breaking news
savjibhai dholakia
-
5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యం
సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి సావ్జీ డోలకియా అనగానే అందరికీ గుర్తు వచ్చేది ప్రతి ఏటా తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం. ఖరీదైన కార్లు ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు ఇలా ఎంతో విలువైన బహుమతులతో కేవం తన ఉద్యోగులను మాత్రమే కాదుయావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. కానీ ఇలా ఖరీదైన బహుమతులు వచ్చేంత స్థాయికి రావడానికి వెనుక ఉన్న కృషిని గురించి ఎపుడైనా ఆలోచించారా? ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదిగి డైమండ్ సామ్రాజ్యాన్ని నిర్మించి, సావ్జీభాయ్గా పేరు గడించిన హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ఛైర్మన్, సావ్జీ ధోలాకియా సక్సెస్ గురించి తెలుసుకుందాం.గుజరాత్‌లోని దుధాల గ్రామానికి చెందిన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు సావ్జీ ధోలాకియా. కుటుంబ ఆర్థిక పరిస్తితుల కారణంగా 5వ తరగతిలోనే చదువు ఆపేశారు. అంతేకాదు 1977లో కేవలం 13 ఏళ్ల వయసులోనే , జేబులో 12 రూపాయలు 50 పైసలు (బస్సు టికెట్‌కు సరిపోయే) సూరత్ నగరానికి పయనమయ్యాడు. అప్పటికి ఆయన మనసులో ఉన్నది కుటుంబానికి పోషించుకోవడం మాత్రమే.ఆలా సూరత్ నగరంలో తొలి ఉద్యోగం వజ్రాల కర్మాగారంలో. నెలకు రూ.179 రూపాయల జీతం. ఈ కొద్ది పాటి జీతంలోంచే ఆయన ప్రతి నెలా రూ. 39 పొదుపు చేసేవాడు. 1984లో తనకంటూ ఏదైనా సాధించాలనే కల మొదలైంది. ఈ కల సాకారానికి పట్టుదల ఓర్పుతోడైంది. తన సోదరులతో కలిసి, అతను ‘హరి కృష్ణ ఎక్స్‌పోర్టర్స్’ అనే చిన్న వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. వజ్రాల వ్యాపారం రిస్క్ తో కూడుకున్నది, పైగా పోటీ. దీంతో మొదట్లో వ్యాపారం చాలా కష్టమయ్యేది. కానీ ప్రజలపై సావ్జీభాయ్కి నమ్మకం వమ్ముకాలేదు. దీనికి తోడు ఉద్యోగులకు కార్మికుల్లాగా కుండా, తన ఇంట్లో మనుషుల్లాగా చూసుకునవాడు. అటు ఉద్యోగుల మనసుల్లోనూ, ఇటు వ్యాపారంలోనే అందనంత ఎత్తుకు ఎదిగాడు.ఉద్యోగులకు బోనస్‌లు ఇవ్వడం మాత్రమే కాదు, ఖరీదైన దీపావళి కానుకలిస్తూ సావ్జీభాయ్ ధోలాకియా వార్తల్లో నిలిచారు. ఆయన నమ్మింది ఒకటే. తన ఉద్యోగులకు బావుంటే.. కంపెనీ బావుంటుంది..వారి అభివృద్దే తన వ్యాపారం అభివృద్ధి అని. అదే నమ్మకం నేటికీ కొనసాగుతోంది. 2025లో కూడా 3 కోట్ల రూపాయలకు పైగా విలువైన మూడు బ్రాండ్ న్యూ మెర్సిడెస్-బెంజ్ GLS SUVలను కానుకగా ఇచ్చాడు. పాతికేళ్ళనుంచి తన కంపెనీలో సేవలందిస్తున్న నమ్మకమైన జట్టు సభ్యులు, ముగ్గురు సీనియర్ ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చాడు. సావ్జీభాయి దృష్టిలో ఇటువంటి బహుమతులు అంటూ దుబారా కాదు, జీవితాంతం కలిసి చేసిన కృషికి, విజయానికి హృదయపూర్వక 'ధన్యవాదాలు'అంటారాయన.ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారంఈ ప్రత్యేకమైన లక్షణమే ఒక చిన్న వర్క్‌షాప్‌గా మొదలైన ఆయన కంపెనీ ప్రపంచ వజ్రాల శక్తి కేంద్రంగా నిలిపింది. ఆభరణాల బ్రాండ్ 'కిస్నా వ్యాపారం ఇప్పుడు రూ. 12,000 కోట్లకు పైమాటే.. 2022లో, భారత ప్రభుత్వం సావ్జీభాయ్ ధోలాకియాను గుజరాత్లో సామాజిక సేవలో ఆయన చేసిన విశిష్ట సేవకు గాను దేశంలోని అత్యున్నత పౌర అవార్డులలో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. బిలియనీర్ ,పద్మశ్రీ అవార్డు గ్రహీత సావ్జీభాయ్ ఇప్పటికీ చాలా సాదా సీదాగా ఉండే వ్యక్తి. ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్ధోలాకియా 1996లో హరి కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. దాన్నే ధోలాకియా ఫౌండేషన్ అని పిలుస్తారు. దీని ద్వారా అనేక కార్యక్రమాలతోపాటు, చెట్లను నాటడం, నీటిని ఆదా చేయడం , భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని రక్షించడం కోసం కోట్లు ఖర్చు చేయడం విశేషం. మొక్కవోని పట్టుదల, అచంలమైన విశ్వాసంతో సాగిన ఆయన జీవితం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తున్నారు. -
దీపావళి కానుకగా ఉద్యోగులకు 600 కార్లు, ఫ్లాట్లు
అత్యుత్తమ ఉద్యోగుల ఎంపిక.. వారిలో 600 మందికి మారుతి సుజుకీ ఆల్టో, సెలరియో కార్లు, మిగిలిన వారి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు, ఖరీదైన ఫ్లాట్లు.. ఇవన్నీ దీపావళి కానుకగా తమ సంస్థ ఎదుగుదలకు కారణమవుతున్న ఉద్యోగులకు ఓ బాస్ ఇచ్చే బహుమతులు.. ఇంతకీ అంత విశాల హృదయం ఉన్న బాస్ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. మీరు ఊహించింది కరక్టే.. ఆయన మరెవరో కాదు సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, హరికృష్ణ డైమండ్స్ ఎక్స్‌పోర్ట్స్ అధినేత సావ్జి దోలకియా. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి ఏటా ఖరీదైన బహుమతులు ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఆయన. ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు వంటి విలువైన గిఫ్ట్‌లతో ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తడం ఆయనకు అలవాటు. ఇటీవల తన కంపెనీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు ఉద్యోగులకు రూ. 3 కోట్ల విలువైన బెంజ్ కార్లు బహుమతిగా ఇచ్చి వారి శ్రమకు తగిన గుర్తింపునిచ్చారు. తాజాగా దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ సుమారు 5 వేల మంది ఉద్యోగులకు బోనస్ ప్రకటించారు. వారిలో 1600 మంది డైమండ్ పాలిష్ నిపుణులను ఎంపిక చేసి కార్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు ఈ మూడింటిలో ఏది కావాలో నిర్ణయించుకునే అవకాశం కూడా వారికే ఇవ్వడం విశేషం. ఇలా వారి కోరిక మేరకే 600 మందికి కార్లను, మిగతా వారి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫ్లాట్లు రాసిచ్చారు సావ్జీ దోలకియా. ఈ జాబితాలో ఉన్న ఇద్దరు మహిళా ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గురువారం కార్ల తాళం చెవులను అందజేశారు