breaking news
sakshi education fair
-
Sakshi Education App: టీజీపీఎస్సీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్
సాక్షి ఎడ్యుకేషన్: దసరా పండుగను పురస్కరించుకుని టీజీపీఎస్సీ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు 'సాక్షి ఎడ్యుకేషన్' తరుపున శుభవార్త. పోటీ పరీక్షలకు తీవ్రంగా శ్రమిస్తున్న నిరుద్యోగుల కోసం టీజీపీఎస్సీ ఆన్లైన్ కోర్సులు మరియు టెస్ట్ సిరీస్‌లపై బంపర్ ఆఫర్లను ప్రకటిస్తూ ప్రత్యేక 'దసరా డిస్కౌంట్ సేల్' ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చదువుతున్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మరింత సులభతరం చేసుకునేందుకు ఈ డిస్కౌంట్ సేల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆఫర్ ద్వారా నిపుణులైన ఫ్యాకల్టీ రూపొందించిన అత్యుత్తమ ఆన్లైన్ క్లాసులు, తాజా ఎగ్జామ్ ప్యాట్రన్కు అనుగుణంగా తయారుచేసిన టెస్ట్ సిరీస్‌లను అభ్యర్థులు చాలా తక్కువ ధరకే పొందవచ్చు. 👉పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.. -
సాక్షి ఎడ్యుకేషన్: ఎస్ఐ, కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్, ఆన్లైన్ క్లాసులు
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణాలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. పోలీస్ ఉద్యోగాలకు యువతలో ఎప్పటి నుంచో భారీ డిమాండ్ ఉంది. దీంతో ఈ పోస్టులకు పోటీ కూడా తీవ్రంగానే ఉంటుంది. ప్రతిభ, పట్టుదల ఉన్నప్పటికీ.. సరైన మార్గదర్శకత్వం, ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్, తగినంత ప్రాక్టీస్ లేక చాలామంది అభ్యర్థులు ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా సిలబస్‌ను అర్థం చేసుకుని, ప్రతి అంశంపై పట్టు సాధించడంతో పాటు, పరీక్ష విధానానికి అనుగుణంగా నిరంతరం ప్రాక్టీస్ చేయడం విజయానికి కీలకం.ఈ నేపథ్యంలో.. గత కొన్నేళ్లుగా వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్లో మార్గనిర్దేశం చేస్తున్న సాక్షి ఎడ్యుకేషన్.. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల కోసం ప్రత్యేక ఆన్లైన్ ప్రిపరేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులకు అవసరమైన సమగ్ర ప్రిపరేషన్‌ను అందించేందుకు.. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా Subject-wise Online Classes, Test Series, Previous Question Papers-Solutions ను రూపొందించింది.తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో అందుబాటులో ఉండే ఈ ప్రిపరేషన్ ద్వారా.. సిలబస్‌పై అవగాహన, కాన్సెప్ట్లపై పట్టు, ప్రశ్నలను సాధించే వేగం, పరీక్షా విధానంపై స్పష్టత పెంపొందించుకునే అవకాశం అభ్యర్థులకు లభిస్తుంది. సరైన మార్గదర్శకత్వం.. క్రమబద్ధమైన ప్రిపరేషన్.. నిరంతర ప్రాక్టీస్‌తో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే అభ్యర్థులకు సాక్షి ఎడ్యుకేషన్ అండగా నిలుస్తోంది. మీ లక్ష్యం ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడమే అయితే.. ప్రిపరేషన్లో ఇక ఆలస్యం చేయకండి. ఇప్పుడే Sakshi Education Appను డౌన్లోడ్ చేసుకుని.. SI, Constable Test Series 2026ను పొందండి.పరీక్షకు మరింత సమర్థవంతంగా సిద్ధమయ్యేందుకు.. సబ్జెక్ట్‌పై పట్టు సాధించడంతో పాటు, ప్రశ్నలను వేగంగా, కచ్చితంగా సాధించేలా నిరంతర ప్రాక్టీస్ చేయండి. SI, Constable Test Series 2026ను onlineclasses.sakshieducation.com ద్వారా కూడా పొందవచ్చు. అలాగే Sakshi Education Appను డౌన్లోడ్ చేసుకోండి. -
విద్యార్థులకు దిక్సూచిలా ఎడ్యుకేషన్ ఫెయిర్
‘సాక్షి’ ప్రయత్నం భేష్ అభినందించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తొలిరోజు భారీగా తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు నేడు కూడా... ఖైరతాబాద్: ‘సాక్షి- భవిత’ ఆధ్వర్యంలో శనివారం విశ్వేశ్వరయ్య భవన్లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్-2015ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షి ప్రతి సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎంతో మందికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఇంజినీరింగ్, మెడికల్ రంగాలతోపాటు విదేశీ విద్యనభ్యసించేందుకు విద్యార్థులకు గల అవకాశాలను ఫెయిర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఇక్కడ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసే నిపుణులుండడం అభినందనీయమన్నారు. విద్యార్థులు రెండురోజుల పాటు జరిగే ఈ ఫెయిర్‌ను ఉపయోగించుకోవాలని సూచి ంచారు. కార్యక్రమంలో సాక్షి ఏడీవీటీ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ కె.ఆర్.పి.రెడ్డి, అడ్వర్టైజింగ్ జీఎం రమణకుమార్, డీజీఎం సంతోష్, ఏజీఎం శ్రీనివాస్, వినోద్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన విద్యార్థులు ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను మొదటి రోజు మూడు వేల మందికి పైగా విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మాక్ కౌన్సెలింగ్ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. పలువురు విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కాగా రెండవ రోజు.. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎడ్యుకేషన్ ఫెయిర్ కొనసాగుతుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరై సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. కన్ఫ్యూజన్ తొలగింది.. ఇంటర్ బైపీసీ పూర్తిచేసిన తనకు ఎంచేయాలో తెలియక తికమక పడుతున్నాను. సాక్షి ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను సందర్శించాక ఎలాంటి అవకాశాలున్నాయనే దానిపై అవగాహన ఏర్పడింది. కన్ఫ్యూజన్ తొలగింది. ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. - ఎస్. కీర్తన, చైతన్యపురి మాక్ కౌన్సెలింగ్ బాగుంది ఎంసెట్ రాసిన వారికి మాక్ కౌన్సెలింగ్ నిర్వహించారు. వీటితో పాటు వివిధ కళాశాలకు చెందిన స్టాల్స్‌లో పూర్తి సమాచారం అందుబాటులో ఉంచారు. ర్యాంకుల ఆధారంగా ఎలాంటి అవకాశాలున్నాయనే విషయాలను తెలుసుకునేందుకు ఈ ఫెయిర్ ఉపయోగకరంగా ఉంది. - ఎల్.మౌనిక, విద్యార్థిని, కూకట్పల్లి ఫెయిర్ భేష్ విద్యార్థులకే కాదు తల్లిదండ్రులకు తమ పిల్లలను ఎలాంటి కళాశాలలో చేర్పించాలి, అందుకు గల పూర్తి వివరాలను ఒకే వేదికపై సాక్షి - భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్ ద్వారా ఏర్పాటుచేశారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా విద్యార్థులు తప్పక సందర్శించి వారి భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. - కె.మాణిక్ ప్రభు, అడ్వకేట్, మాదన్నపేట్ ఎంతో ఉపయోగకరంగా ఉంది ఇంటర్ తరువాత ఇంజనీరింగ్ చేయాలా లేదా డిగ్రీ చేయాలా అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడున్న వివిధ రకాల స్టాల్స్‌లో పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. ఫెయిర్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. - సుబ్బలక్ష్మి, కూకట్పల్లి (ఇద్దరు కుమార్తెలతో) -
సాక్షికి విద్యార్థుల కృతజ్ఞతలు
-
విద్యార్థుల 'భవిత'కు దారిదీ!


