breaking news
saifabad police station
-
ఒక్క రోజే 98 సెల్ఫోన్లు మిస్సింగ్
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఊరేగింపులో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు బారీగా తరలిరావడంతో శుక్రవారం ఒక్క రోజే 98 సెల్ పోన్లు మిస్సైనట్లు సైపాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు అందాయి. భారీగా తరలివచ్చిన భక్తులతో కింద పడిన సెల్‌ఫోన్‌ను కూడా వంగి తీసుకోలేకపోవడం, భక్తులు కిక్కిరిసి ఉండటంతో 98 సెల్ఫోన్లు ఒక్క రోజే పోయినట్లు ఫిర్యాదు అందాయి. (చదవండి: రైళ్లిక రయ్!) -
ప్రేమ వివాహం.. స్నేహితుడి కిడ్నాప్
హైదరాబాద్: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయిల ప్రేమ వ్యవహారంలో మరో అబ్బాయి కిడ్నాప్‌నకు గురైన ఉదంతం హబీబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురువారం రాత్రి హబీబ్‌నగర్‌లోని కురుమబస్తీలో కలకలం రేపింది. ఇన్స్పెక్టర్ మధుకర్‌స్వామి తెలిపిన వివరాల ప్రకారం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహావీర్ ఆస్పత్రి సమీపంలోని ఓ బస్తీలో నాగరాజు అనే యువకుడు అదే బస్తీకి చెందిన ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి పెద్దలకు చెప్పకుండా ఉడాయించారు. దీంతో ఏసీ గార్డ్స్ బస్తీకి చెందిన 40 మంది ముస్లిం యువకులు పరారైన ఇరువురి కోసం గాలించారు. ఎక్కడ గాలించినా కనిపించకపోవడంతో హబీబ్‌నగర్ కురుమస్తీలో ఉండే నాగరాజు స్నేహితుడైన చంద్రకిరణ్ ఇంటిపై దాడిచేశారు. ప్రేమికులిద్దరూ ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ చితకబాదారు. అంతటితో ఆగకుండా అతడిని కార్లో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. చంద్రకిరణ్ బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు హబీబ్‌నగర్ పోలీసులు వెంటనే స్పందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆ యువకులు పలాయనం చిత్తగించారు. ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని ఓ బృందం రాత్రంతా శ్రమించి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఇంటిలో చంద్రకిరణ్‌ను బంధించినట్లు తెలుసుకున్నారు. నిందితుల్లో ఇమ్రాన్, చోటు, అఫ్జల్ ప్రధాన సూత్రధారులని గుర్తించారు. వెంటనే దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకొని ఇంటిపై దాడిచేసిన పోలీసులు చంద్రకిరణ్‌ను అదుపులోకి తీసుకోగా, కిడ్నాప్ చేసిన యువకులందరూ పరారయ్యారు. పరారైనవారి కోసం పోలీసులు వేట కొనసాగించారు. -
8 కిలోల బంగారు నగల చోరీ
* పోలీసులమని చెప్పి నగలు లాక్కొని పరారైన దుండగులు * అపహరణకు గురైన వాటి విలువ సుమారు రూ. 2 కోట్లు * రంగంలోకి 6 ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్: ముంబై సేల్స్‌మెన్ నుంచి 8 కిలోల బంగారు ఆభరణాల బ్యాగ్‌ను పోలీసుల మని చెప్పి దుండగులు లాక్కొని పారిపోయారు. చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారు రూ. రెండు కోట్లుంటుందని అంచనా. ఈ సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై బాధితులు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ అశోక్ కథనం ప్రకారం.. ముంబై జవేరీ బజార్‌లోని ఎంవీఎస్ జ్యూయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసే జతిన్ ప్రతాప్సిన్ కపాడియా, దేవేంద్ర త్రివేది, హితేష్, సచిన్ నగరానికి ఈ నెల 8న వచ్చారు. నగరంలోని పలు జ్యూయలరీ షాపుల్లో వారి వద్ద ఉన్న ఆభరణాల మోడల్స్‌ను చూపించారు. ఆర్డర్ ఇచ్చేందుకు ఎవరూ అంగీకరించకపోవడంతో బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10:30 సమయంలో లక్డీకాపూల్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న హెచ్‌కేబీ టూర్స్ అండ్ ట్రావెల్స్ టికెట్ కొనుగోలు చేసేందుకు దేవేంద్ర త్రివేది వెళ్లాడు. హితేష్, సచిన్‌లు కొద్ది దూరంలో ఉన్న బస్సులో ఎక్కారు. నగల బ్యాగ్‌ను జతిన్ ప్రతాప్సిన్ కపాడియా పట్టుకొని నిలబడ్డాడు. ఆ సమయంలో అతని వద్దకు గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి తాము క్రైం బ్రాంచ్ పోలీసులమని చెప్పి, బ్యాగ్‌ను లాక్కొనేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన కపాడియా ఐడీ కార్డులు చూపించాలంటూ ఆరా తీశాడు. ముగ్గురూ అతన్ని రౌండప్ చేసి బ్యాగ్‌ను లాక్కొని బైక్‌పై వచ్చిన మరో వ్యక్తికి అందజేశారు. బైక్‌పై ఉన్న వ్యక్తి బ్యాగ్‌తో క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే ఈ ముగ్గురూ కూడా అక్కడి నుంచి పారిపోయారు. దీంతో కపాడియాతో పాటు దేవేందర్ త్రివేది మరో ఇద్దరు వీరి యజమాని వినిత్గాంధీకి విషయాన్ని ఫోన్లో చెప్పారు. సోమవారం నగరానికి వచ్చిన వినీత్ బాధితులతో కలిసి మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీ చేసినవారు నార్త్ ఇండియన్ సూడో పోలీస్ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సీఐ అశోక్ తెలిపారు. కాగా సంఘటన జరిగిన స్థలాన్ని సోమవారం సాయంత్రం సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ రామ్మోహన్, ఏసీపీ నారాయణ తదితరులు సందర్శించారు.