డిఫరెంట్ లుక్లో ఆమిర్ ఖాన్ | Aamir Khan different look from Secret Superstar | Sakshi
Sakshi News home page

డిఫరెంట్ లుక్లో ఆమిర్ ఖాన్

Sep 9 2016 3:34 PM | Updated on Sep 4 2017 12:49 PM

డిఫరెంట్ లుక్లో ఆమిర్ ఖాన్

డిఫరెంట్ లుక్లో ఆమిర్ ఖాన్

ప్రస్తుతం బయోపిక్గా తెరకెక్కుతున్న దంగల్ సినిమాలో నటిస్తున్న ఆమిర్ ఖాన్, ఆ సినిమా తరువాత చేయబోయే సినిమాకు సంబందించిన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా...

ప్రస్తుతం బయోపిక్గా తెరకెక్కుతున్న దంగల్ సినిమాలో నటిస్తున్న ఆమిర్ ఖాన్, ఆ సినిమా తరువాత చేయబోయే సినిమాకు సంబందించిన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన దగ్గర మేనేజర్గా పనిచేసిన అద్వైత్ చందన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో అతిథి పాత్రలో నటించనున్నాడు ఆమిర్ ఖాన్.

ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్ ను ట్రై చేస్తున్నాడు. పొడవైన మీసకట్టు, వింత గడ్డం, విచిత్రమైన జ్యూవెలరీతో అమీర్ లుక్ ఫన్నీగా ఉంది. పేరుకు అతిథి పాత్రే అయిన ఈ సినిమాలో ఆమిర్ చాలా సేపు తెర మీద కనిపించనున్నాడు. ప్రస్తుతం దంగల్ సినిమా లోని యంగ్ లుక్ కోసం సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్న అమీర్ అదే లుక్లో సీక్రెట్ సూపర్ స్టార్ షూటింగ్లో పాల్గొననున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement