ఈ ఏడాది బెస్ట్‌ సినిమా ఇదే..! | Secret Superstar is 2017 best film, says Bollywood celebs | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది బెస్ట్‌ సినిమా ఇదే..!

Oct 17 2017 6:45 PM | Updated on Oct 17 2017 11:05 PM

Secret Superstar is 2017 best film, says Bollywood celebs

సాక్షి, ముంబై: సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ తన తాజా సినిమా 'సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌'ను సోమవారం తన సన్నిహితులు, మిత్రులు, బాలీవుడ్‌ సెలబ్రిటీలకు చూపించారు. ముంబైలో జరిగిన ఈ స్పెషల్‌ షోకు హాజరైన బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ సినిమాను చూసి.. అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ ఏకంగా ఈ ఏడాది వచ్చిన బెస్ట్‌ సినిమా ఇదేనంటూ ఆకాశానికెత్తారు.

ఆమిర్‌ 'దంగల్‌' సినిమాలో నటించిన జైరా వసీం ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలకానుంది. గాయనిగా ఎదగాలనుకుంటున్న ఓ ముస్లిం బాలిక కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎదుర్కొన్న అడ్డంకులు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చౌహాన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడిగా నటిస్తున్న ఆమిర్‌ స్వయంగా ఆమిర్‌ ఖాణ్‌ ప్రోడక్షన్స్‌ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమాను చూసిన బాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ ఈ ఏడాది ఉత్తమ చిత్రం. సినిమా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. నటులంతా మంచి అభినయం కనబర్చారు. ఆమిర్‌ ఖాన్‌కు, అద్వైత్‌కు అభినందనలు' అని నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ట్వీట్‌ చేశారు. యువ హీరో రాజ్‌కుమార్‌ రావు, 'దంగల్‌' ఫేమ్‌ సనా ఫాతియా షైక్‌, దర్శకురాలు అశ్వినీ అయ్యార్‌ తదితరులు సినిమాను ప్రశంసిస్తూ.. ట్వీట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement