మీ ఇంటికొచ్చా.. మీ నట్టింటికొచ్చా.. అంతే వచ్చు! | Sakshi
Sakshi News home page

Nandamuri Chaitanya Krishna: ఆ సినిమా 14 సార్లు చూశా.. డైలాగ్‌ చెప్తూ తడబడ్డ నందమూరి హీరో!

Published Mon, Feb 26 2024 1:38 PM

Samarasimha Reddy Dialogue By Nandamuri Chaitanya Krishna - Sakshi

ఇప్పుడంతా రీరిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. పెద్ద సినిమాలు ఏవీ లేనప్పుడు హీరోల పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. అలా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన సమరసింహారెడ్డి మార్చి 2న రీరిలీజ్‌ కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌కు నటుడు నందమూరి చైతన్య కృష్ణ హాజరయ్యాడు. ఈ సినిమాను 14 సార్లు చూశానన్న ఆయన చిత్రంలోని ఓ డైలాగ్‌ చెప్పే క్రమంలో తడబడ్డాడు.

డైలాగ్‌ సగమే వచ్చు
'మీ ఊరికొచ్చా.. మీ ఇంటికొచ్చా.. మీ నట్టింటికొచ్చా.. తర్వాతేంటి?' అని నసుగుతూ పక్కనున్నవాళ్లను అడిగాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఫక్కుమని నవ్వారు. అక్కడే ఉన్న యాంకర్‌ మేనరిజం చూపిస్తూ ఈ డైలాగ్‌ చెప్పమని అడిగింది. దీంతో అతడు తొడ కొడుతూ.. 'ఒరేయ్‌ వీరరాఘవ రెడ్డి.. మీ ఊరికొచ్చా.. మీ ఇంటికొచ్చా.. మీ నట్టింటికొచ్చా.. నీ మూతి మీద మొలిసింది మీసమైతే..' అని అక్కడితో ఆపేశాడు. తనకు ఇంతవరకే వచ్చని ముగించేశాడు.

అన్నిసార్లు చూశానన్నావ్‌..
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నిసార్లు సినిమా చూశానన్నావ్‌.. ఒక్క డైలాగ్‌ కూడా చెప్పలేకపోతున్నావేంటి? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా చైతన్య కృష్ణ హీరోగా బ్రీత్‌ అనే సినిమా చేశాడు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీని బసవతారకరామ క్రియేషన్స్ పై నందమూరి జయకృష్ణ నిర్మించాడు. డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడింది.

చదవండి: ఛాన్స్‌ కోసం ఆ పని చేయాలి.. వద్దని చెత్త ఏరుకుంది.. తర్వాత లక్షలు ఆర్జిస్తూ..

Advertisement
Advertisement