breaking news
Samaikya Protest
-
చిరంజీవి నివాసం ఎదుట సమైక్య నిరసన
-
చిరంజీవి నివాసం ఎదుట సమైక్య నిరసన
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి చిరంజీవి నివాసం ఎదుట నిరసనకు దిగారు. రోడ్డుపై స్నానాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకుగాను కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను నిరసిస్తూ సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఇంటిని ముట్టడించారు.