breaking news
Second Half
-
ఇక పీవీసీ పైపుల లాభాల ఫ్లో!
సుమారు ఐదు త్రైమాసికాలుగా అంతంతమాత్ర పనితీరు చూపుతూ వచ్చిన ప్లాస్టిక్ పైపుల తయారీ కంపెనీలు ఇకపై బలాన్ని పుంజుకోనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) ద్వితీయార్ధం నుంచి రికవరీ బాటలో సాగనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి ప్లాస్టిక్ పైపులు, తదితర ప్రొడక్టుల తయారీ దిగ్గజాలకు ప్రోత్సాహం లభించనున్నట్లు భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం..కొద్ది నెలలుగా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటిస్తున్న ప్లాస్టిక్ పైపుల తయారీ కంపెనీలు ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లోనూ ఓమాదిరి పనితీరునే ప్రదర్శించాయి. అయితే పలు సానుకూల అంశాల ప్రభావంతో ద్వితీయార్ధం(2025 అక్టోబర్–మార్చి 2026)లో మెరుగైన ఫలితాలను సాధించనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రొడక్టులకు డిమాండ్ పుంజుకోవడం, పాలీవినైల్ క్లోరైడ్(పీవీసీ) ధరలు నిలకడను చూపడం ఇందుకు సహకరించనున్నట్లు తెలియజేశారు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం పటిష్ట డిమాండ్‌కు తోడు ముడివయ్యాలు తగ్గడం కంపెనీలకు కలసిరానుంది. ప్రధానంగా ప్రతిపాదిత యాంటీడంపింగ్ డ్యూటీలు దేశీ పరిశ్రమలకు జోష్నివ్వనున్నాయి. ఈ సానుకూలతల కారణంగా ఇటీవల పీవీసీ కంపెనీల షేర్లు పరుగెడుతున్నాయి. ప్రభుత్వ మద్దతు ఇటీవలే వాణిజ్య పరిష్కార సంబంధ చర్యలు తీసుకునే ట్రేడ్ రెమిడీస్ డైరెక్టరేట్ జనరల్(డీజీటీఆర్).. పీవీసీ రెజిన్ దిగుమతులపై తుది పరిశీలనను పూర్తి చేసింది. తద్వారా యాంటీడంపింగ్ డ్యూటీల విధింపునకు దారి చూపనుంది. ప్రధానంగా చైనా, ఇండోనేసియా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, యూఎస్‌ల నుంచి పీవీసీ రెజిన్ దిగుమతి అవుతోంది. దీంతో దిగుమతులు, దేశీ ఉత్పత్తి మధ్య ధరల్లో వ్యత్యాసం తగ్గనుంది. కాగా.. భారత్ పీవీసీ దిగుమతులపై అధికంగా ఆధారపడుతోంది. దేశీ డిమాండ్ వార్షికంగా 4.7 మిలియన్ టన్నులు(ఎంటీపీఏ)కాగా.. స్థానిక తయారీ సామర్థ్యం 1.8 ఎంటీపీఏ మాత్రమే. దీంతో పీవీసీ రెజిన్ కోసం విదేశాలవైపు చూపు సారిస్తోంది. ఫలితంగా పరిశ్రమపై అంతర్జాతీయ ధరల ప్రభావం పడుతోంది. అయితే 2027 కేలండర్ ఏడాదిలో దేశీయంగా 2.5 ఎంటీపీఏ సామర్థ్యం అందుబాటులోకి వచ్చే వీలుంది. వెరసి పీవీసీ దిగ్గజాలు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే అవకాశముంది. సానుకూలతలు దేశీయంగా పీవీసీ రెజిన్ సరఫరాలు పుంజుకుంటే పైపుల తయారీ కంపెనీలకు లబ్ది చేకూరనుంది. ముడిసరుకుల స్థానిక లభ్యతపై విశ్వాసం, ధరల హెచ్చుతగ్గులకు చెక్ పెట్టడం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తగ్గడం, నిర్వహణ లాభ మార్జిన్లకు రక్షణ తదితర ప్రయోజనాలకు వీలుచిక్కుతుందని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ నిపుణులు అభిప్రాయపడ్డారు. యాంటీడంపింగ్ చర్యలతో స్థానిక తయారీకి మద్దతు, పీవీసీ రెజిన్ ధరల నిలకడ ద్వారా ఈ రంగంలోని పరిశ్రమల లాభదాయకత మెరుగుపడనున్నట్లు ప్రభుదాస్ లీలాధర్ నిపుణులు తెలియజేశారు. ప్రధానంగా లిస్టెడ్ కంపెనీలు ఆస్ట్రల్, సుప్రీం, ఫినొలెక్స్ లబ్ది పొందనున్నట్లు పేర్కొన్నారు. ఉదాహరణకు పీవీసీ రెజిన్ ధరలు ఐదు నెలల తదుపరి మే నెలలో తొలిసారి బలపడ్డాయి. కేజీ ధర రూ. 1.5 పుంజుకోగా.. ఆగస్ట్‌కల్లా మరో రూ. 4.6 పెరిగాయి. పనితీరు డీలా ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో పీవీసీ రంగ కంపెనీల ఫలితాలు డీలా పడ్డాయి. ఉమ్మడి ఆదాయం వార్షికంగా 3 శాతం నీరసించగా.. ప్రొడక్టులకు ధరలు(రియలైజేషన్లు) 8% క్షీణించాయి. అయితే అమ్మకాలు 3 శాతం వృద్ధి చూపాయి. అయినప్పటికీ నిర్వహణ లాభం(ఇబిటా) వార్షికంగా 27 శాతం వెనకడుగు వేసింది. ఈ కాలంలో కేజీకి ఇబిటా 41 శాతం పడిపోయింది. నిల్వలపై భారీ నష్టాలు ఇందుకు కారణమయ్యాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ద్వితీయార్ధంలో ఎకానమీ జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయార్ధంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నట్టు ఆర్బీఐ బులెటిన్ (ఫిబ్రవరి నెల) వెల్లడించింది. వాహన విక్రయాలు, విమాన ప్రయాణికుల రద్దీ, స్టీల్ వినియోగం, జీఎస్టీ ఈ–వే బిల్లులు తదితర కీలక గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది. డాలర్ బలోపేతం కావడంతో వర్దమాన ఆర్థిక వ్యవస్థల నుంచి పెట్టుబడులు వెనక్కి పోవడం కరెన్సీ రిస్క్ లను పెంచుతున్నట్టు తెలిపింది. ‘‘ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగనున్నాయి. బలమైన గ్రామీణ వినియోగానికి, వ్యవసాయ రంగం పటిష్ట పనితీరు మద్దతునివ్వనుంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, బడ్జెట్లో పన్ను రాయితీలు పెంపుతో పట్టణ వినియోగం సైతం కోలుకోనుంది’’అని బులెటిన్ వివరించింది. 27 రకాల కీలక సూచికల ఆధారంగా ఆర్థిక కార్యకలాపాల తీరును అంచనా వేస్తుండడం గమనార్హం. ద్రవ్యోల్బణం తగ్గుదల నిదానంగా ఉండడం, టారిఫ్‌ల రిస్క్ పట్ల ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆందోళన నెలకొందని చెబుతూ.. వర్ధమాన మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు తోడు డాలర్‌తో కరెన్సీలు బలహీనపడడాన్ని ఈ బులెటిన్ ప్రస్తావించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిలోనే ఉన్నప్పటికీ, అది మోస్తరుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘వృద్ధిని, ద్రవ్య స్థీకరణను యూనియన్ బడ్జెట్ చక్కగా సమతుల్యం చేసింది. మూలధన వ్యయాలలు, వినియోగానికి మద్దతుతోపాటు డెట్ స్థిరీకరణకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. దీనికి అదనంగా రెపో రేటు తగ్గింపుతో దేశీ డిమాండ్ పుంజుకోనుంది’’అని ఆర్బీఐ బులెటిన్ వెల్లడించింది. 2025లో జీడీపీ 6.4 % మూడిస్ ఎనలిటిక్స్ అంచనా న్యూఢిల్లీ: భారత జీడీపీ 2025లో 6.4 శాతం మేర వృద్ధిని సాధించొచ్చని అంతర్జాతీయ సంస్థ మూడిస్ ఎనలిటిక్స్ తెలిపింది. యూఎస్ టారిఫ్‌లు, అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనపడడం ఎగుమతులపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. 2024లో జీడీపీ 6.6%గా ఉందని గుర్తు చేసింది. 2025లో ఆసియా పసిఫిక్ వ్యాప్తంగా వృద్ధి నిదానిస్తుందని మూడిస్ ఎనలిటిక్స్ తెలిపింది. వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన మార్పులు ఈ ప్రాంతం వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. చైనా జీడీపీ 2024లో 5%గా ఉంటే.. 2025లో 4.2%కి, 2026లో 3.9 శాతానికి తగ్గుముఖం పడుతుందని వివరించింది. భారత వృద్ధి 2024లో ఉన్న 6.6% నుంచి వచ్చే రెండేళ్లు 6.4 శాతానికి తగ్గొచ్చని అంచనా . -
ఆరంభం అదిరింది కానీ..!
