breaking news
Rural housing loan segment
-
కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ అధికారికి మూడేళ్లు జైలు
భువనేశ్వర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కటక్–బరాబటి ఎమ్మెల్యే మహ్మద్ మొకీమ్‌కు న్యాయస్థానం మూడేళ్లు జైలుశిక్ష విధించింది. భువనేశ్వర్ లోని విజిలెన్స్ స్పెషల్ జడ్జి కోర్టు విచారణ పురస్కరించుకుని ఈ తీర్పు గురువారం వెలువడింది. ఒడిశా గ్రామీణ గృహనిర్మాణం, అభివృద్ధి కార్పొరేషన్(ఓఆర్‌హెచ్‌డీసీ) అవినీతి వ్యవహారంలో ఆయన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్నారు. 2001లో ఓఆర్‌హెచ్‌డీసీ పలువురికి అక్రమంగా రుణాలు మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో సమగ్రంగా రూ.1.5 కోట్లు దారి మళ్లాయి. దీనిలో ఎమ్మెల్యే కూడా లబ్ధిదారుడిగా పేరు ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి వినోద్‌కుమార్ ఈ అక్రమంలో పాత్రధారిగా పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో దాఖలైన కేసు విచారణ గురువారంతో ముగించిన విజిలెన్స్ కోర్టు.. తుది తీర్పు వెల్లడించింది. దీని ప్రకారం ఎమ్మెల్యే మొకీత్‌తో పాటు ప్రస్తుతం ఉద్యోగ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి వినోద్‌కుమార్, ఓఆర్‌హెచ్‌డీసీ సెక్రటరీ స్వస్తిరంజన మహంతి, మెట్రో బిల్డర్స్ సంస్థ డైరెక్టర్ పియూష్ మహంతికి విజిలెన్స్ కోర్టు మూడేళ్లు కారాగార శిక్ష ప్రకటించింది. అలాగే రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మొత్తం చెల్లించని పక్షంలో అదనంగా మరో 6 మాసాలు కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. -
గ్రామీణ గృహ రుణాల్లోకి మాగ్మా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంకింగేతర రుణ సంస్థ మాగ్మా ఫిన్‌కార్ప్ గ్రామీణ గృహ రుణ విభాగంలోకి అడుగిడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టిన సంస్థ 2015-16లోనే ఈ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఆస్తి తనఖాపై రూ.3 లక్షల వరకు రుణమిస్తారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో వారసత్వంగా ఆస్తులు సంక్రమిస్తాయి. చాలా మంది వద్ద సరైన పత్రాలు ఉండవు. ఇటువంటి వారికి బ్యాంకుల నుంచి రుణం అంత సులభం కాదు. అర్హత గలవారికి రుణం ఇస్తాం’ అని మాగ్మా ఫిన్‌కార్ప్ వైస్ ప్రెసిడెంట్, ట్రాక్టర్స్ విభాగం నేషనల్ సేల్స్ హెడ్ ధ్రుబాశిష్ భట్టాచార్య చెప్పారు. కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ఏవీపీ సూర్యకాంత్ మిశ్రాతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లోన్ల విషయంలో స్వయం ఉపాధి పొందుతున్న చిన్న చిన్న కాంట్రాక్టర్లకు మాత్రమే రుణాలివ్వాలని కంపెనీ నిర్ణయించింది. రిస్క్ తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ధ్రుబాశిష్ భట్టాచార్య పేర్కొన్నారు. 2015-16లో తెలంగాణలో 20 శాతం వృద్ధిని ల క్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. ట్రాక్టర్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఏప్రిల్-ఆగస్టు కాలంలో 15 శాతం తిరోగమన వృద్ధి నమోదైంది.