breaking news
Samarasimha Reddy Movie
-
మీ ఇంటికొచ్చా.. మీ నట్టింటికొచ్చా.. అంతే వచ్చు!
ఇప్పుడంతా రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. పెద్ద సినిమాలు ఏవీ లేనప్పుడు హీరోల పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. అలా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన సమరసింహారెడ్డి మార్చి 2న రీరిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్‌కు నటుడు నందమూరి చైతన్య కృష్ణ హాజరయ్యాడు. ఈ సినిమాను 14 సార్లు చూశానన్న ఆయన చిత్రంలోని ఓ డైలాగ్ చెప్పే క్రమంలో తడబడ్డాడు. డైలాగ్ సగమే వచ్చు 'మీ ఊరికొచ్చా.. మీ ఇంటికొచ్చా.. మీ నట్టింటికొచ్చా.. తర్వాతేంటి?' అని నసుగుతూ పక్కనున్నవాళ్లను అడిగాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఫక్కుమని నవ్వారు. అక్కడే ఉన్న యాంకర్ మేనరిజం చూపిస్తూ ఈ డైలాగ్ చెప్పమని అడిగింది. దీంతో అతడు తొడ కొడుతూ.. 'ఒరేయ్ వీరరాఘవ రెడ్డి.. మీ ఊరికొచ్చా.. మీ ఇంటికొచ్చా.. మీ నట్టింటికొచ్చా.. నీ మూతి మీద మొలిసింది మీసమైతే..' అని అక్కడితో ఆపేశాడు. తనకు ఇంతవరకే వచ్చని ముగించేశాడు. అన్నిసార్లు చూశానన్నావ్.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నిసార్లు సినిమా చూశానన్నావ్.. ఒక్క డైలాగ్ కూడా చెప్పలేకపోతున్నావేంటి? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా చైతన్య కృష్ణ హీరోగా బ్రీత్ అనే సినిమా చేశాడు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీని బసవతారకరామ క్రియేషన్స్ పై నందమూరి జయకృష్ణ నిర్మించాడు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. #samarasimhareddyrerelease #nandamuribalakrishna #Balakrishna #chaitanyakrishna pic.twitter.com/6p5D54LYxM — Movies4er (@movies4er) February 26, 2024 చదవండి: ఛాన్స్ కోసం ఆ పని చేయాలి.. వద్దని చెత్త ఏరుకుంది.. తర్వాత లక్షలు ఆర్జిస్తూ.. -
అత్యధిక కేంద్రాల్లో 175 రోజులు రన్ అయిన టాప్ 10 సినిమాలు ఇవే
-
బాలయ్య మూవీ ఆఫర్ వదులకున్న నటి రాశి, ఆ సీన్‌పై అభ్యంతరంతోనేనట..
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో 90ల్లో తెరకెక్కిన హిట్ చిత్రాల్లో ‘సమరసింహారెడ్డి’ ఒకటి. బాలకృష్ణ-సిమ్రాన్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సమరసింహారెడ్డి 1999లో సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం, బాలయ్య నటనా విశ్వరూపం, బి.గోపాల్ డైరెక్షన్ ప్రతిభతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. చదవండి: బ్రేకప్ చెప్పుకున్న లవ్‌బర్డ్స్!, క్లారిటీ ఇచ్చిన హీరో రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేసిందంటే ఏ రేంజిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో కొన్ని థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది. ఈ సినిమా విడుదల నిన్న జనవరి 14కు 23 ఏళ్లు. ఈ సందర్భంగా గతంలో ఈ హిట్ చిత్రంపై సీనియర్ నటి, ఒకప్పటి ఫ్యామిలీ హీరోయిన్ రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 1999లో సంక్రాంతి సందర్బంగా విడుదలైన ఈ చిత్రంలో మొదట హీరోయిన్గా రాశిని సంప్రదించగా దీనికి ఆమె నో చెప్పిందట. చదవండి: ఏపీ ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది: తమ్మారెడ్డి భరద్వాజ అయితే రాశి ఈ మూవీ వదులుకోవడానికి గల కారణాలను గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. దీంతో ఈ సంక్రాంతి సందర్భంగా గతంలో ఈ సినిమాపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇంతకి రాశి ఏం చెప్పిందో మరోసారి చూద్దాం. కాగా సమరసింహారెడ్డి మూవీలో హీరోయిన్లుగా సిమ్రాన్, సంఘవి, అంజలా జవేరి నటించారు. ఇందులో మెయిన్ హీరోయిన్గా సిమ్రాన్ నటించింది. అయితే సిమ్రాన్ స్థానంలో మొదట హీరోయిన్ రాశిని అనుకున్నారట. అంతేకాదు దర్శకుడు ఆమెను సంప్రదించి కథ కూడా వివరించాడట. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. అయితే ఆ సినిమాలో ఓ సీన్ నచ్చకపోవడంతో రాశి అంత పెద్ద చిత్రాన్ని వదులుకుంది. అందులో హీరోయిన్‌తో సీతాకోకచిలుక సీన్ ఉంటుంది. ఆ సీన్ పట్ల రాశి అభ్యంతరం వ్యక్తం చేయడంతో దర్శకుడు నటి సిమ్రాన్‌ను కలిసి స్క్రిప్ట్ చెప్పాడట. ఆమెకు కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పిందట సిమ్రాన్. అలా రాశి స్టార్ హీరోయిన బాలయ్య సినిమానే వదులుకుంది. అప్పట్లో ఇది కాస్తా ఆసక్తికిర సంతరించుకుంది. బాలయ్య సినిమాను వదులుకోవడంతో ఓ వర్గం వారి నుంచి రాశి అప్పట్లో విమర్శలు కూడా ఎదుర్కొందట.