breaking news
samiksha
-
తనకన్నా ఆరేళ్ల చిన్నోడితో సెలబ్రిటీ పెళ్లి..! ప్రపోజ్ చేసిన స్టార్ నటి కొడుకు
బాలీవుడ్ సీనియర్ నటి, ‘ది కపిల్ శర్మ షో’ ఫేమ్ అర్చన పూరణ్ సింగ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే ఆమె పెద్ద కుమారుడు ఆర్యమన్ సేతి.. నటి యోగితా బిహానీతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చిన్న కుమారుడు ఆయుష్మాన్ సేతి కూడా తన ప్రేయసికి పెళ్లి ప్రపోజల్ చేయడంతో ఈ కుటుంబంలో మరో శుభవార్త వెలుగులోకి వచ్చింది.ఇటలీలో ప్రపోజల్ఆయుష్మాన్ తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్, ప్రముఖ సెలబ్రిటీ యోగా శిక్షకురాలు సమీక్షా శెట్టికి ఇటలీలో ప్రపోజ్ చేశారు. ఈ అందమైన క్షణాలకు సంబంధించిన ఫొటోలను ఆయుష్మాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఈ ప్రపంచంలో ఎన్ని జన్మలెత్తినా, ఎంతమంది ఉన్నా.. మళ్లీ మళ్లీ నిన్నే నా భాగస్వామిగా ఎంచుకుంటాను’ అంటూ క్యాప్షెన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఆయుష్మాన్ కంటే ఆరేళ్లు పెద్దదిసమీక్షా శెట్టి ప్రముఖ సెలబ్రిటీలకు హెల్త్ అండ్ మైండ్ కోచ్‌గా, యోగా శిక్షకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆమె ఆయుష్మాన్ కంటే ఆరేళ్లు పెద్దవారట. అయినప్పటికీ వయసు వ్యత్యాసాన్ని పట్టించుకోకుండా కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఆయుష్మాన్ నిర్వహించే యూట్యూబ్ వ్లాగ్స్లోనూ సమీక్ష తరచూ కనిపిస్తుంటారు.నటుడిగా ఆయుష్మాన్ గుర్తింపుఅర్చన పూరణ్ సింగ్, పర్మీత్ సేతి దంపతుల చిన్న కుమారుడైన ఆయుష్మాన్.. నటుడిగానే కాకుండా రచయిత, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకుంటున్నారు. మరోవైపు డిజిటల్ మీడియాలో వ్లాగ్స్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం అర్చన పూరణ్ సింగ్ పలు టీవీ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.ఇదీ చదవండి: నడి రోడ్డుపైనే స్టార్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Samiksha Shetty (@samikshashetty_) -
వేగంగా అందరికీ ఇళ్ళ పథకం
సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆదేశం కాకినాడ సిటీ : ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, ఎ¯ŒSటీఆర్ నగర్ పథకం కింద అందరికీ ఇళ్ళు నిర్మించే కార్యక్రమం త్వరితగతిన జరగాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అందరికీ ఇళ్ళు పథకం అమలును జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఏపీటెడ్‌కో అధికారులతో సమీక్షించారు. ఈ పథకం కింద జిల్లాలోని మున్సిపాలిటీలలో 19,242 మంది లబ్ధిదారులకు జిప్లస్ 3 గృహాలు నిర్మిస్తామన్నారు. ఆయా కేటగిరీల ఆధారంగా లబ్ధిదారుల వాటా సొమ్మును జూలై 20లోగా సేకరించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. జిల్లాలో లబ్ధిదారుల వాటా చెల్లించిన వెంటనే బ్యాంక్ లింకేజీ కోసం చర్యలు తీసుకొంటాయన్నారు. ఏపీటెడ్‌కో ఎస్ఈ బి.శ్రీనివాసరావు, ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం ఎం.ఏ అబ్దుల్ రెహమాన్, ఎస్బీఐ జిల్లా కో–ఆరి్డనేటర్ వి.హనుమంతరావు, కాకినాడ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ వై.శ్రీనివాసరావు, ఏపీటెడ్‌కో ఈఈ రీటా, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ‘ఉపాధి’ పనులను అప్లోడ్ చేయండి ఉపాధి హామీ పథకం సమన్వయంతో వివిధ శాఖల ద్వారా నిర్వహించిన పనులన్నిటి సమాచారాన్ని గురువారం మధ్యాహ్నం ఆ¯ŒSలై¯ŒSలో అప్లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టుహాలులో ఉపాధిహామీ పథకం సమన్వయంతో పనులు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, డీఆర్డీఏ, ఫిషరీస్, సెరికల్చర్, పశుసంవర్థక శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ, అంగ¯ŒSవాడీ భవనాలు, శ్మశానాల పనులను, డీఆర్డీఏ ద్వారా చేపట్టిన రోడ్ల వెంట చెట్ల నాటడం, ఐటీడీఏ ద్వారా ఉద్యానవనాల విస్తరణ పనులను ఆయన సమీక్షించారు. ఆగస్టు 15నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, జాయింట్ కలెక్టర్–2, జె.రాధాకృష్ణమూర్తి, డ్వాక్రా పీడీ జి.రాజకుమారి పాల్గొన్నారు.


