breaking news
Sachin Tendulka
-
‘బుమ్రా లేకుండా గెలవడం యాదృచ్ఛికమే
ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముందుగా అనుకున్నట్లుగా మూడు మ్యాచ్‌లే ఆడాడు. అయితే అతను బరిలోకి దిగని బర్మింగ్‌హామ్, ఓవల్ టెస్టులలోనే టీమిండియా గెలిచింది. దాంతో బుమ్రా లేకపోయినా పెద్దగా తేడా రాదని, అతను లేకపోయినా మ్యాచ్‌లు గెలవగలమని కొన్ని విశ్లేషణలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అసాధారణ బౌలర్ అయిన బుమ్రా గురించి తప్పుగా మాట్లాడవద్దంటూ అండగా నిలిచాడు. ‘బుమ్రా సిరీస్‌ను చాలా బాగా మొదలు పెట్టాడు. ఆడింది మూడు మ్యాచ్‌లే అయినా... తొలి టెస్టులో ఒకసారి, మూడో టెస్టులో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ప్రజలు వేరే అంశాలు ముందుకు తెచ్చి అతను లేని టెస్టుల్లో భారత్ గెలిచిందంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ నా అభిప్రాయ ప్రకారం అది యాదృచ్ఛికం మాత్రమే. బుమ్రా ఒక అసాధారణ బౌలర్. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. చాలా కాలంగా నిలకడగా రాణించాడు. నా దృష్టిలో నిస్సందేహంగా అందరికంటే అతను అగ్ర స్థానంలో ఉంటాడు’ అని సచిన్ కితాబిచ్చాడు. మాంచెస్టర్ టెస్టులో స్టోక్స్ ‘షేక్ హ్యాండ్’కు నిరాకరించి జడేజా, సుందర్ ఆటను కొనసాగించడంలో ఎలాంటి తప్పూ లేదని టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘డ్రా’కు అంగీకరించాలని ఇంగ్లండ్ కోరడంలో అర్థం లేదన్న సచిన్... భారత బ్యాటర్లు స్పందించిన తీరుతో తాను వంద శాతం ఏకీభవిస్తున్నానని అన్నాడు. -
Virat Kohli: చరిత్ర సృష్టించిన చి విరాట్ కోహ్లి..
-
తిలక్ వర్మ ఇంట్లో సచిన్, రోహిత్
-
సచిన్, లక్ష్మణ్‌లు కూడా ధోని కనుసన్నల్లోనే
-
సచిన్ మొదటి సెల్ఫీ ఇంటర్వ్యూ ఇదే!
-
సచిన్ మొదటి సెల్ఫీ ఇంటర్వ్యూ ఇదే!
ఇటు స్మార్ట్ ఫోన్ లవర్స్, అటు క్రికెట్ అభిమానులు నప్పేలా, మెచ్చేలా ప్రముఖ టెక్నాలజీ సంస్థ స్మార్ట్రాన్ తాజాగా ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఆ ఫోన్ ను క్రికెట్ దేవుడు సచిన్ టెండ్కూలర్ పేరులోని మొదటి అక్షరాలను తీసుకుని ఎస్ఆర్ టి.ఫోన్ పేరుతో దీన్ని విడుదల చేశారు. ఈ ఫోన్ లాంచ్ చేసే సందర్భంగా తనకి ఎస్ఆర్టీ.ఫోన్ ఎలా స్ఫూర్తినిచ్చిందో సచిన్ వివరించారు. అంతేకాక కేవలం పాశ్చాత్య ఉత్పత్తులపైన ఆధారపడటమే కాకుండా.. ప్రపంచ టెక్నాలజీకి దేశీయ స్టార్టప్ లు టెక్నాలజీ ఎలా అందించే దిశగా వచ్చాయో తెలిపారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ తో సంస్థ కోఫౌండర్ మహేశ్ లింగారెడ్డి ఓ సెల్ఫీ ఇంటర్య్యూను చేపట్టారు. ఇంతకముందు సచిన్ టెండూల్కర్ ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ, సెల్ఫీ ఇంటర్వ్యూ మాత్రం స్పెషల్. ఇప్పటివరకు సచిన్ ఎలాంటి సెల్ఫీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఇదే మొదటి సెల్ఫీ ఇంటర్వ్యూ అని తెలిసింది. ఈ ఇంటర్వ్యూలో మేకిన్ ఇండియా టెక్ గురించి సచిన్ ఎంతో గొప్పగా వివరించారు. మరోవైపు స్మార్ట్రాన్ ప్రాజెక్ట్‌లో టెండూల్కర్ స్ట్రాటజిక్ పార్టనర్ కావడం విశేషం. ఫింగర్ ప్రింట్ సెన్సిర్ తోపాటు ఆ ప్రతి ఫోన్ బ్యాక్ కవర్‌పై టెండూల్కర్ ఆటోగ్రాఫ్ రావడం ఎస్ఆర్టీ ఫోన్ స్పెషాలిటీ.