2016 సంవత్సరానికి సూపర్ సక్సెస్‌లతో గ్రాండ్‌గా వెల్ కం చెప్పింది టాలీవుడ్. ఏడాది తొలి రోజునే నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సినీ అభిమానులకు మంచి సంకేతాలను ఇచ్చింది. ఈ జోరు కంటిన్యూ చేస్తూ సంక్రాంతి బరిలో దిగిన నాలుగు చిత్రాలు విజయాలు సాధించటంతో ఇక 2016 టాలీవుడ్ గోల్డెన్ ఇయర్ అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే అదే జోరు ను కొనసాగించటంతో టాలీవుడ్ పెద్దలు తడబడ్డారు. సంక్రాంతి రిలీజ్‌ల తరువాత సూపర్ హిట్ అనిపించుకునే స్థాయి సినిమా ఒక్కటి కూడా రాలేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ, క్షణం లాంటి చిన్న సినిమాలు మ్యాజిక్ చేసినా.. కోట్లల్లో కాసులు కురిపించే సినిమాలు మాత్రం రాలేదు. ఊపిరి సినిమా ఒక్కటి టాలీవుడ్‌కు బాక్సాఫీస్‌కు కాస్త ఊపు తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో కాసుల పంట పడించింది. సమ్మర్ బరిలో దిగిన సరైనోడు వంద కోట్ల కలెక్షన్లతో సత్తా చాటగా.. అదే సీజన్లో వచ్చిన సర్థార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఆ తరువాత విడుదలైన సుప్రీం, అ.. ఆ.., జెంటిల్మన్ సినిమాలు టాలీవుడ్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేశాయి. ఈ సినిమాలు మంచి వసూళ్లను సాధించి సెకండాఫ్ మీద ఆశలు కల్పించాయి. అయితే ద్వితీయార్థంలో కూడా ఇంత వరకు బాక్సాఫీస్ దుమ్ముదులుపే సినిమా ఒక్కటి కూడా రాలేదు. రోజులు మారాయి, సెల్పీరాజా, నాయకీ లాంటి సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోకపోవటంతో సెకండ్ హాఫ్ డల్‌గా మొదలైంది. ఇటీవల విడుదలైన జక్కన్న వసూళ్ల పరంగా పరవాలేదనిపించినా.. హిట్ టాక్ మాత్రం రాలేదు. అయితే అందమైన ప్రేమకథగా తెరకెక్కిన పెళ్లిచూపులు మాత్రం మరోసారి కొత్త కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది. ప్రస్తుతం సాధారణ సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా రాబోయే సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. వరుసగా స్టార్ హీరోలు బరిలో దిగుతుండటంతో మరోసారి వరుస హిట్స్ అలరిస్తాయన్న ఆశతో ఉన్నారు. ఈ వారం శ్రీరస్తు, శుభమస్తు, మనమంతా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. జనతా గ్యారేజ్‌తో కలెక్షన్ల వేట మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ సినిమాలతో అయినా ఏడాది మొదట్లో చూపించిన జోరు.. టాలీవుడ్ మరోసారి చూపిస్తుందేమో చూడాలి. -
’సెకండ్ హాఫ్’
-
సెకంఢాప్..