breaking news
saidulu died
-
వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య ? ముగ్గురు అనుమానితులు..
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలోని పొడిచేడులో శనివారం వెలుగులోకి వచ్చిన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లికి చెందిన నల్ల సైదులు హత్య వివాహేతర సంబంధం నేపథ్యంలోనే జరిగినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. లింగరాజుపల్లి గ్రామానికి చెందిన నల్ల సైదులు(35) బోర్ బండిపై హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పని చేస్తుంటాడు. ఏడాది క్రితమే గ్రామానికి వచ్చి కట్టెకోత పనికి వెళుతున్నాడు. సైదులుకు శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన ధనమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. వివాహనంతరం ఇద్దరు కుమారులు కలిగారు. కొంత కాలం నుంచి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పెద్ద మనుషులు సర్దిచెప్పారు. బుధవారం భార్య ధనమ్మ తన ఇద్దరు కుమారులతో పుట్టింటికి వెళ్లింది. మరునాడు గురువారం భార్యను తీసుకొద్దామని సైదులు గురజాలకు వెళ్లినట్లు తెలిసింది. భార్య రాకపోవడంతో శుక్రవారం సైదులు ఒక్కడే తిరుగు ప్రయాణం అయ్యాడు. అదే రోజు మోత్కూరు మండలం పొడిచేడు మూసీ నది ఒడ్డున గంగదేవమ్మ గుడి సమీపంలో విగతజీవుడై కనిపించాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే సైదులును హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. రామన్నపేట సీఐ మోతిలాల్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు విచారణ జరుగుంది. శనివారం సాయంత్రం లింగరాజుపల్లి గ్రామాన్ని పోలీసులు సందర్శించారు. గ్రామస్తుల నుంచి కూడా వివరాలు సేకరించారు. హతుడి భార్య ధనమ్మతో పాటు గురజాల గ్రామానికి చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. -
స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి
నల్గొండ(వలిగొండ): మూసీ నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘటన వలిగొండ మండలం పొద్దుటూరులో జరిగింది. వలిగొండ పట్టణానికి చెందిన జోగు సైదులు(24) అనే వ్యక్తి ఓ ఫంక్షన్ నిమిత్తం తన కుటుంబం సభ్యులతో కలిసి పొద్దుటూరు గ్రామంలో ఉన్న మేనమామ ఇంటికి వెళ్లాడు. మూసీనదిలో స్నానానికి దిగిన సైదులు నీటిలో మునిగి చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.