కూడా. అయితే గతంతో పోలిస్తే ఈ ఏడాది దోలకియా ఇచ్చిన బహుమతుల విలువ కాస్త తక్కువే. కాగా 1977లో కేవలం రూ.12.5 బస్సు టిక్కెట్ పైసలతో సూరత్ చేరుకున్న దోలకియా.. అంచెలంచెలుగా ఎదిగి వజ్రాల వ్యాపారిగా ప్రస్తుతం రూ.6000 కోట్ల టర్నోవర్ సాధించారు. మూలాలు మర్చిపోకుండా, కేవలం లాభాల కోసమే వెంపర్లాడకుండా ఉద్యోగుల బాగోగుల గురించి కూడా ఆలోచిస్తున్న సావ్జీ దోలకియా గురించి తెలుసుకుంటుంటే మనం కూడా ఆయన కంపెనీలో ఉద్యోగులమై ఉంటే బాగుండేది అన్పిస్తుంది కదూ. -
ఉద్యోగులకు రూ.3 కోట్ల బెంజ్ కార్లు గిఫ్ట్
సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జి దోలకియా గుర్తుండే ఉంటుంది. ప్రతి ఏటా తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు ఇలా ఎంతో విలువైన గిఫ్ట్స్ ఇస్తూ వారి ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. ఐతే ఈసారి కూడా అంతే కాస్ట్లీ గిఫ్ట్‌లను తన ఉద్యోగులకు ఇచ్చాడు ఆ వ్యాపారి. హరికృష్ణ డైమండ్స్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు ఉత్తమ ఉద్యోగులకు బెంజ్ కార్లను బహుమతి ఇచ్చారు. ఈ సీనియర్ ఉద్యోగులు కంపెనీలో చేరి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.3 కోట్ల మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఎస్యూవీ బహుకరించారు ఆ వజ్రాల వ్యాపారి. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఎస్యూవీ ఆన్-రోడ్డు ధర ప్రస్తుతం సూరత్‌లో కోటి రూపాయలుగా ఉంది. నీలేష్ జాదా (40), ముఖేష్ చందర్ (38), మహేష్ చంద్‌పర(43)లు చిన్న వయసులోనే అంటే 13 లేదా 15 ఏళ్లు వయసున్న సమయంలో ఈ వజ్రాల వ్యాపారి కంపెనీలో చేరారు. డైమాండ్స్‌ను కట్ చేయడం నుంచి తమ పనిని నేర్చుకున్న ఈ ఉద్యోగులు, ప్రస్తుతం కంపెనీలో సీనియర్ ఉద్యోగులని, ఎంతో నమ్మకమైన ఉద్యోగులుగా వీరు నిలుస్తున్నట్టు దోలకియా చెప్పారు. సూరత్‌లో ఈ బహుమతుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్ చేతుల మీదుగా ఉద్యోగులకు ఈ బహుమతులను బహుకరించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ గవర్నర్ సైతం హాజరయ్యారు. సావ్జి దోలకియా ఫోటో దోలకియా ఉద్యోగులకు కానుకలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2016లో దీపావళి కానుకగా మొత్తం 1716 మంది ఉద్యోగులకు ఎంపిక చేసి బహుమతులు ఇచ్చారు. అందుకోసం ఏకంగా రూ.51 కోట్లు ఖర్చు చేశారు. కొందరికి ప్లాట్లు ఇస్తే, మరికొందరికి కార్లు ఇచ్చారు. ఇంకొంత మందికి బంగారు ఆభరణాలు, వజ్రాలు గిఫ్ట్‌గా ఇచ్చారు. హరికృష్ణ డైమండ్స్ ఎక్స్పోర్ట్ కంపెనీలో 5500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.6000 కోట్లుగా ఉంది. 1977లో కేవలం రూ.12.5 బస్సు టిక్కెట్ పైసలతో మాత్రమే సూరత్ వచ్చిన దోలకియా, ఇప్పుడు వజ్రాల వ్యాపారిగా రూ.6000 కోట్ల టర్నోవర్‌కు పడగెత్తారు. -
