లోయర్ ఆర్డర్లో సంజూ శాంసన్.. ఫలితం?
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 సీజన్లో కేరళ రెండో విజయం సాధించింది. తొలి మ్యాచ్లో మధ్యప్రదేశ్ చేతిలో ఓడిన సంజూ శాంసన్ సేన.. అనంతరం మహారాష్ట్రపై గెలిచింది.121 పరుగులుమూడో మ్యాచ్లో ఆంధ్ర చేతిలో ఓడిన కేరళ.. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లో త్రిపురపై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టింది. మొహాలీ వేదికగా టాస్ గెలిచిన త్రిపుర తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 121 పరుగులు సాధించింది.వన్డౌన్లో వచ్చిన శ్రీదమ్ పాల్ (32 బంతుల్లో 41), కెప్టెన్ మణిశంకర్ మురాసింగ్ (31 బంతుల్లో 31)లతో పాటు.. దన్వీర్ అజయ్ సింగ్ (16 బంతుల్లో 20) రాణించాడు. కేరళ బౌలర్లలో కేఎమ్ ఆసిఫ్, కార్తిక్ బి నాయర్, ముహమ్మద్ షరాఫుద్దీన్ తలా రెండు వికెట్లు తీయగా.. బిజు నారాయణన్, అబ్దుల్ బసిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు.నిజార్ మెరుపు అర్ధ శతకంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేరళ జట్టు 13 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 123 పరుగులు చేసింది. తద్వారా ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఓపెనర్లలో రోహన్ కణ్ణుమ్మల్ (22 బంతుల్లో 38) రాణించగా.. గోవింద్ దేవ్ పై (17) నిరాశపరిచాడు. వన్డౌన్లో వచ్చిన సల్మాన్ నిజార్ మెరుపు అర్ధ శతకం (29 బంతుల్లో 51)తో అజేయంగా నిలిచాడు.లోయర్ ఆర్డర్లో సంజూమిగిలిన వారిలో అబ్దుల్ బసిత్ (8), షరాఫుద్దీన్ (2) విఫలం కాగా.. ఏడో స్థానంలో బరిలో దిగిన కెప్టెన్ సంజూ శాంసన్ (3 బంతుల్లో 2) నిజార్తో కలిసి విజయలాంఛనం పూర్తి చేశాడు. త్రిపుర బౌలర్లలో సందీప్ సర్కార్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ మణిశంకర్, చిరంజిత్ పాల్ చెరో వికెట్ పడగొట్టారు.ఇవీ చదవండి: విజేతగా పాకిస్తాన్.. బహిష్కరించిన భారత క్రికెట్ జట్టుశతక్కొట్టిన తిలక్, కుమార్ కుషాగ్ర.. నేపాల్ ఎదుట భారీ లక్ష్యం