breaking news
RTC contract
-
ఇతర జిల్లాల్లో డ్యూటీలొద్దు
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్లను చిత్తూరు జిల్లాకు వెళ్లి పనిచేయాలని ఆర్టీసీ ఆర్ఎం ఆదేశిస్తున్నారని ఈ విధానం సరికాదంటూ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ పోర్టికో వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తాడంగి సాయిబాబు, పాలక రంజిత్ కుమార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ 2015 జూలై నుంచి వివిధ డిపోల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు ఏడాది కాలంగా పనిచేయించకుండా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పనిచేయాలని లేకుంటే ఉద్యోగం మానేయండని ఆర్ఎం ఆదేశిస్తున్నారన్నారు. సంవత్సరానికి కేవలం ఐదారు నెలలే పని కల్పిస్తూ ఇప్పుడు ఉన్న పళంగా ఇతర జిల్లాలకు వెళ్లమనడం భావ్యం కాదన్నారు. ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను పద్ధతి ప్రకారం రెగ్యులర్పోస్టుల్లో నియమించాల్సి ఉన్నా కాంట్రాక్టు పద్ధతిలో నియమించడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఇతర జిల్లాలకు వెళ్లి పనిచేయాలనీ లేకుంటే మానేయండనడం ఎంతవరకూ సమంజసమని వారు ప్రశ్నిం చారు. ఈ సందర్భంగా సంవత్సర కాలమంతా డ్యూటీలు కల్పించి డిపోల పరిధిలోనే డ్యూటీలు వేయాలని కోరుతూ వారు జిల్లా అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. -
కొందరి కలే నెరవేరింది..
నెల్లూరు (దర్గామిట్ట): శాశ్వత ఉద్యోగులు కావాలనే ఆర్టీసీ కాంట్రాక్ట్ సిబ్బంది కల కొందరికే నెరవేరింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలువురు డ్రైవర్లు, కండక్టర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం రాత్రి ఆర్టీసీ కార్యాలయానికి అందాయి. ఈ నెల ఒకటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గురిం్తపు పొందుతారు. వీరికి ప్రభుత్వ నుంచి లభించే అన్ని రాయితీలు వర్తిస్తాయి. 2012 డిసెంబర్ 31వ తేదీలోపు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో 57 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లు ఉద్యోగులు పర్మినెంట్ అయ్యారు. వీరిలో 20 మంది డ్రైవర్లు, 37 మంది కండక్టర్లు ఉన్నారు. మరికొందరికి అన్యాయం ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓతో కొందరిలో ఆనందం, మరికొందరిలో ఆవేదన నింపింది. 2012 డిసెంబర్‌కు ముందు చేరి ఇప్పటి వరకు రెగ్యులర్‌గా విధులు నిర్వహించిన వారికే జీఓ వర్తిస్తుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే 2012 డిసెంబర్‌కు ముందు దాదాపు 150 మంది డ్రైవర్లు, కండక్టర్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధుల్లో చేరారు. కొన్ని కారణాలతో అందరూ రెగ్యులర్‌గా విధులు నిర్వహించలేక పోయారు. ప్రభు త్వ తాజా ఉత్తర్వులతో దాదాపు 130 మంది ఉద్యోగులకు అన్యాయం జరిగిందని పలు ఆర్టీసీ యూనియన్ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కేవలం ఆర్టీసీ జిల్లా అధికారుల తప్పిదం కారణంగానే మిగిలిన ఉద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా లోపాలను సరిదిద్ది మిగిలిన వారిని కూడా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. హర్షం : ఆర్టీసీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న కొందరు డ్రైవర్లు, కండక్టర్లను పర్మినెంట్ చేయడంపై నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజనల్ కార్యదర్శి రమణరాజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి కూడా ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన ఉద్యోగులను కూడా పర్మినెంట్ చేయాలని వారిద్దరూ వేర్వేరుగా కోరారు.