భలే బాసులు!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) జేబులో పది రూపాయిలు ఉంటే రూపాయి దానం చేయడానికి ఆలోచిస్తాం. అలాంటిది రూ.200 కోట్ల విలువైన వాటాను ఉదారంగా వదిలేస్తే. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మూడు పదుల వయసు కూడా లేని యువ సీఈవో ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ఇక్కడ విశేషం. తన వాటా మొత్తాన్ని ఉద్యోగులకు ఇచ్చివేస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు హౌసింగ్‌డాట్‌కామ్ సీఈవో రాహుల్ యాదవ్. సుమారు రూ. 200 కోట్ల విలువైన తన వాటా మొత్తాన్ని కంపెనీలలోని 2,251 మంది స్టాఫ్ కు ఇచ్చేశారాయన. ఈలెక్కన చూసుకుంటే ఒక్కో ఉద్యోగికి రూ.6.50 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు ముడుతుందన్న మాట. ఒక్కో ఉద్యోగికి ఏడాది జీతానికి సమానమైన మొత్తం అందుతుందని అంచనా. ఇప్పటినుంచే డబ్బు గురించి ఆలోచించడం లేదని 26 ఏళ్ల రాహుల్ ప్రకటించడం ఆసక్తి గొలిపే అంశం. సీటెల్ కేంద్రంగా పనిచేస్తున్న క్రెడిట్ కార్డ్ ప్రాసెసర్ కంపెనీ గ్రావిటీ పేమెంట్స్ సంస్థ అధినేత డాన్ ప్రైస్ కూడా ఇలాంటి పనే చేశారు. సిబ్బంది జీతాలు పెంచేందుకు తన వేతనాన్ని వదులుకున్నారు. సుమారు 10 కోట్ల రూపాయల జీతాన్ని త్యాగం చేసి 70 మంది ఉద్యోగులకు పంచారు. వీరిలో 30 మందికి జీతం డబుల్ కావడం విశేషం. అమెరికాలో సగటు వేతన జీవుల జీతం సుమారు రూ.13 లక్షలు ఉండగా, డాన్ ప్రైస్ ఉదారతతో గ్రావిటీ పేమెంట్ ఉద్యోగుల సగటు వేతనం దాదాపు రూ. 45 లక్షలకు చేరింది. బాస్ తన జీతం కుదించుకుని తమ వేతనం పెంచడంతో డాన్ ప్రైస్ పై ఉద్యోగులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలావుంటే నాలోని టీన్స్ గ్రూప్ అధిపతి లీ జినువాన్‌లా తన ఉద్యోగులకు ఊహించని కానుక ఇచ్చారు. ఏకంగా 6,400 మంది తన సంస్థ ఉద్యోగులను హాలిడే టూర్ కోసం ఫ్రాన్స్ తీసుకెళ్లి ఔరా అనిపించారు. రూ. 240 కోట్లు ఖర్చు పెట్టి తొమ్మిది రోజుల పాటు ఫ్రాన్స్ లోని నగరాలన్ని చూపించారు. ఇక పర్యటన చివరి రోజున ఫ్రాన్స్ నగరం నీస్‌లో టీన్స్ ఉద్యోగులంతా ఒకే తరహా దుస్తులు ధరించి మానవహారంతో అందరి దృష్టిని ఆకర్షించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి విదేశీయానం చేయించిన తమ బాస్ ను టీన్స్ గ్రూప్ ఉద్యోగులు తెగ పొగిడేస్తున్నారు. సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలకియా కూడా ఇదేవిధంగా ఊహించని బహుమతులు ఇచ్చి ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. ఢోలకియాకు చెందిన హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో పనిచేసే 1200 మందికి ఉద్యోగులకు గతేడాది దీపావళికి విలువైన కానుకలిచ్చి వార్తల్లో నిలిచారు. 491 ఫియట్ పుంటో కార్లు, 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. ఇంకా ఆభరణాలు మొదలైనవి ఉద్యోగులకు పంచారు. సంస్థ వృద్ధికి తోడ్పడిన ఉద్యోగులను ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిని అందించినట్లు ఢోలకియా చెప్పారు. విలువైన బహుమతులిచ్చిన తమ యజమాని ఢోలకియాకు 'షుక్రియా' అంటూ ధన్యవాదాలు తెలిపారు ఉద్యోగులు.


