్ కంట్రోల్ ఆఫ్ మై హోల్ బాడీ... జస్ట్ ఎ టచ్ ఆఫ్ లవ్ ఈజ్ ఎనఫ్..’ అని పాట ఎండ్ అవుతుంది. సావరే: ప్రైవేట్ మెలడీ నిడివి : 5 ని. 48 సె. ; హిట్స్ : 13,71,949 టైమ్స్ మ్యూజిక్ రొమాంటిక్ సింగిల్ ‘సావరే’. బాలీవుడ్ నటుడు కుణాల్ ఖేము, మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2015 విర్టికా సింగ్ నటించారు. లక్నోలోని అత్యద్భుతమైన లొకేషన్లలో ఈ మెలోడీ సాంగ్‌ని షూట్ చేశారు. అనుపమ రాగ్, రహత్ ఫతే అలీఖాన్ పాడారు. అలీఖాన్ గొంతులోని మార్ధ్రవం.. మైండ్‌కి రిఫ్రెష్ కొట్టేలా ఉంది. లిరిక్స్, కంపోజిషన్ అనుపమ రాగ్. ‘నా హృదయంతో, నా ఆత్మతో నిన్ను ప్రేమించాను.. నా ప్రియతమా.. మనసులు ఎదురెదురుగా ఉన్నప్పటికీ మన మధ్య దూరాలు ఉన్నాయి. నిన్నెక్కడ వెతుక్కోను.. నా కళ్లు నీ సాక్షాత్కారం కోసం అన్వేషిస్తున్నాయి’ అనే అర్థంలో సాగే ఈ పాట ఒక సిపాయికి, అతడి ప్రియురాలికి మధ్య ఉన్న ప్రేమగురించి తెలుపుతుంది. ‘సావరే’ అంటే.. త్వరగా అని అర్థం. దూరతీరాలలో ఉన్న రెండు హృదయాలు త్వరగా కలుసుకోవడం కోసం çపడే పరితపనకు అందమైన దృశ్యరూపం ఈ వీడియో సాంగ్. -
లుక్.. కిక్..!
సినిమాల్లో నటించడమే కాదు, వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో.. ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకువెళ్లాలో ఆమిర్‌ఖాన్‌కి బాగా తెలుసు. తన లుక్‌తోనే సినిమాకి కిక్ తీసుకురాగల నేర్పరి. ప్రస్తుతం ఆమిర్ నటిస్తున్న సినిమా ‘దంగల్’. మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫోగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆమిర్ యువకుడిగా, ఇద్దరమ్మాయిల తండ్రిగా రెండు పార్శ్వాలున్న పాత్రలో నటిస్తున్నారు. ఆ రెండు లుక్స్ ఎప్పుడో విడుదలయ్యాయి. తాజాగా ప్రమోషనల్ సాంగ్ కోసం ఫొటోలో మీరు చూస్తున్న కొత్త లుక్‌లోకి వచ్చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమా కోసం ఇటీవల ఆమిర్‌ఖాన్ కొత్త లుక్‌లో కనిపించారు. ఈ లుక్ కూడా ఆ సినిమా కోసమే అనుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. ‘దంగల్’లో ఆన్ స్క్రీన్ కూతుళ్లుగా నటిస్తున్న ఫాతిమా సనా షైక్, సన్యా మల్హోత్రాలతో కలసి ఆమిర్ షూట్ చేస్తున్న ప్రమోషనల్ సాంగ్‌లో లుక్ ఇది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. -
డిఫరెంట్ లుక్‌లో ఆమిర్ ఖాన్
ప్రస్తుతం బయోపిక్‌గా తెరకెక్కుతున్న దంగల్ సినిమాలో నటిస్తున్న ఆమిర్ ఖాన్, ఆ సినిమా తరువాత చేయబోయే సినిమాకు సంబందించిన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన దగ్గర మేనేజర్‌గా పనిచేసిన అద్వైత్ చందన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో అతిథి పాత్రలో నటించనున్నాడు ఆమిర్ ఖాన్. ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్ ను ట్రై చేస్తున్నాడు. పొడవైన మీసకట్టు, వింత గడ్డం, విచిత్రమైన జ్యూవెలరీతో అమీర్ లుక్ ఫన్నీగా ఉంది. పేరుకు అతిథి పాత్రే అయిన ఈ సినిమాలో ఆమిర్ చాలా సేపు తెర మీద కనిపించనున్నాడు. ప్రస్తుతం దంగల్ సినిమా లోని యంగ్ లుక్ కోసం సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్న అమీర్ అదే లుక్‌లో సీక్రెట్ సూపర్ స్టార్ షూటింగ్లో పాల్గొననున్నాడు.