ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే మృతి
సీపీఎం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య (92) శనివారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా ఒంగోలులో మరణించారు. ఇటీవల గత కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
1962లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి తొలిసార ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే 1994లో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ప్రకాశం జిల్లాలోని కొరిశపాడు మండలం ప్రాసంగులపాడు చెంచయ్య స్వస్థలం.